ఊ...లలల్లా! ఆనందమిలా
close
Published : 27/06/2021 01:26 IST

ఊ...లలల్లా! ఆనందమిలా

మనసు నిత్యం సంతోషంగా ఉంటే.. అదే సగం బలం. ఎక్కువ సంతోషంగా ఉండే వారికి ఎలాంటి అనారోగ్యాలూ దరిచేరవని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎటువంటి ఆరోగ్య సమస్యలనైనా దరికిరాకుండా చేయగలిగే మంత్రంలాంటి సంతోషంతో కలిగే ప్రయోజనాలెన్నో!

కావాలంటే చదివేయండి..

నైపుణ్యాలు... ప్రతి క్షణం సంతోషంగా ఉండే వారిలో నైపుణ్యాలు పెరుగుతాయట. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని కలిగించి, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. భవిష్యత్తులో ఎదురయ్యే ఎటువంటి అడ్డంకినైనా నవ్వుతూ దాటేయగలిగే సామర్థ్యాన్ని పెంచుతుంది. సంతోషంగా, ఉత్సాహంగా ఉండేవారిలో స్ట్రెస్‌ కలిగించే హార్మోన్‌ తక్కువగా విడుదలై, కష్ట సమయాల్లో వారిని త్వరగా కోలుకునేలా చేస్తుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది.

ఆలోచనలు... సంతోషంగా ఉంటే ప్రతికూల ఆలోచనలు దరిచేరవు. ఎంతటి క్లిష్ట పరిస్థితులోనైనా పాజిటివ్‌గా ఆలోచించేలా చేస్తుంది. ఇలా ఉండేవారు సంపూర్ణ ఆరోగ్యంతో ఎక్కువకాలం జీవిస్తారు. అలా కాకుండా నెగెటివ్‌గా ఉంటే మాత్రం భవిష్యత్తులో ముప్పుగా మారుతుంది. వారి లైఫ్‌టైంను కూడా తగ్గిస్తుంది. అందుకే వీలైనంతగా మనసును ప్రశాంతంగా, ఆనందంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.

వ్యాధినిరోధక శక్తి... ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి ఉత్సాహంగా ఉండేవారికి వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం, క్రమశిక్షణ, సమయపాలన వంటి అలవాట్లు అలవడతాయి. ఆరోగ్యకరమైన ఆహారంతో శరీరంలో వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. ఇది నిత్యం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే లక్ష్యాలను చేరుకోవడానికి కావాల్సినన్ని శక్తిసామర్థ్యాలను ఇస్తుంది. దీంతో జీవితంలో ఉన్నతస్థాయిని అందుకోవడమే కాదు, మరికొందరికి చేయూతగా నిల్చి అందులోనూ సంతోషాన్ని పొందొచ్చు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని