గిరిజన మహిళల జీవితాల్లో వెదురు వెలుగులు
close
Published : 28/09/2021 00:58 IST

గిరిజన మహిళల జీవితాల్లో వెదురు వెలుగులు

అక్కడి మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించాలనుకుందామె. వెదురు ఉత్పత్తుల తయారీలో వారి నైపుణ్యాలను మెరుగుపరచాలనుకుంది. అందుకే వారి సృజనకు సానపెట్టించింది. ప్రతిఫలంగా ఇప్పుడు వందల మంది గిరిజన స్త్రీలు ఉపాధిÇ పొందుతున్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపుకొన్నారు. ఆ విజయం వెనకున్నది ఫల్గుణి జోషి. ఆమె స్ఫూర్తి కథనమిది.

డిశాలోని నీలగిరి ప్రాంతంలో వెదురు సాగు ఎక్కువ. తరతరాలుగా ఇక్కడి మహిళలు దీంతో రకరకాల ఉత్పత్తులు తయారు చేసి అమ్మి ఉపాధి పొందేవారు. అందులో కాస్తంత నైపుణ్యం, ఆర్థిక చేయూత అందితే, పెద్దస్థాయిలో ఉత్పత్తులను రూపొందించగలరు. ఆ విషయాన్ని గుర్తించింది ఫల్గుణి జోషి. వారిని ప్రోత్సహించి, ఆర్థిక స్వాతంత్య్రాన్ని అందించాలనుకుంది. వెదురు ఉత్పత్తుల తయారీలో శిక్షణనందించి, గిరిజన స్త్రీల సృజనాత్మకతను ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంది.

నైపుణ్యానికి మెరుగులు...

రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌కు చెందిన ఫల్గుణి లండన్‌ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో డిప్లొమా చేసింది. నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీలో సైబర్‌ లా అండ్‌ ఫోరెన్సిక్స్‌, సైబర్‌-కంప్యూటర్‌ ఫోరెన్సిక్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా చేసేటప్పుడు ఫెలోషిప్‌ కోసం ఎస్‌బీఐ యూత్‌ ఫర్‌ ఇండియాలో పనిచేసింది. ఆ సమయంలో గ్రామాభివృద్ధి కోసం ఆయా ప్రాంతాల్లోని స్థానిక సంఘాలతో పనిచేసే అవకాశం దక్కిందీమెకు. అక్కడివారికి స్థానిక సేవాసంస్థలతో కలిసి చేయూతనందించేది. అప్పుడే ఒడిశాలోని గిరిజన మహిళలెదుర్కొంటున్న పలురకాల సమస్యలను చూసింది. వాటికి పరిష్కారం అందించాలంటే వారంతా ఆర్థికపరంగా నిలబడాలి. దానికి వారికున్న వెదురు ఉత్పత్తుల తయారీనే ఆలంబనగా చేయాలని, 2019లో ‘కర్మార్‌ క్రాఫ్ట్స్‌’ ప్రారంభించింది.  ‘మొదట స్థానిక మహిళాసంఘాలన్నింటినీ ఒక్కటిగా చేసి వారందరికీ సమష్టిగా శిక్షణ అందేలా చూశా. వర్క్‌షాపులు నిర్వహించా.

అలా అందరికీ ప్రోత్సాహాన్ని అందించడంతో వెదురు ఉత్పత్తుల తయారీని ప్రారంభించారు. అలా రూపొందించిన వాటిని తామే విక్రయించుకోవడానికి కర్మార్‌ క్రాఫ్ట్స్‌ను వేదికగా చేశా. వారి కళకు ప్రభుత్వ విభాగాలనూ జత చేయగలిగా. దీంతోపాటు అంగన్‌వాడీ కేంద్రాలద్వారా ‘మమతా సాఖీ’ పేరుతో ఒక గ్రూపు రూపొందించి, వీటిద్వారా స్థానిక మహిళలకు ఆరోగ్యంపై అవగాహనా కార్యక్రమాలను చేపడుతున్నా. గర్భిణులు, పాలిచ్చే తల్లులతో వారి ఆరోగ్యం, ఎదుర్కొన్న సమస్యలు, తీసుకుంటున్న ఆహారం వంటి విషయాల గురించి మాట్లాడేలా చేశా. మొదట మా క్రాఫ్ట్స్‌ వేదికపై కేవలం ముగ్గురు మహిళలే ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 300కు పెరిగింది. వీరు తయారుచేసిన ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఉంది. ఈ డిజైన్లు, నాణ్యత, ప్రమోషన్‌ వంటి అంశాలన్నీ నేను పరిశీలిస్తుంటా. ఈ క్రాఫ్ట్స్‌ ద్వారా లబ్ధి పొందే మహిళల సంఖ్యను పెంచడానికి ప్రస్తుతం కృషి చేస్తున్నా’ అని చెబుతున్న ఫల్గుణి మహిళా సాధికారత కోసం పాటుపడుతోంది. ‘హెర్‌ అండ్‌ నౌ’ పేరుతో రాజస్థాన్‌లో మహిళాపారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక శిక్షణను అందిస్తోంది. మహిళలు ఆర్థిక సాధికారత సాధించినప్పుడే సామాజికాభివృద్ధి సాధ్యమని చెప్పే ఆమె రేపటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది.మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని