పూలు పూయడం లేదా?
close
Published : 07/06/2021 12:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పూలు పూయడం లేదా?

మొక్కల్ని పెంచుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. కానీ ఆ ప్రయత్నం చేస్తే... కొన్ని రోజులకే  చనిపోతున్నాయని కొందరు, అసలు ఎదగట్లేదని ఇంకొందరు, పూలు రావడంలేదని మరికొందరు చెబుతుంటారు. ఈ సమస్యల్ని అధిగమించడానికి ఏం చేయాలంటే...

మట్టి సారవంతంగా...: మొక్కల్ని పెంచాలనుకున్నప్పుడు ముందు మట్టి ఏ తరహానో తెలుసుకోండి. తగిన పోషకాలు అందించి మన్నుని సారవంతం చేసుకోవాలి. ఇందుకోసం రెండు వంతుల మట్టిలో ఒకవంతు కోకోపీట్‌, ఒకవంతు వర్మీ కంపోస్ట్‌, గుప్పెడు వేపపిండి వేసి గడ్డలు లేకుండా కలపాలి. దీన్ని కుండీల్లో నింపి... నాలుగు రోజులు పైన కాస్త నీళ్లు చల్లి అలానే వదిలేయాలి. పాత మొక్కలు ఎదగట్లేదనుకుంటే... వేర్లు దెబ్బ తినకుండా వాటిని తీసి, మట్టిని ఇదే పద్ధతిలో సిద్ధం చేసి మరోసారి నాటుకోవాలి.
వాతావరణాన్ని బట్టి...: మొక్కలు కొనేటప్పుడు అవి ఎలాంటి వాతావరణంలో పెరిగేవో తెలుసుకోవాలి. ఉదాహరణకు గులాబీలకు కనీసం నాలుగైదు గంటలు ఎండతగిలితే మేలు. కానీ పాక్షికంగా మాత్రమే సూర్యరశ్మి తగులుతుంటే మొక్కకు ఎదుగుదల ఉండదు. పూల మొక్కలకు పొటాషియం ఎక్కువగా ఉండే ఎన్‌పీకే సమ్మేళనంతో కూడిన సమగ్ర ఎరువుని అందించాలి. అలానే మిగిలినవీ గమనించుకోవాలి. ఏ మొక్కకు ఎండ, నీరు ఎంత అవసరం? గాల్లో తేమ ఎలా ఉండాలి వంటివన్నీ చూసుకుంటే మొక్క ఆరోగ్యంగా ఎదుగుతుంది.
సంరక్షణ తప్పనిసరి: పెంచాలన్న ఉత్సాహంతో పాటు వాటి సంరక్షణపై దృష్టిపెట్టే శ్రద్ధ కూడా కావాలి. మట్టి పొడిబారకుండా చూసుకోవాలి. ప్రతి పదిహేను రోజులకోసారి ఎరువులు వేయాలి. చీడపీడల్ని గమనించుకుంటూ ప్రూనింగ్‌ చేయాలి. ఎండిన కొమ్మల్ని ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. ఇవన్నీ సరిగా చేయగలిగినప్పుడే మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతాయి. నిండుగా పూలనూ, పళ్లనూ ఇస్తాయి. వీటికి అవసరమైన పనిముట్లనూ అందుబాటులో ఉంచుకోవాలి.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని