ఒంటరిగా దేశమంతా తిరిగింది...
close
Updated : 22/09/2021 04:46 IST

ఒంటరిగా దేశమంతా తిరిగింది...

దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాలపై అందరికీ అవగాహన తేవాలనుకుంది ఆమె. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి తెలపాలనుకుంది. దానికోసం ఏడాదిపాటు దేశమంతా ఒంటరిగా పర్యటించింది. అక్కడి కళలు, గృహనిర్మాణాలను పరిశీలించింది. ఆయా ప్రాంతాల్లో ప్రాముఖ్యత సంతరించుకున్న పలురకాల అంశాలను సేకరించింది. వీటన్నింటినీ డాక్యుమెంటరీగా రూపొందించాలనుకుంటున్న 34ఏళ్ల కావ్య సక్సేనా యాత్రావిశేషాలివీ...

మయం దొరికితే చాలు, సినిమా, బీచ్‌, షాపింగ్‌ లేదా విదేశం.. చాలా మంది ఎంపికలివే. అయితే రాజస్థాన్‌, జయపురకు చెందిన కావ్య సక్సేనా మాత్రం భిన్నంగా ఆలోచించింది. చెన్నై లయోలా కాలేజీలో పీజీడీఎం చేసింది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, ట్రీ ఆఫ్‌ లైఫ్‌ రిసార్ట్స్‌ అండ్‌ హోటల్స్‌, కాన్వాస్‌ లాఫ్‌ క్లబ్‌ వంటి సంస్థల్లో ఉద్యోగం చేసింది. జీవితంలో ఒకసారైనా దేశమంతా తిరగాలని, గ్రామీణ సంప్రదాయాలను తెలుసుకోవాలని కలలు కనేది. ఇంట్లో, స్నేహితులతో చెప్పినప్పుడు గ్రామాల్లో ప్రయాణం సురక్షితం కాదని వారించేవారు. ఎందరెన్నిచెప్పినా కావ్య మాత్రం తన ఆలోచనను కార్యరూపంలోకి తీసుకురావడానికి నిర్ణయించుకుంది. కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చుకుంది. ఉద్యోగరీత్యా దిల్లీలో గతేడాది లాక్‌డౌన్‌ తర్వాత కూడా ఇంటిపట్టునే ఉండటం నచ్చలేదు. ఆ సమయాన్ని తన లక్ష్యానికి వినియోగించాలనుకుంది. అంతే తన దగ్గర ఉన్న రూ.5 లక్షలతో యాత్రను ప్రారంభించింది.

హస్తకళలంటే ప్రాణం.. బాల్యం నుంచి హస్తకళలంటే ఇష్టమైన కావ్యకు గ్రామాల్లో వాటి ఉనికిని తెలుసుకోవాలనుకుంది. అలా గతేడాది సెప్టెంబరులో తన స్కార్పియో జీపులో పశ్చిమ్‌బంగ నుంచి ఒంటరిగానే దేశ యాత్రను మొదలుపెట్టింది. పర్వతశ్రేణుల ప్రాంతాల్లో, లోయల్లో, మారుమూల గ్రామాలకు ప్రాధాన్యతనిస్తూ, ప్రతిచోట ఆగుతూ, అక్కడివారి కళలను పరిశీలించానంటోంది కావ్య. ‘కొన్ని ప్రాంతాల్లో గృహ నిర్మాణాలు, మరొకొన్ని చోట్ల హస్త కళలను చూసి ఆశ్చర్యపోయా. అక్కడి మహిళల సంప్రదాయాలు, సంస్కృతి అపురూపంగా అనిపించేవి. వారిలో దాగిఉన్న  అద్భుత నైపుణ్యాలు నన్ను విభ్రాంతికి గురిచేశాయి. కటక్‌లో సిల్వర్‌ ఫిలిగ్రీ ఆభరణాలు, అరుణాచల్‌ప్రదేశ్‌లోని జైరో లోయలో ప్రతి ఇంట్లో ఇంటీరియర్‌, అక్కడి మహిళలు వేసుకునే టాటూస్‌, ఒడిశాలోని కాట్పాడ్‌ గ్రామంలో గృహాలు, హస్తకళలు, నాగాలాండ్‌లో కోన్యాక్స్‌ గిరిజన్ల సంప్రదాయాలు మరవ లేనివి. ప్రతి గ్రామంలో స్థానిక నేతలు లేదా ప్రజలే నాకు బస సౌకర్యాన్నిచ్చేవారు. మారుమూల ప్రాంతాల్లో చిన్నచిన్న గుడిసెల్లోనే ఉండేదాన్ని. పల్లెప్రజలు నన్నెంతో ప్రేమగా ఆదరించారు. ఏడాదిలో మైళ్లదూరం పర్యటించా. మహారాష్ట్ర తప్ప మొత్తం రాష్ట్రాలన్నీ తిరిగా. అలాగే జాతీయ రహదారుల్లో ఒంటరిగా ప్రయాణించేటప్పుడు చాలామంది నాకు సహాయాన్ని అందించడానికి ముందుకొచ్చేవారు. ప్రతి చిన్న విశేషాన్ని, సమాచారాన్ని పొందుపరిచా. నేటి తరానికి తెలియని విశేషాలతో త్వరలో డాక్యుమెంటరీ చేసి, అందరికీ చేరేలా కృషి చేస్తా’ అంటున్న కావ్యకు మోటార్‌స్పోర్ట్స్‌లో అనుభవం ఉంది. 2015లో రాయల్‌ రాజస్థాన్‌ ర్యాలీలో విజేతగా నిలిచిన కావ్య నేటితరానికి ఆదర్శమే కదూ.మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని