95 ఏళ్ల వయసులోనూ సృజనాత్మకత
close
Published : 14/03/2021 15:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

95 ఏళ్ల వయసులోనూ సృజనాత్మకత

ముంబయికి చెందిన నళినీమెహతా 95 ఏళ్ల ముదిమి వయసులోనూ తన సృజనాత్మకతను ప్రదర్శిస్తున్నారు. ఆక్రిలిక్‌ కార్వింగ్‌ కళలో ప్రత్యేక ప్రతిభను చాటుతూ నేటితరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మనసులోని ఆలోచనకు స్వీయశిక్షణను జోడించి వందలాది కళాకృతులను తీర్చిదిద్దారీమె. ఆక్రిలిక్‌ ప్లాస్టిక్‌ మెటీరియల్‌ కాన్వాస్‌గా మార్చుకుని ఎన్నో ప్రయోగాలు చేశారు. డ్రిల్లర్‌ను వాడుతూ అందమైన గులాబీ పూలను చెక్కి, వాటికి ఐ డ్రాపర్‌తో రంగులద్దారు. అలా మరిన్ని రకాల డిజైన్లను రూపొందించారు. ముంబయికి తిరిగొచ్చిన తర్వాత ఈ కళను కొనసాగించా అంటారీమె. ‘గంటల తరబడి చెక్కాలి. చిన్న గీత  పడినా కష్టమంతా వృథా అవుతుంది. వీటితో పలు ప్రదర్శనలిచ్చా. ఎనిమిదేళ్లక్రితం కేంద్ర.ప్రభుత్వం నుంచి  అందుకున్న జాతీయ పురస్కారాన్ని గౌరవంగా భావిస్తా. ఏడు దశాబ్దాలుగా నేను దాదాపు 600కుపైగా అక్రిలిక్‌ కార్వింగ్స్‌ చేశా. ప్రపంచవ్యాప్తంగా కళాభిమానులు వీటిని  కొనుగోలు చేశారు’ అని అంటారీ బామ్మ.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని