మోడలింగ్‌ మారింది..
close
Published : 05/09/2021 02:20 IST

మోడలింగ్‌ మారింది..

అందమైన భామలు ఒయ్యారంగా వేదికపై నూతన డిజైన్లను ప్రదర్శించే మోడలింగ్‌ పద్ధతి ఇప్పుడు మారింది. పర్యావరణాన్ని కాపాడుకోవాలంటూ తాజాగా ఓ మోడల్‌ ఏకంగా చెత్తకుప్పల మధ్య అడుగులేస్తే, మరొకామె మహిళలంటే సాహసానికి ప్రతీక అంటూ గగనపు వీధిలో విహరించింది. ఒకరు 16 ఏళ్ల సురభి అయితే... రెండో వ్యక్తి 36 ఏళ్ల డొమిటిల్లే లక్ష్మీ కైజర్‌. ఈ ఇద్దరి సాహసాలూ చూడండి...

అవగాహన కోసం...

ఝార్ఖండ్‌కు చెందిన సురభి ఇంటర్‌ రెండో ఏడు చదువుతోంది. ఆసక్తితో మోడలింగ్‌లోనూ అడుగు పెట్టింది. అందమైన దుస్తులను ప్రదర్శించడానికి మాత్రమే కాకుండా, ఓ మంచి సందేశం ఇచ్చేలా మోడలింగ్‌ ఉండాలంటుంది సురభి. ‘ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీ. పేరుకు పోతున్న వ్యర్థాలు ప్రజారోగ్యాన్ని కలుషితం చేస్తున్నాయి. పట్టణాలు, నగరాల్లోని నివాసప్రాంతాల మధ్య ఎకరాల విస్తీర్ణంలో చెత్త డంప్‌ అవుతోంది. దీనివల్ల చుట్టుపక్కల వారంతా అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈ అంశంపై అందరికీ అవగాహన కలిగించేందుకే ఈ క్యాట్‌వాక్‌. రాంచీలో రోజూ సేకరించే చెత్తను వేసే ఝిరి డంపింగ్‌ యార్డ్‌ సమీపంలో 10వేల మందికి పైగా పదేళ్ల నుంచి నివసిస్తున్నారు. అందుకే ఈ ప్రాంతం గురించి అందరికీ తెలియాలని ఆ చెత్త కుప్పల మధ్య అడుగులేశా. ఆసుపత్రి వ్యర్థాలు, జంతు కళేబరాలు, ఇళ్ల వ్యర్థాల నుంచి వచ్చే తీవ్ర దుర్వాసనల మధ్య నడిచిన నాపై అక్కడ పలు విష కీటకాలు దాడి చేశాయి. ఈ షూట్‌ పూరయ్యాక ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. కొన్ని గంటలకే అలా అయితేే, అక్కడే నివసిస్తున్న వారి గురించి ఆలోచిస్తేనే చాలా బాధేస్తోంది. నా వాక్‌ వీడియో వైరల్‌ అయ్యింది. ఇలాగైనా అందరిలోనూ కాలుష్యం పట్ల అవగాహన వస్తుందని ఆశిస్తున్నా’ అంటున్న సురభి పలు సామాజిక సమస్యలపై అవగాహన కలిగించేలా కృషి చేస్తోంది. ‘ఫ్యాషన్‌ ఫర్‌ ఎ గుడ్‌ ఛేంజ్‌’, ‘నారీ’ పేరుతో ప్రాజెక్టులను చేపట్టింది. మహిళల హక్కులు, వారిపై జరుగుతున్న దాడి వంటి అంశాలపై ఫ్యాషన్‌ ఫొటోగ్రఫీ ద్వారా అవగాహన అందించడానికి ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది ‘మిస్‌ టీన్‌ దివా’ పోటీల్లో ఝార్ఖండ్‌ నుంచి రంగంలోకి దిగబోతోంది.


సాహసం...

‘ప్యారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌ ఫాల్‌ వింటర్‌ 21-22 ఎర్త్‌ రైజ్‌ కలెక్షన్‌’లో భాగంగా వినూత్న స్కై వాక్‌ నిర్వహించారు. ఇందులో స్కైడైవర్‌ కైజర్‌ పొడవాటి నీలి గౌనులో విమానం నుంచి డైవ్‌ చేసి వినువీధుల్లో విహరిస్తూ మెల్లగా నేలకు దిగింది. ‘ఇంత అందమైన అనుభవాన్ని పొందడం సంతోషంగా ఉంది. దీనికోసం చాలా కష్టపడ్డా’ అని వివరించింది కైజర్‌. ‘సాధారణంగా హెల్మెట్‌, ప్రత్యేక జంప్‌ సూట్‌ ధరించి స్కైడైవింగ్‌ చేస్తా. ఇలా ఫ్యాషన్‌ గౌనుతో గాలిలో విహరించడం కష్టమైన విషయం. ఈ ప్రతిపాదన వచ్చినప్పుడు నా అనుభవం మేరకు పైన ఉండే గాలి ఒత్తిడి గురించి డిజైనర్‌కు వివరించా. దానికి తగినట్లుగా దుస్తులను రూపొందించాలని సూచించా. ముందు ప్యారిస్‌, ఇంగ్లండ్‌లో మూడు సార్లు సాధారణ జంప్‌ సూట్‌లో రిహార్సల్స్‌ చేశాం. నాలుగో సారి గౌను ధరించి రిహార్సల్‌ చేశా. ఈ కార్యక్రమంలో నా మేకప్‌, హెయిర్‌ స్టైల్‌కు మూడుగంటలకు పైగా పట్టింది. నా ముందు కెమెరామ్యాన్‌ ఎగురుతుంటే నేను గాల్లోకి దూకాను. ఇలా మూడుసార్లు డైవింగ్‌ చేస్తే కానీ చక్కటి వీడియో రాలేదు’ అంటున్న కైజర్‌ బాల్యం రాజస్థాన్‌లోని షెకావతిలో గడిచింది. తండ్రి ఉద్యోగరీత్యా ఇటలీకి చేరుకుంది ఈమె కుటుంబం. విద్యాభ్యాసమంతా అక్కడే పూర్తి చేసింది. నింగిలో ఎగరాలనే ఆసక్తి ఈమెను స్కైడైవింగ్‌ రంగంలో అడుగుపెట్టేలా చేసింది. మోడల్‌గా రాణిస్తూనే, డైవర్‌ గానూ నైపుణ్యం సంపాదించింది. అంతే కాదు... శిక్షకురాలిగానూ ఎదిగింది. ఈ రంగంలో 20 ఏళ్ల అనుభవం ఉన్న కైజర్‌ ఇంటర్నేషనల్‌ స్కైడైవింగ్‌ కమిషన్‌, ఫ్రెంచ్‌ స్కైడైవింగ్‌ ఫెడరేషన్‌ సభ్యురాలు కూడా. డైనమిక్‌ ఫ్లైయింగ్‌గా పిలిచే ఇండోర్‌ స్కైడైవింగ్‌లో అంతర్జాతీయ పోటీలు కూడా  నిర్వహిస్తూ ఉంటుంది.మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని