ఒంటరితనాన్నిలా జయించొచ్చు
close
Updated : 05/10/2021 07:08 IST

ఒంటరితనాన్నిలా జయించొచ్చు

మాలతి ఓ కోర్సు చదవడానికి ఇంటికి దూరంగా వచ్చింది. దాంతో కుటుంబంతో ఎప్పుడూ సరదాగా ఉండే ఆమె ఒంటరితనంతో కుంగుబాటుకు గురైంది. చదువుపై శ్రద్ధ తగ్గింది. ఇది సహజమే అంటున్నారు మానసిక నిపుణులు. అలాగే కొత్తగా విధుల్లో చేరిన ఉద్యోగినులకు కూడా సొంత వాళ్లు దూరమైనప్పుడు ఇటువంటి సమస్య ఎదురవుతూ ఉంటుంది. దీన్నుంచి బయటపడి పూర్వపు ఉత్సాహాన్ని పొందడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి అంటున్నారు నిపుణులు.

* ఉత్తరం... ముందుగా ఒంటరితనానికి కారణాన్ని గుర్తించాలి. ఇష్టమైన వ్యక్తులకు దూరమయ్యామనిపిస్తే వారితో ఫోన్‌లో రోజూ మాట్లాడటానికి ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించుకోవాలి. వీడియోలో చూస్తుంటే వాళ్లు దగ్గరగా ఉన్నట్లే అనిపిస్తుంది. అమ్మానాన్నలకు లేదా స్నేహితులకు మనసులోని భావాలను ఉత్తరంగా మలచండి. ఆ తర్వాత వారిని జవాబివ్వమనండి. ఇలా చేస్తే మనసంతా తేలికగా అవడమే కాదు, మీరు ఒంటరి కారనే భావం కలుగుతుంది. అలాగే ఒక పుస్తకంలో రోజూ మీరు చేసిన పనులు, ప్రయత్నాలు, అనుభవాలు వంటివన్నీ పొందుపరచండి.

* ఆరోగ్యం... ఎవరూ దగ్గరగా లేరని ఆహారంపై అశ్రద్ధ చూపించకూడదు. పౌష్టిక విలువలున్న ఆహారాన్ని తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారు. వేళకి తినడం, నిద్ర అన్నవి నియమాలుగా పెట్టుకుని తప్పక పాటించాలి. వ్యాయామానికి కొంత సమయాన్ని కేటాయించుకుంటే మంచిది. ఇవన్నీ శారీరకంగా, మానసికంగా దృఢంగా మార్చి, ఒత్తిడి నుంచి దూరం చేస్తాయి.  ఈ అలవాట్ల వల్ల మీరు ఒంటరిగా గడపాల్సిన సమయం తగ్గిపోయి బిజీగా ఉంటారు.

* అభిరుచి... చిన్నప్పటి అభిరుచులను తిరిగి మొదలుపెట్టాలి. అది సంగీతం, తోట పని, చిత్రలేఖనం, క్రీడ, కొత్తవంట నేర్చుకోవడం లేదా పుస్తక పఠనం... ఇలా  ఏదైనా కావొచ్చు. గతంలో ఏమీ లేకపోతే కొత్తగా మొదలు పెట్టండి. మనసుకు నచ్చిన వీటి కోసం కాస్తంత టైం కేటాయించుకోవాలి. ఇవి ఒత్తిడి, ఆందోళన వంటివి దరికి చేరకుండా చేస్తాయి. మీరు వెళ్లిన కొత్తచోట ఎదురయ్యే ప్రతి వ్యక్తి నుంచి మీకు తెలియని విషయాల్ని గ్రహించి నేర్చుకోవడం మొదలుపెడితే తిరిగి ఉత్సాహంగా మారతారు.  

* కొత్తగా... రోజులో ఓ గంట సమయాన్ని మిగుల్చుకుని, ఏదైనా ఓ కొత్త ప్రాజెక్టును ప్రారంభించాలి. తెలియని భాషను నేర్చుకోవడం, ఎప్పటి నుంచో రాయాలనిపించే కథను పేజీపై పెట్టడం, కొత్త వాయిద్యంలో శిక్షణ తీసుకోవడం... ఇలా ఏదో ఒకటి ఓ ప్రాజెక్టుగా భావిస్తే చాలు. ఇది మానసిక ధైర్యంతోపాటు ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. దీంతో మీలాంటి వారికి స్ఫూర్తిగా మీరు మారతారు. వీటితోపాటు మీరువెళ్లిన కొత్తప్రాంతం గురించి అధ్యయనం చేయొచ్చు. స్నేహితులతో మీ అనుభవాలను పంచుకోవచ్చు.


Advertisement


మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని