11 ఏళ్లుగా నిత్యాన్నదానం
close
Updated : 24/06/2021 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

11 ఏళ్లుగా నిత్యాన్నదానం

పండగ కాదు.. పెళ్లికాదు.. కానీ రోజూ ఆ ఇంట్లో 150 కిలోల బియ్యం ఉడకాల్సిందే... అన్నార్తుల కడుపు నిండాల్సిందే! పదకొండేళ్లుగా ఈ నిత్యాన్నదానాన్ని నిరాటంకంగా నిర్వహిస్తున్నారు కోనేరు రమాదేవి...

కొవిడ్‌ కారణంగా అనేకమంది ఉపాధిలేక పస్తులున్నారు. వీరిందరికీ మేమున్నాం అని భరోసా ఇచ్చి వారి ఆకలిబాధను తీర్చారు రమాదేవి. ఈ యజ్ఞం నిన్నా మొన్నటిది కాదు. పదకొండేళ్ల క్రితం పేదల ఆకలి తీర్చాలన్న లక్ష్యంతో సిర్పూర్‌-కాగజ్‌నగర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఆయన సతీమణి రమాదేవి దీన్ని కొనసాగిస్తున్నారు. ఆ ఇంట్లో ఉదయం ఆరు గంటలకే పొయ్యి వెలుగుతుంది. పాతికమంది యువకులు స్వచ్ఛందంగా వచ్చి వంట-వార్పులో దిగుతారు. కూరగాయలు తరుగుతూ, బియ్యం పొయ్యిమీద కెక్కిస్తూ, తాలింపులు వేస్తూ సందడిగా ఉంటుంది ఆ ఇంటి వాతావరణం. వీటన్నింటిని రమాదేవి పర్యవేక్షిస్తారు. అన్నం, పప్పులు, ఊరగాయ, కూరలను ప్యాక్‌ చేసి విస్తర్లు సైతం అందజేస్తున్నారు. ఈ క్రతువులో ఆమెతోపాటు ఆమె తోటికోడళ్లు కోనేరు ఉషాకిరణ్‌, విజయశ్రీ, రుక్మిణిదేవితో పాటు కుమార్తె ప్రతిమ రోజూ పాల్గొంటారు. ‘1981లో మా వివాహమైంది. ఎమ్మెల్యేగా ఆయన ఇంటి వద్ద ఉండడం తక్కువ. తక్కిన కుటుంబ సభ్యులంతా ఈ పనిలో నిమగ్నమవుతాం. మా ఫోన్‌ నంబర్లు ప్రజలకు అందుబాటులో ఉంచాం. వాటికి రోజూ వందలమంది భోజనం కావాలని సంప్రదిస్తారు. స్వచ్ఛంద కార్యకర్తలు 20 మంది భోజనపు సంచులను తీసుకెళ్లి పంచి వస్తున్నారు. ప్రస్తుతం ఆరొందలమందికి భోజనాన్ని అందిస్తున్నాం.

నిత్యం రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చు అవుతుంది. ఉదయం 75 కిలోల బియ్యం, సాయంత్రం 75 కిలోలు మొత్తం 1.50 క్వింటాళ్లు, క్వింటా కూరగాయలను వండుతున్నాం. ఇందుకు కొందరు దాతలు సహకరిస్తున్నారు. కర్మ కార్యక్రమాలకు భోజనాలు కావాలని కూడా కొందరు పేదలు సంప్రదిస్తూంటారు. ఇప్పటి వరకు 50 పైనే కార్యక్రమాలకు ఇలా భోజనం అందించాం. ఎంత మంది ఉన్నా ముందుగా ఫోన్‌ చేసి చెప్తే చాలు భోజనం వారి ఇళ్ల వద్దకే చేరుస్తున్నాం. ప్రజలకు కరోనా కష్టకాలంలో అండగా ఉండాలనే సంకల్పంతో 40 ఆక్సిజన్‌ సిలెండర్లు తెప్పించి నిరంతరం అందుబాటులో ఉంచాం. అధికారం ఉన్నా, లేకున్నా, ఆపద సమయంలో వారికి కడుపునిండా భోజనం పెట్టడం, వైద్యపరంగా అండగా ఉండటంతో వారి కళ్లలో కనిపించే ఆనందం ముందు ఏదీ ఎక్కువ కాదు. కష్టాలు తీరి, కడుపు నిండిన పేదల ముఖాల్లో సంతోషాన్ని చూస్తే కలిగే తృప్తే వేరు’ అని వివరించారు రమాదేవి.

- చొక్కాల రమేశ్‌, ఆసిఫాబాద్‌


మరిన్ని

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని