కోపం వచ్చేస్తోందా?
close
Published : 10/07/2021 01:01 IST

కోపం వచ్చేస్తోందా?

మహిళలు ఇంటినీ, ఉద్యోగాన్నీ బ్యాలెన్స్‌ చేసుకునే క్రమంలో పని ఒత్తిడి పెరుగుతోంది. అది మెదడు మీద భారం చూపడంతో విసుగు ఎక్కువయ్యే అవకాశముంది. ఫలితంగా గొడవలూ ఘర్షణలూ.. ఇంత ప్రమాదకరమైన కోపాన్ని అదుపు చేసుకోవడానికి మానసిక నిపుణుల విలువైన సూచనలు...
కోపం తెప్పించిన కారణం ఎలాంటిదైనా సరే తూలనాడక మౌనంగా ఉండిపోండి. నిజానికి ఇది కోపాన్ని మించిన ఆయుధం.
*ఒక నిమిషం అవతలి వ్యక్తి కోణం నుంచి ఆలోచించి అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. అప్పటికీ కోపం తగ్గకుంటే అంకెలు లెక్కపెట్టడం, పదిసార్లు గట్టిగా శ్వాస పీల్చి వదలడం లాంటివి ప్రయత్నించండి. స్థిమితపడ్డాక ఇంకోసారి ఇలా జరగడానికి వీల్లేదని మెల్లగానే అయినా స్థిరంగా చెప్పండి.
*ఒయోగాసనాలు, వ్యాయామం శారీరక ఆరోగ్యానికే కాదు, మానసికంగానూ ప్రశాంతత కలిగిస్తాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, వేగంగా నడవటంతో కోపం చాలావరకూ తగ్గిపోతుంది. పుస్తకాలు చదవడం, పాటలు వినడం లాంటి హాబీలు కోపాన్ని అదుపులో ఉంచుతాయి. మరీ అసహనంగా ఉంటే కూర్చొని మెడను అటూ ఇటూ రోల్‌ చేయడం, చేతులను కిందికీ పైకీ వంచడం లాంటివెంతో మేలు చేస్తాయి.
*ఒ నిరంతరాయంగా పని చేయడంతో అలసట, విసుగు ఎక్కువవుతాయి. మధ్యలో చిన్నచిన్న విరామాలు తీసుకోండి.
*ఒ కోపం రాగానే ఆవేశపడే బదులు అందుకు కారణం ఏమిటో ఆలోచించి పరిష్కారం కోసం ప్రయత్నించండి.
*ఒపనిమనిషి చెప్పకుండా మానేసిందనుకోండి.. ‘నువ్వెప్పుడూ ఇంతే’ అని నిందించే బదులు, ఆమె ఉన్నట్టుండి మానేయడం వల్ల ఎంత సమస్య వచ్చిందో.. చెబితే ఆమెలో పశ్చాత్తాపం కలుగుతుంది, ప్రయోజనం ఉంటుంది.
*ఒఅసహనాన్ని, ఆందోళనని హాస్య రూపంలో చెప్పగలిగితే మీ ఒత్తిడీ తగ్గుతుంది, అవతలి వ్యక్తిలో మార్పూ వస్తుంది.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని