అమ్మాయిలూ వెనకబడొద్దు?
close
Updated : 24/08/2021 05:09 IST

అమ్మాయిలూ వెనకబడొద్దు?

చదువు, విజ్ఞానం పరంగా ముందున్నా.. కొన్ని రకాల స్కిల్స్‌పరంగా అమ్మాయిలు వెనకే ఉన్నారంటున్నాయి కొన్ని రకాల అధ్యయనాలు. విదేశీ విద్య అయినా, ఉద్యోగమైనా.. సంస్థలు దరఖాస్తుల్లో కొన్ని నైపుణ్యాల కోసం చూస్తుంటాయి. వాటిని ముందస్తుగానే అందుకోవడం తప్పనిసరి.

* హార్డ్‌ స్కిల్స్‌.. వీటినే టెక్నికల్‌ సిల్స్‌ అనీ పిలుస్తారు. ఎంచుకున్న విభాగమేదైనా వీటిని అందిపుచ్చుకోవాల్సిందే. అయితే అవి సాధారణంగా ఏ రెజ్యూమె చూసినా కనిపించేవి అయ్యుండకూడదు. పరిశ్రమకు సంబంధించినవైతే మంచిది.

* తోటి వాళ్లతో కలిసిపోవడం.. సంస్థ అయినా విశ్వ విద్యాలయమైనా చూసే ప్రధాన లక్షణం ఇదే. కాబట్టి, భాషా నైపుణ్యాలతోపాటు ధైర్యంగా మాట్లాడే, సులువుగా కలిసిపోయే పద్ధతినీ అలవరచుకోవాలి. కళాశాల కమిటీలు, సెమినార్లు వంటి వాటిల్లో పాల్గొంటే ఈ నైపుణ్యాలు సులువుగా వస్తాయి.

* మొక్కుబడిగా వద్దు.. చదువుతూనే పని వాతావరణం గురించి తెలుసుకునే అవకాశాన్ని ఇంటర్న్‌షిప్‌లు అందిస్తాయి. వీటిని మొక్కుబడిగానో కాకుండా సీరియస్‌గా చేయండి. నిజంగా నేర్చుకునే అవకాశం వీటిద్వారానే కలుగుతుంది.

* సమయానికి అనుగుణంగా ప్రవర్తించడం.. దీన్నే ట్రాన్ఫరబుల్‌ స్కిల్‌గానూ చెప్పొచ్చు. పరిస్థితిని బట్టి.. మల్టీటాస్కింగ్‌, బృందాన్ని నడిపించగలగడం, త్వరగా స్పందించగలగడం, త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం వంటివి అలవాటు చేసుకోవాలి.


Advertisement


మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని