అతివల రక్షణకు
close
Published : 06/09/2021 01:21 IST

అతివల రక్షణకు

హిళలపై ఒక్కొక్కటిగా ఆంక్షలు విధిస్తూ అఫ్గాన్‌లో తాలిబన్లు... తమ నిజ స్వరూపాన్ని చూపిస్తున్నారు. తాజాగా రేడియోల్లో, టీవీ కార్యక్రమాల్లో ఆడవారి గొంతు వినిపించకూడదని ఆజ్ఞ జారీ చేశారు. ప్రాణభయంతో దేశం వీడి వెళ్లిపోతున్న అఫ్గాన్‌ జాతీయుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోన్న దేశాల్లో కతర్‌ కూడా ఒకటి. ఈ విషయంలో ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి లోల్వా రషీద్‌ మహ్మద్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఓ పక్క అఫ్గాన్‌లో... మహిళల హక్కుల్ని అణగదొక్కాలనుకుంటే, మరో ముస్లిం దేశ ప్రభుత్వ మహిళా ప్రతినిధిగా లోల్వా వారిని సంరక్షించే కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరిస్తుండటం విశేషం. అమెరికన్‌-తాలిబన్‌ శాంతిచర్చలకు కతర్‌ వేదికగా నిలిచినప్పుడు కూడా ఆమె వాటిలో తనదైన పాత్ర పోషించారు. లోల్వా కతర్‌ విదేశీ వ్యవహారాల శాఖకు అధికార ప్రతినిధి కూడా. యూకేలో చదువుకున్న ఆమెకు సైన్స్‌తో పాటు లిటరేచర్‌పైనా మంచి పట్టు ఉంది. ‘దాదాపు మూడు వారాల నుంచి కంటిమీద కునుకు లేకుండా పని చేస్తున్నాం. అయినా ఫర్వాలేదు. మా సోదరులు, సోదరీమణుల్లో వీలైనంత మందిని సురక్షితంగా ఉంచగలిగితే అదే సంతోషం. మహిళలమైనా మన లక్ష్యాలు వాటి సాధన మార్గాలపై స్పష్టత ఉన్నప్పుడు అనుకున్నది చేయగలమ’ని ధీమాగా చెబుతారామె. మూడు లక్షల పైచిలుకు జనాభా ఉండే చిన్న దేశం కతర్‌... ఇప్పటివరకూ సుమారు 50 వేల మంది అఫ్గాన్లను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వారందరికీ కొవిడ్‌ టీకాలు అందించింది. అందులో ఇరవై వేల మందికి పైగా తాత్కాలిక ఆశ్రయం కల్పించింది. ఈ కార్యక్రమాల్లో సమన్వయ బాధ్యతలను లోల్వా సమర్థంగా నిర్వహిస్తున్నారు.మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని