మీ చిన్నారికి ఇవి అవసరం
close
Published : 10/06/2021 01:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీ చిన్నారికి ఇవి అవసరం

రాధికకు రాత్రి అవుతుందంటేనే భయం. తన ఆరు నెలల ఆకృతి ఏడుపు మొదలుపెడుతుంది. పగలంతా చిరునవ్వులు చిందిస్తూ ఉండే ఆ చిన్నారి చీకటి పడితే ఎందుకు ఇబ్బంది పడుతుందో తెలీదు. చాలామంది తల్లుల సమస్య ఇది. పసిపిల్లలు తమ ఇబ్బందిని చెప్పలేక దాన్ని ఏడుపుతోనే ప్రదర్శిస్తారని అంటున్నారు వైద్య నిపుణులు. చిన్న పిల్లలు ఎదుర్కొనే కనీస సమస్యలపై తల్లిదండ్రులకు అవగాహన ఉండాలని హెచ్చరిస్తున్నారు. కొత్తగా తల్లి అయిన వారు చిన్నారుల విషయాల్లో అవసరమైన వాటిని ఇంట్లో సిద్ధంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
* బేబీ వైప్స్‌ : పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వారి చుట్టుపక్కలే కాదు, వారినీ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. రెండుపూటలా గోరువెచ్చని నీటితో స్నానం, ఒంటికి పౌడర్‌ అద్దడం వంటివి హాయిగా అనిపిస్తాయి. చక్కగా కంటినిండా నిద్రపోతారు. ఒక్కోసారి కడుపు నిండా పాలుతాగినా, రాత్రుళ్లు పిల్లలు పేచీ మొదలు పెడతారు. అప్పుడు బేబీ వైప్స్‌తో ఒళ్లంతా మృదువుగా తుడిచి, దుస్తులను మార్చాలి. అప్పటివరకు పడిన ఇబ్బందిని మరిచిపోయి నిద్రలోకి జారుకుంటారు. పక్కదుప్పట్లు కూడా మెత్తగా ఉండేలా జాగ్రత్తపడాలి. డయ్‌పర్‌ను చెక్‌ చేయడం మరవకూడదు. వెలుతురు తక్కువగా ఉండేలా, కాలానికి తగ్గట్లుగా గది వాతావరణాన్ని కల్పిస్తే చాలు.  
* దోమల బెడద నుంచి రక్షణ: పాపాయి ఒక్కసారిగా లేచి గుక్కపెట్టిందంటే ఆ గదిలో దోమలు ఉండొచ్చు. వీటిని అరికట్టాలంటే, సాయంత్రమే గది కిటికీలు, తలుపులు మూసేయాలి. వీటి సమస్య ఉన్నప్పుడు ముందుగానే దోమతెరను సిద్ధంగా ఉంచుకోవాలి. చిన్నారులు నిద్ర పోయిన తర్వాత దోమతెర వేస్తే చాలు. లేదంటే దోమకాటువల్ల అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉంది.
* దుస్తులు: సీజన్‌తో సంబంధం లేకుండా దుస్తులను వేస్తే చిన్నారులు ఇబ్బంది పడతారు. వేసవిలో మెత్తని కాటన్‌, చలికాలంలో వెచ్చగా ఉండేలా వదులు దుస్తులను వేయాలి. వారి క్రీంలు, పౌడర్ల విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలి. రసాయన రహిత ఉత్పత్తులను ఎంపిక చేసుకోవాలి. అప్పుడే చర్మ సమస్యలు ఎదురవ్వవు. కొందరు చిన్నారులకు కొన్ని క్రీంలు పడకపోవచ్చు. వాటిని వెంటనే గుర్తించి, మానేయాలి. ఎన్నిరకాలుగా పరిశీలించినా మీ బుజ్జాయి ఏడుపు మానకపోతే మరేదో సమస్య ఉండొచ్చు. తక్షణం వైద్యులను సంప్రదించాలి.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని