అమ్మాయివేనా అన్నారు!
close
Published : 16/08/2021 01:11 IST

అమ్మాయివేనా అన్నారు!

కోటిన్నర ఉపకారవేతనం సాధించింది!

అమ్మాయిలా లేవు.. ఇంత పొడవున్నావేంటి. అవునూ నువ్వసలు ఆడపిల్లవేనా... ఇలాంటి హేళనలను ఎంతో కాలం ఎదుర్కొందా అమ్మాయి. ఎందుకంటే తన ఎత్తు 5.10 అడుగులు. అయితే ఆ విమర్శలనే అదనపు శక్తిగా మార్చుకుంది. డిస్కస్‌ త్రోయర్‌గా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దేశంలోనే అత్యధిక ఉపకార వేతనాన్ని అందుకున్న క్రీడాకారిణిగా నిలిచింది 18 ఏళ్ల కృష్ణా జయశంకర్‌. తన విజయగాథ ఇదీ...

కృష్ణ కుటుంబమంతా క్రీడాకారులే. నాన్న జయశంకర్‌ మీనన్‌, అమ్మ ప్రసన్న కుమారి బాస్కెట్‌బాల్‌ క్రీడాకారులు. వాళ్లది చెన్నై. రైల్వే సౌత్‌జోన్‌ క్రీడాకారులకు కోచ్‌గా పనిచేసే అమ్మే తనకు ప్రేరణ. కృష్ణకు ఓ చెల్లి, అర్చన. పొడవు, దేహ దారుఢ్యం అమ్మానాన్నల నుంచి కృష్ణకు వచ్చాయి. అయితే అవి చిన్నప్పటి నుంచి శాపంగానే ఉండేవి. బడిలో తోటి పిల్లలు ఇంత పొడవుగా ఉన్నావేంటి అని వెక్కిరించే వారు. తనతో కలిసేవారు కాదు. తన సైజుకు చెప్పులు దొరికేవి కాదు. చదువులో ముందున్నా, పొడవు వల్ల వెనుక బెంచీ విద్యార్థినిగా మారిపోవాల్సి వచ్చింది. వారికి బదులు చెప్పలేక, తానెందుకు అందరికన్నా పొడవుగా ఉన్నానో తెలియక కుంగుబాటుకు గురయ్యేది.

చెల్లి తోడు

కృష్ణ మానసిక వేదనను మొదటగా ఆమె చెల్లి గుర్తించింది. ఇవన్నీ అదనపు శక్తిగా తీసుకోవాలని ధైర్యం చెప్పేది. లోపం అనుకుంటున్న ఎత్తుతో ఏదైనా సాధించాలని స్ఫూర్తి నింపేది. చెల్లి కౌన్సిలింగ్‌ కృష్ణ మీద బాగానే పని చేసింది. క్రీడల్లో అడుగుపెట్టాలనుకుంది. టెన్నిస్‌ ఆడటం మొదలుపెట్టింది. తర్వాత బ్యాడ్మింటన్‌ ఆడేది. అయితే వీటిపై ఆసక్తి పెరగలేదామెకు. అప్పటికే 5.3 అడుగుల ఎత్తులో ఉండే తననను అయిదో తరగతిలో పీటీ మాస్టారు షాట్‌పుట్‌లో చేరమని ప్రోత్సహించారు. ఫీల్డ్‌ కోచ్‌ ఒకరు డిస్కస్‌కు సరైన శారీరక దారుఢ్యం ఉందని సలహా ఇవ్వడంతో 2018లో ఈ క్రీడను ఎంచుకుందీమె.

జీన్స్‌ ...

ఎత్తుగా ఉండటం, క్రీడలపై ఆసక్తి వంటివన్నీ తన జీన్స్‌లోనే ఉన్నాయంటుంది కృష్ణ. ‘అమ్మానాన్నలిద్దరూ బాగా పొడవుగా ఉంటారు. నాన్నలాగే నావీ వెడల్పైన భుజాలు. కోచ్‌ సలహాతో డిస్కస్‌ త్రోలో చేరా. సునాయాసంగానే మెలకువలు నేర్చుకున్నా. స్థానిక పోటీల్లో విజేతగా నిలిచే నాకు టెన్విక్‌ క్రీడా సంస్థ మంచి అవకాశాన్ని కల్పించింది. అలా నా 16వ ఏటనే గుంటూరులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ స్పోర్ట్స్‌ అకాడెమీలో శిక్షణ తీసుకున్నా. క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే అందించిన ఆర్థిక చేయూతతో కోచ్‌ వాస్సెల్‌ దగ్గర చేరే అవకాశం వచ్చింది. అది నా క్రీడా జీవితంలో మలుపు’ అని గుర్తు చేసుకుంది కృష్ణ.

పతకాలు

జాతీయ స్థాయి అండర్‌ - 19 పోటీల్లో రజత పతకాన్ని సాధించింది. ఈనెల 17 నుంచి 22 వరకు నైరోబీ, కెన్యాలో జరుగనున్న ‘వరల్డ్‌ అండర్‌- 20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌’లో పాల్గొనడానికి కింగ్‌స్టన్‌లోని త్రో క్లబ్‌ ‘త్రోయర్స్‌ ఆర్‌ యుఎస్‌’లో శిక్షణ తీసుకుంటోంది. కోచ్‌ హోరేస్‌ మైఖేల్‌ వాసెల్‌ పర్యవేక్షణలో శిక్షణ అందుకుంటోంది. తాజాగా కృష్ణకు టెక్సాస్‌ విశ్వవిద్యాలయం ‘అకడెమిక్‌ అండ్‌ అథ్లెటిక్‌ స్కాలర్‌షిప్‌’గా రూ.1.5 కోట్లు అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇంత భారీ ఉపకారవేతనాన్ని అందుకోవడం చాలా సంతోషంగా, గర్వంగా ఉందంటోంది కృష్ణ. ‘నేనెందుకిలా అందరికన్నా భిన్నంగా, పొడుగ్గా ఉన్నానా అని బాధపడే దాన్ని. అయితే అదే వేదనను విజయంగా మార్చుకున్నాను. ఇప్పుడు దేశంలో జూనియర్‌ గర్ల్స్‌ డిస్కస్‌ త్రోలో నెంబర్‌ వన్‌ ర్యాంకు నాది. గతంలో ట్రిపుల్‌ జంపర్‌ లిజాబెత్‌ కరోలినే ఈ స్కాలర్‌షిప్‌ను అందుకోగా, నేను రెండో అమ్మాయిని’ అని అంటున్న కృష్ణ  అంతర్జాతీయ పోటీల్లోనూ విజయ పతాకాన్ని ఎగురవేయాలని ఆశిద్దాం.మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని