నీడ లేని వారికి గృహదానం!
close
Updated : 18/06/2021 00:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నీడ లేని వారికి గృహదానం!

సాయమనగానే ఏం గుర్తొస్తుంది? ఆహారం, దుస్తులు.. లేదంటే నగదు ఇవ్వడం కదా! కానీ ఒకామె ఏకంగా ఇళ్లను కట్టించి ఇస్తోంది. అలా  రెండు వందలకు పైగా ఇళ్లను కట్టించి ఇచ్చింది. ప్రభుత్వాల బాధ్యతలను భుజాన వేసుకున్న ఆమే సునీల్‌ ఎంఎస్‌...

అబ్బాయి పుడితే ఈ పేరు పెట్టాలనుకున్నారు సునీల్‌ వాళ్ల నాన్న. అమ్మాయి పుట్టినా ఆ పేరునే పెట్టారు. సునీల్‌ జువాలజీ ప్రొఫెసర్‌. రెండేళ్ల క్రితం పదవీ విరమణ చేశారు. తండ్రి బ్యాంక్‌ మేనేజర్‌, తల్లి టీచర్‌. ఆర్థికంగా స్థితిమంతుల కుటంబం వీరిది. అమ్మానాన్నలు ఇంట్లో, పొలంలో పని వారికీ, చుట్టూ ఉన్నవారికీ సాయం చేస్తుండటం చూస్తూ పెరిగిందీవిడ.
2006లో ఆమె పనిచేసే కళాశాలకు సునీల్‌ రెండోసారి ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌గా ఎంపికైంది. ఏటా కళాశాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఆ ఏడాది తమ కళాశాలలో పక్కా ఇళ్లు లేని పేద విద్యార్థులకు గృహాలు నిర్మించి ఇద్దామనే ఆలోచన చేశారు. ఓ విద్యార్థిని తన స్నేహితురాలు ఆశాకి సరైన ఇల్లు లేదని సునీల్‌ దృష్టికి తీసుకొచ్చింది. ఆ విద్యార్థిని ఇంటికి వెళ్లిందీమె. ‘ఆశా వాళ్లది ప్లాస్టిక్‌ షీట్లతో తయారు చేసిన ఇల్లు. ద్వారానికి తలుపుగా చున్నీని కట్టారు. దాన్ని అప్పుడప్పుడూ వేసుకొని ఆశా కళాశాలకు వస్తుంది కూడా. అది చూసి చలించిపోయాను’ అంటుంది సునీల్‌.
ఆ అమ్మాయి ఇంటికి లక్షా ఇరవై వేలు అయితే రూ.98 వేలు కళాశాల నుంచి వచ్చాయి. మిగిలినవి సునీల్‌ సేవింగ్స్‌. ఇంకోసారి కోడుమన్‌లో క్యాన్సర్‌ పేషెంట్‌కీ ఇల్లు లేదని తెలిసి, కట్టించి ఇచ్చింది. ‘ఇళ్లు ఇచ్చినపుడు వాళ్ల కళ్లలో ఆనందం చూశాక ఇంతకన్నా జీవితానికి ఇంకేం కావాలనిపించింది. అప్పుడే పేదల ఇళ్ల విషయంలో చేతనైన సాయం చేయాలనుకున్నా’ అంటోందీ విద్యావేత్త. ఇప్పటివరకూ కేరళలోని అయిదు జిల్లాల్లో 206 గృహాలను నిర్మించి ఇచ్చింది. తను ఇచ్చే 650 చదరపు అడుగుల ఇంట్లో రెండు పడక గదులు, హాలు, వంట గది ఉంటాయి. పిల్లలున్న వితంతువులకు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడే పేదలకు ఈ విషయంలో ప్రాధాన్యం ఇస్తుంది. సేవా కార్యక్రమాల కోసం సునీల్‌ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసింది. సొంత సొమ్ముతో పాటు విద్యార్థులు, స్నేహితులు విరాళాలు ఇస్తూ ఉంటారు. ఒక్కో ఇంటికీ రూ.4 లక్షలు అవుతోందట. సామగ్రిని తనే స్వయంగా కొంటుంది. ఇలా అయితే ఖర్చు కలిసొస్తుందని. ఇదేకాదు ఏటా వెయ్యి మంది విద్యార్థులకు పుస్తకాలు, ఇతర సామగ్రిని ఇచ్చేది. లాక్‌డౌన్‌లో 13 మందికి ల్యాప్‌టాప్‌లు, 3 టీవీలనూ అందించింది. చక్కటి ఇళ్లతో ఓ గ్రామాన్ని నిర్మించి పేదలకు ఉచితంగా ఇవ్వాలన్నది సునీల్‌ కల. ఆ దిశగా ప్రయత్నిస్తున్నానంటోంది. ఆమె కల నెరవేరాలని కోరుకుందాం.


మరిన్ని

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని