ఆ భావనతోనే ఒత్తిడి...
close
Published : 01/09/2021 01:18 IST

ఆ భావనతోనే ఒత్తిడి...

మౌనిక ఆఫీస్‌లో ఉన్నంతసేపూ ఉత్సాహంగానే ఉండగలుగుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది. అప్పటివరకు ఉన్న చురుకుదనం ఒంటరిగా అయ్యేసరికి ఒక్కసారిగా మటుమాయం కావడం ఆమెకు అర్థంకాని సమస్యగా మారింది. ఇటువంటి సమయంలో ఒత్తిడిని జయించకపోతే అది పలు రకాల ప్రతికూల ఆలోచనలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు మానసిక నిపుణులు.

గుర్తించాలి... ఏయే సమయాల్లో మనసు ఒత్తిడికి లోనవుతుందో కనిపెట్టాలి. ఏదైనా అంశం గురించి ఆలోచించేటప్పుడు లేదా ఆయా సందర్భానికి ఆందోళన మనల్ని దరిచేరుతోందా అనేది ఎవరికి వారు గుర్తించగలగాలి. కొందరికి ఒంటరిగా ఉన్నామనే భావనే తీవ్ర ఒత్తిడికి దారితీసేలా చేస్తుంది. వీటిలో ఏది మనసును ఆందోళనలోకి నెడుతుందో తెలుసుకోవాలి.

సాధన... ఒత్తిడికి గురయ్యే సందర్భాలను తెలుసుకున్న తర్వాత వాటికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఏయే ఆలోచనలు మనసును ఆందోళనపరుస్తున్నాయో అవి దరికి చేరకుండా సాధన చేయాలి. ఆ సమయాన్ని మరొక దిశగా మార్చడానికి కృషి చేయాలి. మనసుకు నచ్చిన పుస్తక పఠనం, తోట పెంపకం, చెస్‌ వంటి మైండ్‌గేమ్స్‌ ఆడటం ద్వారా మనసు మరోవైపు మళ్లుతుంది. యోగా, వ్యాయామం శరీరాన్ని మాత్రమే కాక మనసునూ ప్రశాంతంగా ఉంచుతాయి. వీటిని ప్రయత్నించండి.

నచ్చిన వారిని... మనసుకు దగ్గరైన, నచ్చిన స్నేహితులతో వీడియో కాల్‌ మాట్లాడటం వల్ల కొంత ప్రశాంతత దక్కుతుంది. వీలైనంత వరకూ ఒంటరిగా కాకుండా నలుగురితో కలిసి అవుట్‌డోర్‌ గేమ్స్‌ ఆడటం లేదా ట్రెక్కింగ్‌ చేసి ప్రకృతిని ఆస్వాదించడం వంటివి కూడా ఒత్తిడిని దూరం చేస్తాయి. నచ్చిన వంటకాన్ని తయారు చేయడం, చిత్రకళను నేర్చుకోవడం వంటివీ ప్రశాంతతను అందిస్తాయి.

కొత్తగా... నిత్యం చేసే పనులు కాకుండా కొత్తగా ఆలోచించడం, అప్పటి వరకు చేయని ఏదైనా పనిని ఎంచుకోవడం ద్వారా ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. సౌందర్య పరిరక్షణకు కొంత సమయాన్ని ఉపయోగించడం, ఉన్న దుస్తులతో కొత్తగా మ్యాచింగ్‌ ప్రయత్నించడం, వినూత్నంగా హెయిర్‌స్టైల్‌ మార్చుకోవడం వంటివి చేస్తే మనసు మళ్లుతుంది.

సాయం... అనాథ చిన్నారుల ఆశ్రమం, వృద్ధాశ్రమాలకు వెళ్లి వారి అవసరాలను తెలుసుకోవాలి. వారికి చేతనైనంత సాయం చేయడానికి ముందడుగు వేయాలి. మొదట కొత్తగా అనిపించినా, దీనిద్వారా మనసు సంతోషంతో నిండుతుంది. అనాథల కష్టాలను చూసినప్పుడు వారి కన్నా మన పరిస్థితి ఎంతో మెరుగు అనే భావం మనల్ని మానసిక అనారోగ్యాల నుంచి దూరం చేస్తుంది. లేనివారికి చేయూత నందించామనే తృప్తినీ అందిస్తుంది.


Advertisement


మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని