అవరోధాలు దాటుకుని.. దూసుకెళ్తోంది!
close
Published : 21/08/2021 02:47 IST

అవరోధాలు దాటుకుని.. దూసుకెళ్తోంది!

ఉన్నత విద్యలోనే కాదు.. బైక్‌ మీదా దూసుకెళ్లేదా అమ్మాయి. అమ్మానాన్నల ప్రోత్సాహమూ తోడైంది. అంతలో పెళ్లి.. దాంతో పాటు ఆంక్షలు. గృహిణిగానే పరిమితమైంది. తర్వాత చిన్న తోడ్పాటు మళ్లీ తన ఆసక్తిని మేల్కొల్పడమే కాక బైకర్నీనీ చేసింది. తాజాగా కశ్మీర్‌లో 11 రోజుల్లో 8000 కి.మీ. బైకుపై ప్రయాణించిన అమితా సింగ్‌ గురించే ఇదంతా!

చిన్నప్పటి నుంచీ అమితకి బైకులంటే చాలా ఇష్టం. నేర్చుకుంటానంటే అమ్మానాన్నలు కాదనలేదు. ఏడో తరగతి నుంచే అబ్బాయిలతో పోటీపడి మరీ నడిపేది. చదువులోనూ ముందుండేది. ఎంబీఏలో యూనివర్సిటీ స్థాయిలో బంగారు పతకాన్ని అందుకుంది. ఈమెది ఒడిశా, భువనేశ్వర్‌ దగ్గర్లోని పోఖరిపుట్‌. 2001లో అమితకు పెళ్లైంది. వాళ్లది సంప్రదాయ కుటుంబం. బైక్‌ సంగతేమో కానీ.. ఇంట్లోంచి బయటకు వచ్చే వీలే లేకపోయింది. రోజంతా తల నిండుగా చీర కప్పుకునే ఉండటంతోపాటు బయటి వాళ్లతో మాట్లాడే స్వేచ్ఛా లేకుండా పోయింది. దాదాపుగా ఎనిమిదేళ్లు అలానే గడిచాయి. తన ఆసక్తులను, అభిరుచులను గ్రహించి భర్త అందించిన ప్రోత్సాహంతో సంప్రదాయాల విషయంలో సడలింపు దొరికింది.

తర్వాతి కాలంలో బైకు మీద ఆమెకున్న ఆసక్తి గురించీ తెలిసింది. మళ్లీ ప్రయత్నించమన్నాడు. దీంతో 15 ఏళ్ల తర్వాత 2015లో అమిత మళ్లీ బైకు నడపడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆమెకు బైకర్నీ క్లబ్‌ల గురించి తెలిసింది. ఒడిశా బైకర్నీ క్లబ్‌లో చేరింది. తను చేసే ప్రయాణాలకు ఓ సందేశమూ ఉండేలా చూసుకుంటుంది. బలాత్కారాలకు వ్యతిరేకంగా, అత్యాచారానికి గురైన బాధితులకు అండగా, అంధుల కోసం.. బైక్‌ ఈవెంట్‌ రైడ్‌లను నిర్వహించింది. ఈ ఆగస్టు 3న ప్రారంభమై తన స్పోర్ట్స్‌ బైక్‌ మీద 11 రోజుల్లో 8000 కి.మీ. కశ్మీర్‌ లోయల్లో ప్రయాణించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. శ్రీనగర్‌- కార్గిల్‌- లేహ్‌ల్లో ఈ ప్రయాణం సాగించింది.

‘పెళ్లి తర్వాత నా కలలను మధ్యలోనే ఆపేయాల్సింది. కుటుంబమే లోకమైపోయింది. భర్త ప్రోత్సాహంతో మళ్లీ ప్రారంభించా. ఇప్పటివరకూ జాతీయ స్థాయిలోనే ప్రయాణించా. భవిష్యత్‌లో ఇండోనేషియా, మలేషియా, శ్రీలంక, భూటాన్‌లను బైక్‌మీద చుట్టేసే ఆలోచనలో ఉన్నా’ అంటోంది 37 ఏళ్ల అమిత. ఈమె విమెన్‌ ఇంటర్నేషనల్‌ మెటార్‌ సైకిల్‌ అసోసియేషన్‌ (డబ్ల్యూఐఎంఏ), బైకింగ్‌ కమ్యూనిటీ ఆఫ్‌ ఇండియా (బీసీఐ)లకు ఒడిశా తరఫున ప్రాతినిధ్యం వహిస్తోంది. అక్కడి చేనేత, చేతివృత్తుల వారి తరఫున ప్రచారాన్నీ చేస్తోంది. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ప్రభుత్వం నుంచి నేషన్‌ ఎక్సలెన్స్‌ అవార్డునీ అందుకుంది.మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని