ఆమె కృషి... క్షతగాత్రులకు వరం
close
Published : 17/08/2021 01:43 IST

ఆమె కృషి... క్షతగాత్రులకు వరం

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఆరు శాతం మన దేశంలోనే చోటు చేసుకుంటున్నాయి. కేంద్రప్రభుత్వం తాజాగా చేసిన సర్వే ప్రకారం రహదారుల ప్రమాదాల్లో నాలుగో వంతు మంది మృతి చెందడం లేదా తీవ్రగాయాలపాలవుతున్నారని తేలింది. ప్రమాదం జరిగినప్పుడు తక్షణం స్పందించి విరిగిపోయిన అవయవాలను మరింత పాడవకుండా కాపాడగలిగితే, చాలామంది బాధితులు వికలాంగులు కాకుండా కాపాడవచ్చు. ఈ దిశగానే ఆలోచించింది కోమల్‌సనాస్‌.  ఆ ఆలోచన తనకు పలు అవార్డులనూ తెచ్చిపెట్టింది.

కోమల్‌కు చిన్నప్పటి నుంచి సైన్స్‌ అంటే ఆసక్తి. అమ్మానాన్నల కోరిక మేరకు కొల్హాపూర్‌లోని శివాజీ విశ్వవిద్యాలయంలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసినా, నూతన ఆవిష్కరణలపై ఆసక్తి మాత్రం అలాగే ఉండి పోయింది. దాంతో ఓ మెడికల్‌ డివైస్‌ సంస్థలో డిజైనర్‌గా చేరింది. మూడేళ్లపాటు చికిత్సకు సంబంధించిన ప్రాజెక్టులకు పనిచేసింది. ఆ అనుభవంతో మెడి ఆశా టెక్నాలజీస్‌ సంస్థకు కో ఫౌండర్‌, సీఓఓ అయ్యింది. ఇక్కడ మెడికల్‌ డివైస్‌లు తయారు చేయడంలో కీలకపాత్ర పోషించేది. ఈ దిశగా ఎముకలు విరిగినప్పుడు చికిత్స జరిగేలోపు వాటిని కదలకుండా స్థిరంగా ఉంచేలా ‘ఫ్రాక్టోఎయిడ్‌’ను డిజైన్‌ చేసింది.

నష్టమెక్కువ జరగకుండా...

ఏదైనా ప్రమాదంలో ఎముకలు విరిగినప్పుడు చికిత్స జరగడం ఆలస్యమైతే బాధితుడికి మరింత నష్టం జరుగుతుంది అంటుంది  కోమల్‌. ‘ఎముకలు విరిగితే చుట్టూ ఉన్న కండరాలు, రక్తనాళాలు దెబ్బతింటాయి. దీంతో రక్తస్రావం మొదలవుతుంది. బాధితుడిని సంఘటనాస్థలం నుంచి ఆసుపత్రికి చేర్చేలోపు లోపల గాయపడిన ఎముకలు కదులుతుంటాయి. ఈ కారణంగా అంతర్లీనంగా రక్తస్రావం పెరిగే అవకాశం ఉంది. ప్రమాదంలో కన్నా, చికిత్స జరిగే లోపు చోటుచేసుకునే ఈ అంశాలు నష్టాన్ని పెంచుతాయి. దీనివల్ల అవయవాలు బాగా దెబ్బతిని, శాశ్వత వైకల్యం ప్రమాదం ఉంది. ఇలా జరగకూడదనే ‘ఫ్రాక్టో ఎయిడ్‌’ డివైస్‌ను రూపొందించాం. ఇది టేప్‌లా ఉంటుంది. దీన్ని కొన్ని నిమిషాలు నీటిలో నానబెట్టి పిండేయాలి. ఆ తర్వాత దెబ్బతిన్న అవయవానికి చుట్టేస్తే చాలు. నిమిషాల్లోనే విరిగిన ఎముకకు సపోర్ట్‌ ఇస్తుంది. దీనిపై పుణెలో కొన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ట్రయల్స్‌ నిర్వహిస్తే బాగా పని చేస్తున్నట్లు తేలింది. ఈ డివైస్‌ను క్రీడాకారులు, సైనికదళం అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకోచ్చు. క్రీడా సంస్థలు, నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌(ఎన్డీఆరెఫ్‌) వంటి వాటికి ఈ ఆవిష్కరణను చేర్చడానికి ప్రయత్నిస్తున్నాం. త్వరలో దీన్ని అందరికీ అందుబాటులో ఉండేలా చేయడానికి కృషి చేస్తున్నాం’ అంటున్న కోమల్‌, తాజాగా నూతనావిష్కరణల చేసిన మహిళలకు అందించే ‘ఆసియాస్‌ 1000 వుమెన్‌ అవార్డు’ను దక్కించుకుంది.మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని