చిన్నారుల గదులను తీర్చిదిద్దండిలా!
close
Published : 16/03/2021 18:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిన్నారుల గదులను తీర్చిదిద్దండిలా!

ఇంటిని ఆకర్షణీయంగా సర్దుకోవడంలో అతివలది అందె వేసిన చెయ్యి అని చెప్పొచ్చు. అయితే చిన్నారుల గదిని అందంగా అలంకరించేటప్పుడు మాత్రం మరికొన్ని విషయాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. గది అలంకరణకు ఖరీదైన ఆటవస్తువులు, రంగులు, బొమ్మలే అక్కర్లేదు. మీ సృజనాత్మకతను జోడించి ఉన్నవాటితోనే మరింత అందంగా తీర్చిదిద్దవచ్చు.
సాధారణంగా చిన్నారులు రంగులను బాగా ఇష్టపడతారు. కాబట్టి వారి గదికి ప్రకాశవంతమైన వర్ణాలను వేయించండి. వీలైతే ఇంద్రధనస్సు రంగులను గోడపైకి తెచ్చేయండి. దాంతో వారి ఆనందం రెట్టింపవుతుంది. గడుగ్గాయిలు ఒక్కచోట కుదురుగా ఉండరు. ఎప్పుడూ ఎగురుతూ, గెంతుతూ సీతాకోక చిలుకల్లా ఉంటారు. కాబట్టి వారి గది వీలైనంత మటుకు విశాలంగా, వస్తువులు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. దాంతో వారు హాయిగా బొమ్మలతో ఆడుకుంటారు. నచ్చిన కామిక్‌ పుస్తకాలు చదువుకుంటారు. అలాగే  బుజ్జాయిలకు ఇష్టమైన మిక్కీమౌస్‌, డోరేమాన్‌, బార్బీ, సీతాకోకచిలుకలు, మొక్కలు, జంతువులు..  లాంటి బొమ్మల చిత్రాలను వాల్‌పేపర్‌లుగా వారి పడగ్గది గోడలపై వేయిస్తే చాలా సంతోషపడతారు. పెద్ద మంచాలకు బదులుగా చిచ్చర పిడుగులకు అనువుగా ఉండే బంక్‌ బెడ్‌లను ఏర్పాటు చేస్తే అనుకూలంగా ఉండటంతోపాటు ఆనందం వారి సొంతమవుతుంది. వాటికి కావాల్సిన స్థలం కూడా తక్కువే. చివరగా చిన్నారులు స్వయంగా గీసిన బొమ్మలను కూడా గోడకు అందంగా అతికించండి. ఇలా చేస్తే గది అందంగా మారడంతోపాటు వారిలో ఆత్మవిశ్వాసమూ రెట్టింపు అవుతుంది.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని