కదిలే ఇళ్ల డిజైనర్‌!
close
Updated : 26/09/2021 05:27 IST

కదిలే ఇళ్ల డిజైనర్‌!

సొంత ఇల్లు.. చాలామంది కల. కానీ పెరుగుతున్న భూమి ధరలతో అది పేదలకు అత్యాశగానే మిగిలిపోతోంది. ఇలాంటి వారి కోసం ప్రత్యేకంగా ఇంటిని రూపొందించింది స్వస్తి పట్నాయక్‌. ఎక్కడికెళ్లినా తీసుకెళ్లగలగడం వీటి ప్రత్యేకత!

మీరు చదివింది నిజమే.. ఆ ఇళ్లు కదులుతాయి. తుపానులు, సునామీలు వంటివి వచ్చినపుడు తీప్రాంతాల్లోని ఇళ్లు కూలిపోతుంటాయి. ఒక్కోసారి అక్కడ నివసించే వాళ్లు సొంత గూటిని వదిలి వలస వెళ్లాల్సొస్తుంది. వీళ్లను చూసినప్పుడు వాళ్ల అవసరాలకు తగ్గట్టుగానే ఇళ్లను నిర్మిస్తే బాగుంటుందన్న ఆలోచన స్వస్తికి వచ్చింది. కానీ తను చదివిందేమో ఫ్యాషన్‌ టెక్నాలజీ. అయితే వాళ్ల నాన్న కజల్‌ పట్నాయక్‌ సివిల్‌ ఇంజినీర్‌. ఆయన్నుంచి మెలకువలను నేర్చుకుంది. వాటి సాయంతో ఫైబర్‌ రీఇన్‌ఫోర్స్‌డ్‌ ప్లాస్టిక్‌ (ఎఫ్‌ఆర్‌పీ) ఇళ్లను ఒడిశాలో మొదటిసారిగా ప్రవేశపెట్టింది. ఈమెది కటక్‌. ఎస్‌ఎస్‌ కజల్‌ క్రాఫ్ట్స్‌ పేరుతో సంస్థను ప్రారంభించి వీటిని రూపొందిస్తోంది.

అన్ని ఇళ్లలానే వీటిలోనూ పడకగది, వంటిల్లు, బాత్రూమ్‌, వరండా.. అన్నీ ఉంటాయి. అల్యూమినియం, ఫైబర్‌, ప్లాస్టిక్‌తో చేసిన పలకలను ఇటుకలు, రాళ్లలా కనిపించేలా రూపొందించి అమరుస్తారు. వైశాల్యాన్నిబట్టి రూ.1.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ అవుతోందట. ‘తీర ప్రాంతాల్లో ఉండే వాళ్లను చూసినప్పుడు ఈ ఇళ్ల ఆలోచన వచ్చింది. నిజానికి ఇతర దేశాల్లో ఎప్పుడో మొదలైంది. మన దగ్గరా మొదలుపెడితే బాగుంటుందనిపించింది. ఆఫీసు, వ్యక్తిగత అవసరాలన్నింటికీ ఇవి సాయపడతాయి. పైగా ఖర్చు తక్కువ. కాస్త పరిశోధన చేశాక తయారీ ప్రారంభించా. సంస్థ ప్రారంభించింది జులైలోనే అయినా మూడు ఇళ్లను చేసిచ్చా. ఇంకో రెండు ఆర్డర్లపై పని చేస్తున్నా. ఇవి తుపాన్లకు తట్టుకోవడమే కాకుండా సులువుగా కదిలించొచ్చు కూడా. ఖర్చు ఇంకా తగ్గించడంపై పరిశోధన చేస్తున్నా’ అంటోంది 22 ఏళ్ల స్వస్తి. ఇందుకోసం స్టార్టప్‌ ఇండియా స్కీమ్‌లో భాగస్వామ్యం చేయమని కోరుతూ దరఖాస్తునూ పెట్టుకుంది.



మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని