ఆ ఊళ్లో.. మూడువేల మిద్దె తోటలు!
close
Updated : 27/06/2021 06:28 IST

ఆ ఊళ్లో.. మూడువేల మిద్దె తోటలు!

ఒకరూ... ఇద్దరూ కాదు... ఏకంగా మూడువేల మంది మహిళలు ఇంటింటా నల్లబంగారాన్ని తయారు చేస్తున్నారు! ఆసక్తే పెట్టుబడిగా పెట్టిన ఈ వ్యాపారంతో తమ కుటుంబాలకి ఆరోగ్యసిరులు కురిపిస్తున్నారు.. ఇంతకీ ఏంటా నల్ల బంగారం అంటారా?... ‘సేంద్రియ ఎరువు’. ఇంటిచెత్తనే
ఎరువుగా మార్చి... మిద్దెతోటలకి ప్రాణం పోస్తున్నారు విజయనగరం మహిళలు..  

మీ ఇంట్లో రోజూ పోగయ్యే చెత్తను ఏం చేస్తారు? ‘ఏం చేస్తాం.. బయట పారేస్తాం’ అంటారు కదా! కానీ విజయనగరం మహిళలు మాత్రం విలువైన సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. ఇలా ఒకరో ఇద్దరో కాదు... మూడు వేల మంది మహిళలు నల్లబంగారాన్ని తయారు చేసుకుని దాంతో నాణ్యమైన కాయగూరలు పండించడం విశేషం.

విజయనగరం నగర పాలకసంస్థ రెండేళ్ల కిందట ‘హోమ్‌ కంపోస్టింగ్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళల సహకారంతో ఇళ్లలో తడి చెత్తని సేంద్రియ ఎరువుగా మార్చడం దీని ప్రధాన లక్ష్యం. పారిశుద్ధ్య కార్మికులకు, నగరపాలక సంస్థకు సవాల్‌గా మారిన తడిచెత్తకు పరిష్కారంతోపాటు ప్రజలకు చక్కని ఆరోగ్యం బోనస్‌లా లభిస్తుందని అధికారులు ఆశించారు. ముందుగా మొక్కల పెంపకంపై ఆసక్తి ఉన్న మహిళలను గుర్తించారు. వారిని ప్రోత్సహించి ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేశారు. తడిచెత్తతో ఎరువును ఎలా తయారు చేసుకోవాలో అవగాహన కల్పించారు. ఎరువు తయారీ కోసం ఒక్కో ఇంటికీ 40 కిలోల సామర్థ్యం కలిగిన రెండు డ్రమ్ములని ఉచితంగా ఇస్తారు. ఇలా 6500 డ్రమ్ములని ఉచితంగా పంపిణీ చేశారు. దీనికి మహిళల ఉత్సాహం కూడా తోడయ్యేసరికి కొద్ది కాలంలోనే మంచి ఫలితాలు మొదలయ్యాయి. ఇప్పుడు మూడు వేల ఇళ్లల్లో హోం కంపోస్టింగ్‌ విజయవంతంగా సాగుతోంది. నగర కమిషనర్‌ ఎస్‌.ఎస్‌.వర్మ ఆలోచనలో పుట్టిన ఈ కార్యక్రమాన్ని ఆయనే పర్యవేక్షిస్తున్నారు.

ఎస్‌డబ్ల్యూఎం(సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌) లెక్కల ప్రకారం నలుగురు ఉన్న ఒక ఇంటి నుంచి రోజుకి కిలో తడిచెత్త పోగవుతుంది. పొడి చెత్తను రీసైక్లింగ్‌ కోసం వినియోగించవచ్చు. కానీ తడిచెత్తను అలాచేయలేం. కొండలా పేరుకుపోయే ఈ చెత్తతో అనారోగ్య సమస్యలూ వస్తాయి. ఈ తడి చెత్త నిర్వహణ తలనొప్పిగా మారుతోంది. నగరంలో రోజుకు 48 టన్నుల తడిచెత్తను సేకరిస్తున్నారు. ఈ కార్యక్రమం ఈ సమస్యకు చక్కని పరిష్కారం అందించింది. ఈమేరకు పారిశుద్ధ్య సిబ్బందికీ సేకరణ భారం కొంత తగ్గింది. ఈ కార్యక్రమంలో మంచి ఫలితాలు సాధిస్తున్న వారిలో ఏటా నలుగురైదుగురిని అధికారులు సత్కరిస్తున్నారు. ఈ చెత్త నిర్వహణను పర్యవేక్షించే ‘నగర దీపికలు’ ప్రతి వారం ఒకరి ఇంటికి వెళ్లి పరిశీలిస్తారు. సలహాలూ ఇస్తారు. చెత్తలేకపోవడం, సహజ పంటలు... ఇలా రెండు రకాలుగా ఆరోగ్యాన్ని ఇస్తోందని, మంచి వ్యాపకంగా మారిందని, ఖర్చు కూడా కొంత కలిసి వస్తోందని మహిళలు సంతోషంగా చెబుతున్నారు. చాలామంది మహిళలు తమ వద్ద అదనంగా ఉన్నవాటిని ఇతరులతో ఇచ్చి పుచ్చుకుంటున్నారు. నగరంలో సుమారు 90 వేల కుటుంబాలు ఉన్నాయి. ఈ ఏడాది కనీసం 15 శాతం అంటే 13,500 కుటుంబాలను ఇటువైపు మళ్లించేందుకు యంత్రాంగం కృషి చేస్తోంది.

  -కొమరవెళ్లి మునీందర్‌, విజయనగరం

‘‘మొదట్లో నేను మొక్కలకోసం రసాయన ఎరువులు వాడేదాన్ని. సేంద్రియ ఎరువు తయారీ నేర్చుకున్నాక ఇప్పుడు పూర్తిగా ఇదే వినియోగిస్తున్నాను. కూరగాయలు బయట కొనడం లేదు. మా ఇంట్లో అద్దెకుండే వారికీ ఇస్తుంటాం.’’

- సెల్గంశెట్టి కృష్ణవేణి, తూర్పు బల్జివీధి

‘‘ఏడాదిగా మా ఇంటి ఎరువుతోనే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నా. తెలిసిన వారికీ పంపిస్తుంటాను.’’

- జి.పుష్పకుమారి, బాబామెట్ట

‘‘రెండేళ్లుగా సేంద్రియ ఎరువుని ఇంట్లోనే తయారు చేసి కూరగాయలు పండిస్తున్నా. చాలా రుచిగా ఉంటున్నాయి. వీటిని చూసి ఇరుగూ, పొరుగూ కూడా ఆకర్షితులవుతున్నారు.’’

 

- ముద్దంశెట్టి జానకి, పడమటి బల్జివీధి

మంచిమాట

నువ్వు చేస్తున్న పని నీకు సరైనది అనిపించినప్పుడు ఎవరికో భయపడి పాదాల వంక చూడకు, సంతోషంగా నర్తించు.

- అన్నే లామోట్‌, రచయిత్రి

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని