ఏ వంటనూనెలో ఏముంది
close
Published : 02/08/2021 01:22 IST

ఏ వంటనూనెలో ఏముంది

కుటుంబ ఆరోగ్యం ఇల్లాలి చేతిలోనే ఉంటుంది. తినే పదార్థాల విషయంలో బోలెడు సలహాలు, మరెన్నో సందేహాలు...ఎదురవుతుంటాయి. వాటిల్లో వంటనూనె కూడా ఒకటి. తేడాలను ముందు తెలుసుకుంటే ఎంచుకోవడం సులువు కదూ!

ఆర్గానిక్‌: మొక్కలు, విత్తనాల నుంచి తీసినదాన్ని ఆర్గానిక్‌ ఆయిల్‌గా చెబుతారు. ఎలాంటి రసాయనాలూ ఉపయోగించరు.

వర్జిన్‌/ ఎక్స్‌ట్రా వర్జిన్‌: అన్‌ రిఫైండ్‌, రా ఆయిల్‌గానూ వ్యవహరిస్తారు. దీనిలోనూ రసాయనాలకు తావుండదు. కొద్దిపాటి వేడిని ఉపయోగించి నూనెను తీయడాన్ని ఈవిధంగా వ్యవహరిస్తారు.

కోల్డ్‌ ప్రెస్‌డ్‌: దీనిలో సాధారణ వేడి వద్ద వివిధ విత్తనాల నుంచి నూనెను తీస్తారు. రసాయనాలనూ ఉపయోగించరు. గది ఉష్ణోగ్రత వద్ద సేకరిస్తుండటంతో సూక్ష్మ పోషకాలూ దానిలోనే ఉండిపోతాయి.

రిఫైండ్‌: ఈ నూనె సేకరణలో ఉష్ణోగ్రతతోపాటు కొన్ని రసాయనాలనూ ఉపయోగిస్తారు. దీంతో కొన్నిరకాల పోషకాలను కోల్పోవాల్సి వస్తుంది.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని