బుజ్జాయి బ్యాగులతో.. కోటి వ్యాపారం!
close
Published : 30/08/2021 00:31 IST

బుజ్జాయి బ్యాగులతో.. కోటి వ్యాపారం!

ప్రసవించి రెండు నెలలు కాలేదు. బేకరీలో పని చేయాల్సి వచ్చిందామెకు. చంటి బిడ్డను ఎత్తుకుని పని చేయాల్సిన ఆ సమయంలో ఆమెకొచ్చిన ఆలోచన ‘కోల్‌కోల్‌ బేబీ క్యారియర్‌’. ఇది ఎంత విజయం సాధించిందంటే ఇప్పుడు తన వ్యాపారం ఏటా కోటి రూపాయలు దాటింది. ఈ అసాధారణ విజేత గోవాకు చెందిన 38 ఏళ్ల భైరవి మణి మాంగోన్కర్‌. తన విజయగాథను చూడండి.

భైరవి వాళ్ల నాన్న వ్యాపారవేత్త కావడంతో తనూ సొంతంగా ఏదైనా చేయాలనుకునేది. చదువు అయిన వెంటనే ఈవెంట్‌ మేనేజ్‌మెంటు విభాగంలో చేరింది. చిన్నప్పటి కలను నెరవేర్చుకోవడానికి సొంతంగా చిన్న బేకరీని కూడా ప్రారంభించింది. పెళ్లై, ఆమెకు బాబు పుట్టాడు. ప్రసవించిన 45 రోజులకే బేకరీలోకి అడుగుపెట్టింది భైరవి. ఓవైపు ఆ చిన్నారిని ఎత్తుకుంటూనే గంటల తరబడి పనిచేసేది. దుపట్టా లేదా పాతచీరతో పిల్లాడిని వీపుపై ఉండేలా కట్టుకునేది. అవసరం కావడంతో ఎక్కువ ఖరీదైనా కూడా విదేశం నుంచి చంటి పిల్లలను వీపుపై కట్టుకునే క్యారియర్‌ని తెప్పించుకుంది. అయితే అందులో బాబుకి సౌకర్యం లేకపోవడం గుర్తించింది. మరోరకం  వాడి చూసింది. అదీ అంతంత మాత్రంగానే అనిపించింది. అప్పుడు ఆలోచిస్తే...తనలాగే తల్లులందరూ ఇలాగే అసౌకర్యంగా ఉండి ఉంటారనిపించిందామెకు. దాంతో తానే ఓ పరిష్కారం చూపించాలానుకుంది.

ప్రయోగాలతో ...

భైరవి తనకు ఎదురైన సమస్యలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఓ బేబీ క్యారియర్‌ని తయారు చేసింది. దాన్ని తాను వాడటమే కాకుండా తనలాంటి తల్లులకూ ఉచితంగా అందించి, వాడమనేది. వారి అనుభవాల్ని తెలుసుకుని, తన డిజైన్‌లో మార్పులు చేసేది. అలా దాదాపు 100 రకాలకుపైగా రూపొందించి ప్రయోగాత్మకంగా ఉపయోగాన్ని, అసౌకర్యాన్ని పరిశీలించింది. అంతే కాదు, తాను రూపొందించిన డిజైన్‌ను సోషల్‌ మీడియాలోనూ ఉంచి సలహాలను, సూచనలను తీసుకుంది. లోపాలను సరిచేసుకునేది. అలా ఓ వినూత్న పరిష్కారం కనిపెట్టింది.

ముందుగా

ఏ డిజైన్‌ చేసినా ముందుగా తానే వాడేదాన్ననని చెబుతుంది భైరవి. ‘అప్పుడే కదా బిడ్డనెత్తుకునే తల్లికి ఎక్కడెక్కడ అసౌకర్యంగా ఉందో తెలుస్తుంది. అలాగే చిన్నారి ఇబ్బందిని కూడా గుర్తించొచ్చు. నాలాంటి మరికొందరు తల్లుల అభిప్రాయాలు నాకెంతో ఉపయోగపడేవి. 2014లో ‘కోల్‌కోల్‌ బేబీ క్యారియర్‌’ను రూ.50వేలు పెట్టుబడితో ప్రారంభించా. అప్పటికే దీని గురించి తెలిసిన వారి నుంచి ఆర్డర్లు వచ్చేవి. ఆ నోటా ఈ నోటా ప్రచారమై...మా ఉత్పత్తికి ఆదరణ లభించింది. తొలుత ఒక టైలర్‌తో పనిచేసే నేను, ఇప్పుడు పదిహేను మందికి పని కల్పిస్తున్నా. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తూనే ఉంటా. ఒక క్యారియర్‌ చేయడానికి నాలుగు రోజులు పడుతుంది. ఇప్పుడు మావద్ద రెండు రకాల బేబీ క్యారియర్లు తయారవుతున్నాయి. ప్రస్తుతం నెలకు 600 ఆర్డర్లు తీసుకునే స్థాయికి మా సంస్థ ఎదిగింది. మొదట్లో దక్షిణాది ప్రాంతాల నుంచి మాత్రమే ఆర్డర్లు వచ్చేవి. క్రమంగా దేశం, ఆపై విదేశాలకు వీటిని సరఫరా చేస్తున్నాం. అంటే మా ప్రొడక్టు ప్రతి తల్లికీ దగ్గరవుతోందన్నమాట. నా అవసరానికి వచ్చిన ఆలోచన మరెందరో తల్లులకు ఉపయోగపడటమే కాకుండా, ఓ వ్యాపారవేత్తగా నా కల నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది’ అని అంటుంది భైరవి.మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని