చదువే వద్దంటే..స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించింది
close
Published : 18/09/2021 01:42 IST

చదువే వద్దంటే..స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించింది

ముగ్గురు ఆడపిల్లలు. రెండెకరాల చేనే జీవనాధారం. ఆర్థిక పరిస్థితి అనుకూలించక అమ్మానాన్న చదువు ఆపేయమన్నారు. కానీ ఆమె అంగీకరించలేదు. కష్టపడి చదివి మంచి మార్కులతో పది, ఇంటర్‌ పూర్తిచేసింది. డీఈఈ సెట్‌ రాసి రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన గడీల అనోధ.. విద్యపై తనకున్న మక్కువను చాటి చెప్పింది. ఆమె గురించి తన మాటల్లోనే..

కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం బోడపల్లి మా స్వగ్రామం. అమ్మానాన్న తిరుపతి-రాజేశ్వరీ రెండు ఎకరాల్లో వ్యవసాయం చేస్తుంటారు. నాకు అక్క, చెల్లితోపాటు ఒక తమ్ముడు. అక్కకు వివాహమైంది. ఆ అప్పులే ఇంకా ఉన్నాయి. చేదోడుగా ఉంటానని నాన్న చదువిక చాలనేవారు. మా గ్రామంలో ఎనిమిదో తరగతి వరకే ఉంది. పది వరకు కొనసాగించాలంటే మూడు కిలోమీటర్ల దూరంలోని ఇట్యాల ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాలి. శంకర్రావు అనే మాష్టారు సాయంతో నాన్నను ఒప్పించా. రోజూ ఆటోలోనో  కాలినడకనో పాఠశాలకు వెళ్లేదాన్ని. 2019లో 9.3 గ్రేడింగ్‌తో పది పూర్తిచేశా. అప్పుడూ చదువు చాలన్న మాటే. ఈ ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేటు కళాశాలలో చదివించలేమన్నారు. మళ్లీ శంకర్రావు మాష్టారే నచ్చజెప్పి, దహెగాం కస్తూర్బా కళాశాలలో ఇంటర్‌ (ఎంపీసీ)లో చేర్పించారు. చదువు ఎలాగైనా కొనసాగించాలనే లక్ష్యం ముందు ఇంకేమీ కనిపించేవి కావు. ఫలితంగా 976 మార్కులొచ్చాయి. తెలంగాణ కస్తూర్బా కళాశాలల్లో నాదే మొదటి ర్యాంకు.

పది మందికి జ్ఞానం పంచే బోధనావృత్తి అంటే చిన్నప్పటి నుంచీ చాలా ఇష్టం. అది తెలుసుకుని ఉపాధ్యాయులు ఇంటర్‌ తర్వాత డీఈఈసెట్‌ (డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌) ప్రవేశపరీక్ష రాయమన్నారు. దరఖాస్తు చేశా. కోచింగ్‌ తీసుకునే స్థోమత లేదు. సొంతంగా చదివా. తెల్లవారుజామున ఉదయం 3 గం. నుంచి 8 గం. వరకు, రాత్రి 8 గం. నుంచి 11 గం.సమయాన్ని సన్నద్ధతకు కేటాయించేదాన్ని. ఈ ర్యాంకు నన్నే కాదు అమ్మానాన్నల్నీ సంతోషపరిచింది. అందుకే చదవాలన్న కోరికను గెలిపించుకోవడంలో నాకిది పెద్ద విజయమే. ఉపాధ్యాయురాలినై, ఆపై సివిల్స్‌ దిశగా వెళ్లాలన్నది భవిష్యత్‌ లక్ష్యం. ఇక ఈ దిశగా కృషి చేస్తా.మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని