వెయ్యి వీడియోలు చేశా!
close
Published : 28/08/2021 00:36 IST

వెయ్యి వీడియోలు చేశా!

చిన్నప్పటి నుంచి అన్నింట్లోనూ చురుకే. నటన అంటే ఇష్టం. ఇంజినీరింగ్‌ చదువుతూనే సరదాగా వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టేది. ఆ వీడియోలే తన జీవితాన్ని మార్చేశాయి. నచ్చిన రంగంలో అవకాశాల్ని అందించాయి.  ఇదంతా ఈటీవీలో ప్రసారం అవుతోన్న ‘రావోయి చందమామ’ సీరియల్‌ హీరోయిన్‌ హారిక సాధు గురించి. కొద్ది కాలంలోనే చక్కటి గుర్తింపు తెచ్చుకున్న హారికతో ‘వసుంధర’ ముచ్చటించింది.

మాది అనంతపురం. అమ్మానాన్న... హర్‌నాథ్‌, నాగమణి. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. నాకో తమ్ముడు... డిగ్రీ చదువుతున్నాడు. అనంతపురం ఇంటెల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ నుంచి బి.టెక్‌. చేశా. చిన్నప్పటి నుంచే నేను చాలా చురుకు. చదువు, సాంస్కృతిక కార్యక్రమాలు... ఇలా అన్నింట్లోనూ యాక్టివ్‌. స్కూల్‌లో బోలెడు బహుమతులొచ్చేవి. కాలేజీలో ఏ సాంస్కృతిక కార్యక్రమం జరిగినా నేనుండాల్సిందే. నాన్న క్లాసికల్‌ డ్యాన్సర్‌. ఆయనకి నటన అంటే చాలా ఇష్టం. కుటుంబ సమస్యల వల్ల ఈ రంగంలోకి రాలేకపోయారు. దాంతో నా ఇష్టాన్ని ప్రోత్సహించారు. వెయ్యికి పైగా టిక్‌టాక్‌, డబ్‌స్మాష్‌ వీడియోలను చేశా. వాటిని ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాల ద్వారా పంచుకుంటూ ఉంటా.

ఆ వీడియోల ద్వారానే నాకు గుర్తింపు వచ్చింది. మొదట జెమినిలో ‘కళ్యాణి’ సీరియల్‌లో అవకాశం లభించింది. అందులో అంధురాలిగా నటించా. ఈ పాత్ర ద్వారా ఎంతో మందికి పరిచితురాలినయ్యా. లాక్‌డౌన్‌ వల్ల ఆ సీరియల్‌ ఆగిపోయింది. తర్వాత తమిళంలో ‘తిరుమగళ్‌’లో అంజలిగా చేస్తున్నా. తమిళ రచయిత శ్యామ్‌ ద్వారా తెలుసుకుని, నిర్మాతలు ‘కళ్యాణి’లో నా నటన చూసి అవకాశం ఇచ్చారు.

ఇది కాకపోతే... ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. నటనలో ఓనమాలన్నీ ఇక్కడే నేర్చుకున్నా. నటిని కాకపోతే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినో, ఎయిర్‌ హోస్టెస్‌నో అయ్యేదాన్ని.

కొత్త భాష... తిరుమగళ్‌లో అవకాశానికి ఆనంద పడినా.. భాష తెలియదని భయపడ్డా. అమ్మే నా వెన్ను తట్టింది. దాంతో ధైర్యంగా ముందడుగు వేశా. భాష రాకపోయినా మొదటి ఎపిసోడ్‌ బాగా చేశావంటూ దర్శకుడు మెచ్చుకున్నారు. అప్పుడు ఆశ్చర్యం, ఆనందం రెండూ కలిగాయి. ఎలాగైనా తమిళం నేర్చుకోవాలనుకున్నా. ట్రాన్స్‌లేటర్‌ను పెట్టుకుని, ప్రతి పదమూ తెలుసుకునే దాన్ని. ఇప్పుడు తమిళంలో గలగలా మాట్లాడేస్తా.

కష్టాలు...  ‘రావోయి చందమామ’లో ఓ సన్నివేశంలో చెప్పులు లేకుండా రాళ్లలో పరుగెత్తాలి. అదీ రాత్రి పూట షూటింగ్‌. అప్పుడు పాదాలకు బాగా దెబ్బలు తగిలాయి. బురదలో పడిపోయా. అయినా అలానే చేశా. ఇవన్నీ పెద్ద కష్టాలు కాదు. నచ్చిన రంగంలో ఉన్నానన్నదే సంతోషం. కాకపోతే... అమ్మానాన్నలకు దూరంగా ఉంటున్నాననేది కాస్త బాధ. హీరోల్లో... విజయ్‌దేవరకొండ, రానా. హీరోయిన్లలో... మాధురీ దీక్షిత్‌, సౌందర్య, రమ్యకృష్ణ... ఇప్పటి వారిలో కీర్తి సురేష్‌ అంటే చాలా ఇష్టం. మ్యూజిక్‌ బాగా వింటా. కుక్క పిల్లలతో ఆడుకోవడం మరీ ఇష్టం.

లాక్‌డౌన్‌లో వంట..  ‘కళ్యాణి’ చేసేటప్పుడు సన్నగా ఉండే దాన్ని. కాస్త లావుగా ఉంటే బాగుంటుందని అందరూ చెప్పడంతో లాక్‌డౌన్‌లో ఇష్టమైనవి తిన్నా. మంచి శరీరాకృతి కోసం వర్కవుట్స్‌కి ఎక్కువ సమయం కేటాయించా. అమ్మచేసే కొబ్బరిచట్నీ, గులాబ్‌జామ్‌లంటే లొట్టలేస్తా. తినడమే కాదు... ఈ ఖాళీలో అమ్మ దగ్గర వంట నేర్చుకున్నా. వెజ్‌ బిర్యానీ బ్రహ్మాండంగా చేస్తా.



మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని