వయసుకు తగ్గ వ్యాయామం
close
Published : 23/07/2021 01:07 IST

వయసుకు తగ్గ వ్యాయామం

న్విత 20 ఏళ్ల కూతురితో సమానంగా వ్యాయామాలు చేసేది. కానీ ఈమధ్య నడకతోపాటు చిన్నచిన్న ఎక్సర్‌సైజులు తప్ప జిమ్‌లో మిగతావి చేయలేకపోతోంది. ఈ పరిస్థితి సహజమే అంటున్నారు ఆరోగ్యనిపుణులు. వయసుకు తగ్గట్లుగా శరీరం స్ట్రెచ్‌ అవుతుందని చెబుతున్నారు. పెద్ద వయసులోనూ యువతలా వ్యాయామం చేయడం వారి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందంటూ సూచిస్తున్నారు. సాధారణంగా వయసుకు తగినట్లుగా శరీరాన్ని వంచగలిగితే చాలు. ఎక్కువరోజులు ఆరోగ్యంగా ఉండొచ్చు అని సలహా ఇస్తున్నారు.

* వర్కవుట్స్‌... ఏ వయసు వారైనా వర్కవుట్స్‌ను ఎంచుకోవచ్చు. 50పైబడిన వారు తేలికైన వాటిని ఎంచుకోవాలి. ప్రతి రోజూ నియమిత సమయాన్ని కేటాయించుకుని చేసే వ్యాయామాలకు శరీరం స్పందిస్తుంది. ఇది ఫిట్‌నెస్‌ను పెంచడమే కాకుండా, అనారోగ్యాలను దరికి చేరకుండా చేస్తుంది. కొత్తగా వర్కవుట్స్‌ను ప్రారంభించిన వారు మొదట తక్కువ సమయం నుంచి మొదలుపెట్టి, క్రమేపీ పెంచుకుంటూ వెళ్లాలి. లేదంటే ఒకేసారి కండరాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురై మరుసటి రోజుకి శరీరం మొరాయిస్తుంది. ప్రతిరోజు అరగంట సేపు చేసే యోగా శరీరాన్నీ, మనసునూ ఆరోగ్యంగా ఉంచుతుంది.

* ఆరుబయట... 20 నుంచి 30 ఏళ్లలోపు మహిళలు ఆరుబయట వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, టెన్నిస్‌ వంటివి ఎంచుకోవాలి. ఇవి శరీరమంతటికీ వ్యాయామాన్ని అందిస్తాయి. ప్రతి కండరంలో రక్తప్రసరణ బాగా జరిగి, బలోపేతమవుతాయి. అలాగే పరుగు, ఈత, సైక్లింగ్‌, వేగంగా నడవడం, తాడాట వంటివన్నీ ఈ వయసు వారికి సరైనవి. వారంలో కనీసం ఆరు రోజులు వ్యాయామం చేయగలిగితే చాలు. వీటితోపాటు నృత్యం, మార్షల్‌ఆర్ట్స్‌ వంటివి ఫిట్‌గా ఉంచుతాయి. బరువులెత్తడం కూడా మంచి ఎంపిక.

*  ట్రెక్కింగ్‌... సైక్లింగ్‌, మారథాన్‌తోపాటు ట్రెక్కింగ్‌ కండరాలను బలోపేతం చేస్తాయి. 40 ఏళ్లలోపు వారికి సరిపోయే వ్యాయామాలివి. హృద్రోగాలకు దూరంగా ఉంచుతాయి. వర్కవుట్స్‌తోపాటు ఖాళీ సమయాల్లో వీటిని ఎంచుకుంటే మంచిది. 50 ఏళ్లకు కండరాలు, ఎముకల్లో శక్తి కొంచెం తగ్గుతూ ఉంటుంది. మెనోపాజ్‌ కారణంగా ఎముకల సాంద్రత కూడా తగ్గుముఖం పట్టడం మొదలవుతుంది. అందుకే తుంటి భాగంతోపాటు ఎముకలను బలోపేతం చేసే వ్యాయామాలను ఎంచుకోవాలి. వారంలో అయిదురోజులు అరగంటసేపు నడవాలి. ఒకేచోట ఎక్కువ సమయం కూర్చోకుండా అప్పుడప్పుడు నాలుగు అడుగులు వేయడం, శరీరానికి సరిపడే నీటిని తీసుకోవడం వంటి జాగ్రత్తలు 60లో పడినా ఆరోగ్యంగానే ఉంచుతాయి.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని