ప్రతి రూపాయీ లెక్కే!
close
Published : 05/07/2021 00:41 IST

ప్రతి రూపాయీ లెక్కే!

డబ్బు పొదుపు చేయాలని మనసులో ఉన్నా... ఎలాగో తెలియదు కొందరికి. దాంతో అవసరానికి మించి ఖర్చు చేస్తూ ఆ తర్వాత బాధపడతారు. మీరూ అలానే చేస్తుంటే...ఇది చదవండి.

* పొదుపు గురించి తెలియకపోతే... ఎంత సంపాదించినా నిరుపయోగమే! ఖర్చుపెట్టేప్పుడు చిన్న మొత్తమే అనిపించొచ్చు కానీ నెల తిరిగేసరికి అమ్మో ఇంత ఖర్చు చేసేశామా అనిపిస్తుంది. అందుకే చిల్లర వాడుకున్నా సరే.. లెక్క రాయండి. అప్పుడు వృథాని గుర్తించి అడ్డుకట్ట వేయొచ్చు.

* చాలామంది అమ్మాయిలు... ట్రెండ్‌లపై ఆసక్తి పెంచుకుని తరచూ ఏవో ఒకటి కొంటూనే ఉంటారు. సందర్భాన్ని బట్టి కొనుక్కుంటే... కొత్తదనం కనిపిస్తుంది. డబ్బులూ ఆదా అవుతాయి. ఒకవేళ ఏదైనా కొనాలనిపిస్తే... దానికి పెట్టాలనుకున్న మొత్తాన్ని తీసి పక్కన ఉంచండి. ఇలా నెల మొత్తంలో మీరు దాచిన డబ్బులతో... బంగారమో మరొక విలువైన దానిపైనో ఉపయోగించొచ్చు. ఇలా చేయడం వల్ల మీ మనసు మీ నియంత్రణలో ఉంటుంది.

* చాలామంది తేలిగ్గా తీసుకుంటారు కానీ.. సంపాదనలో కనీసం పది శాతమైనా పొదుపు కోసం పక్కన పెట్టే అలవాటు ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. అమ్మాయిలం ఆర్థిక లావాదేవీలతో మాకేం పని అనొద్దు. చిన్న మొత్తాలతో డబ్బులు భద్రపరుచుకోవడం మొదలుపెడితే... అవే మీకు అవసరానికి ఉపయోగపడతాయి. పొదుపు చేయాలనే ఆలోచన వచ్చిన వెంటనే... మరో ఖర్చుని తగ్గించుకునైనా ఇందుకోసం డబ్బు కేటాయిస్తే మేలు.

మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని