అఘాయిత్యం జీవితాన్నే దెబ్బతీస్తోంది
close
Updated : 26/09/2021 05:38 IST

అఘాయిత్యం జీవితాన్నే దెబ్బతీస్తోంది

స్త్రీలపై లైంగిక అఘాయిత్యాల ప్రభావం... ఎంత వరకూ ఉంటుంది? కొన్ని రోజుల తర్వాత శరీరానికి అయిన గాయంతో పాటు జ్ఞాపకాలు కూడా మానిపోతాయా? బాధితులు సాధారణ జీవితం గడిపే అవకాశం ఉందా? ఇవే విషయాలపై తాజాగా పిట్స్‌బర్గ్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఒక సర్వే జరిగింది. అందులో వెల్లడైన వాస్తవాలివి..

తీవ్రమైన లైంగిక వేధింపులు, అత్యాచారాలకు గురైన అమ్మాయిల్లో తాత్కాలిక ఉపశమనం లభించినా దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తడానికి ఆస్కారం ఉందని తేలింది. ముఖ్యంగా మెదడు పనితీరు మందగిస్తూ వస్తుందని ఈ అధ్యయనం చెబుతోంది. పిట్స్‌బర్గ్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని విమెన్స్‌ బయో బిహేవియరెల్‌ హెల్త్‌ లాబొరేటరీ... చిన్నతనంలో, పెద్దయ్యాక లైంగిక వేధింపులకు గురై నడివయసులో ఉన్న మహిళల్ని ఈ సర్వేలో భాగస్వాములని చేసింది. వాళ్ల మెదడుని స్కాన్‌ చేసినప్పుడు చాలా మందిలో మెదడు కణాలు క్షీణించడాన్ని గుర్తించింది. ఫలితంగా వారిలో మరుపు పెరుగుతోంది. అలాగే వీరిలో మూడురెట్లు ఎక్కువగా ట్రైగ్లిజరాయిడ్లు ఉంటున్నాయని వీటి కారణంగా గుండెజబ్బులు తలెత్తు తున్నాయనీ, వీటికి ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి వంటివి కూడా తోడై మహిళల జీవితాలని దెబ్బ తీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే లైంగిక వేధింపుల బాధితులకు ఉపశమనం కలిగించేలా కౌన్సెలింగులు ఇవ్వడం, వారి మనసులోని మాటను బయటకు చెప్పేలా ప్రోత్సహించడం అవసరం అంటోంది ఈ అధ్యయనం.మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని