మీరు నాయకురాలా?
close
Published : 18/10/2021 00:58 IST

మీరు నాయకురాలా?

భారతి మేనేజర్‌గా పదోన్నతి పొందింది. పదిమంది బృందానికి నేతృత్వ బాధ్యతలను సంస్థ అప్పగించింది. ఆమెకు ఈ స్థానంలోకి రావాలంటే కొంచెం భయంగా ఉంది. ఇటువంటి సమయంలోనే నైపుణ్యాలను ప్రదర్శించాలంటున్నారు కెరియర్‌ నిపుణులు.

అనుభవంతో... అదే రంగంలో అనుభవం ఉంటే ధైర్యంగా ముందడుగు వేయొచ్చు. కొత్త బాధ్యతల్లో వాటిని వినియోగించాలి. లేదంటే అప్పగించిన ప్రాజెక్టుకు సంబంధించి అనుభవమున్న వారిని వివరాలు అడగడానికి సంకోచించకూడదు. అందులో కష్ట నష్టాలను తెలుసుకోగలిగితే చేయాల్సిన కృషిపై అవగాహన కలుగుతుంది. అలాగే పదోన్నతి ఇంటర్వ్యూలోనో, తర్వాతో మీ బాధ్యతలను పూర్తిగా అడిగి తెలుసుకోవాలి. అక్కడి పని విధానాన్ని నేర్చుకోవాలి.

నిర్ణయాలు... సమయానికి తగినట్లు స్పందించి నిర్ణయాలు తీసుకోగలిగే నైపుణ్యం ఉంటే కొత్త కెరియర్‌ ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవచ్చు. జట్టు సభ్యులందరికీ వారి సామర్థ్యాన్ని చూపించగలిగే అవకాశాన్నివ్వాలి. మొత్తం పదిమందీ ఒకేలా ఉండకపోవచ్చు. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ప్రత్యేక నైపుణ్యం, అనుభవం ఉండొచ్చు. ముందుగా గుర్తించి, వాటిని ఎలా వినియోగిస్తే మంచి ఫలితాలు పొందవచ్చో తెలిస్తే చాలు. లక్ష్యాలను ఛేదించొచ్చు. నిత్యం అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపే నాయకత్వ లక్షణాలుంటే చాలు. బృందమంతా విజయంలో భాగస్వాములవుతారు.


Advertisement


మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని