శుభప్రదం శ్రావణం
close
Updated : 20/08/2021 05:39 IST

శుభప్రదం శ్రావణం

శ్రావణం వానలతో పాటు శుభకార్యాలు, పండగలూ, వ్రతాల కాలం.  ముఖ్యంగా ఈ కాలంలో వచ్చే వరలక్ష్మీ వ్రతం రోజున కుంభవృష్టి కురిసినా, చిత్తడివానే పడుతున్నా... స్త్రీలు పట్టుచీరలు కట్టి, తలలో పూలు, కళ్ల నిండా కాటుక, పాదాలకు పసుపు పెట్టుకుని... వాయనాలు అందిస్తూ, అందుకుంటూ సందడి చేస్తారు. సౌభాగ్యం, సిరిసంపదలు ఇవ్వమని లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు.

సర్వ మంగళ మాంగల్యే

శివే సర్వార్థసాధికే

శరణ్యే త్రయంబకే దేవి

నారాయణి నమోస్తుతే!

అంటూ మహిళలంతా లక్ష్మీదేవిని శ్రద్ధగా స్మరించుకునే... శ్రావణ వరలక్ష్మీ వ్రతం శ్రావణ శుద్ధ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేసుకుంటారు. అప్పుడు కుదరని వారు తర్వాత వచ్చే వారాల్లోనూ చేసుకోవచ్చు. ఇది మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. అందుకే ఈ రోజు ఏ ఇంట చూసినా... ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తుంది.

సకల సంపదలకూ ప్రతీక లక్ష్మీదేవి. ఆవిడ ఏ మంచిని కోరినా అనుగ్రహించే తల్లి. అందుకే అందరితోనూ వరలక్ష్మిగా పిలిపించుకుంటోంది. ఆవిడ ప్రతిరూపంగా భావించే స్త్రీలు తమపై కరుణ కురిపించాలని కోరుతూ సిరిమహాలక్ష్మికి పూజలు నిర్వహిస్తారు. అత్తలు...కొత్త కోడళ్లతో ఈ వ్రతం చేయించడం ద్వారా ఆమెకు పూజలు, వాటి విధానాల ప్రాముఖ్యం తెలిసేలా చేస్తారు. శ్రావణ వరలక్ష్మి పూజ కొత్త నగతో చేయాలనేది నియమం. అందుకే నవ వధువులకు అత్తింటి వారు నగలు పెడతారు. ముత్తయిదువులు లక్ష్మీరూపులకు పూజ చేసి మంగళసూత్రంలో కట్టుకుంటారు. తర్వాత ఆ బంగారమే భవిష్యత్తు తరాలకు మదుపు అవుతుంది.

వరలక్ష్మి వ్రతం విశేషాలు...

వరలక్ష్మీదేవి వ్రత కథలోని చారుమతి... పేరుకు తగ్గట్టే మంచి బుద్ధితో అత్తమామలను భక్తి శ్రద్ధలతో సేవించుకుంది. మితభాషణం ఆమెకి అలంకారం. అందరినీ కలుపుకొనిపోయే తత్వం ఆభరణం. ఇందులో ఆమె తాను మాత్రమే వ్రతం చేసుకోవాలనుకోకుండా.... తోటి వారికీ మంచి జరగాలని కోరుకుంది. వారినీ పిలిపించి వ్రతం చేయిస్తుంది. వ్రతాలకి వర్ణభేదం లేదని, సామూహికంగా చేస్తే మరింత ఎక్కువ ఫలితం ఉంటుందనే సామాజిక స్పృహ కలిగిన మహిళామణి చారుమతి. ఈ లక్షణాలు కొన్నయినా అలవరుచుకుంటే వ్రతం చేసిన ఫలితం పూర్తిగా దక్కుతుంది. మంగళవారం వ్రతంలో సుశీల, శుక్రవారం వ్రతంలో చారుమతుల ప్రవర్తన అలవాటు చేయటానికే పూజ అయ్యాక వాయనం ఇచ్చేటప్పుడు ‘ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకొంటినమ్మ వాయనం’  అంటూ. ‘నా వాయనం పుచ్చుకున్న వారెవరు?’ అని అడిగితే ‘నేనే మంగళ గౌరీదేవిని’, ‘నేనే సాక్షాత్తు శుక్రవార వరలక్ష్మీ దేవిని’ అని సమాధానం చెప్పిస్తారు. ఇలా చేయడం వల్ల సాటి వ్యక్తిని ఆరాధ్యదైవంగా చూడటం అభ్యాసమవుతుంది. చారుమతి కథ ద్వారా... చెడుబుద్ధి, దుష్ట సంకల్పం, దుర్గుణాలు లేని పునీత మనస్కులు.. లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవుతారనేది సందేశం.

- డా. అనంతలక్ష్మి, ఆధ్యాత్మికవేత్త


Advertisement


మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని