మనో వైద్యం చేస్తున్నారు
close
Updated : 24/06/2021 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మనో వైద్యం చేస్తున్నారు

వరుస లాక్‌డౌన్‌లు, సామాజిక దూరం, ఆప్తులను కోల్పోవడం.. ఇవి ఎంతో మందిని మానసికంగా దెబ్బ తీశాయి. శారీరక సమస్యలకు వాట్సాప్‌ నుంచి జూమ్‌ వరకు అన్ని విధానాల్లో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ విధానాన్నే మానసిక చికిత్సకూ ఉపయోగిద్దామనుకున్నారు సరస్‌ భాస్కర్‌. మానసిక నిపుణులను ఒక వేదికగా అందుబాటులోకి తెచ్చారు.

‘కరోనా ప్రారంభమైనప్పటి నుంచీ ఆన్‌లైన్‌ వేదికగా ఎంతోమంది వైద్యులు సాయానికి ముందుకొచ్చారు. ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంచుకోవడం, వ్యక్తిగత, పరిసరాల శుభ్రతపై దృష్టిపెట్టారు. కానీ తగ్గిపోతున్న సైకలాజికల్‌ ఇమ్యూనిటీ సంగతేంటి?’ అంటారు సరస్‌ భాస్కర్‌. ఈమె చెన్నైలో కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌. వరుస లాక్‌డౌన్‌లు, సామాజిక దూరం వంటివి విద్యార్థులు సహా ఎంతో మందిపై నెగెటివ్‌ ప్రభావం చూపుతున్నాయంటున్నారు. ఆప్తులను కోల్పోయిన వారి విషయంలో పరిస్థితి మరీ దిగజారడం ఆమె గమనించారు. అలాంటి వారికి సాయం అందించాలనుకున్నారు. ఆన్‌లైన్‌ విధానాన్ని ఉపయోగించాలనుకున్నారు. ఆవిడ గతంలో చెన్నై కౌన్సెలర్స్‌ ఫౌండేషన్‌ (సీసీఎఫ్‌)ను స్థాపించారు. దీనిలో వివిధ రకాల మానసిక నిపుణులు ఉంటారు. వారి సాయంతో ఉచితంగా సేవలను అందించాలనుకున్నారు. తన ఆలోచనను వారి ముందుంచగా 25 మంది ముందుకొచ్చారు. దీనికి ‘లెట్స్‌ టాక్‌’ అని పేరు పెట్టారు. ఇంగ్లిష్‌, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉందిది. ఏ వయసు వారైనా సంప్రదించవచ్చు. ఒక్కొక్కరికీ 30-45 నిమిషాల వరకూ కేటాయిస్తారు. నచ్చిన భాషనూ ఎంచుకోవచ్చు. మొదట మానసిక స్థితిపై పరీక్ష నిర్వహించి, తర్వాత కౌన్సెలర్‌తో మాట్లాడిస్తారు.

మొదటి లాక్‌డౌన్‌ సమయంలోనూ వీరు ఉచిత సేవలను అందించారు. కానీ సెకండ్‌ వేవ్‌లో పరిస్థితి మరీ దిగజారడంతో ఒక వేదికగా ప్రయత్నిస్తే ఎక్కువ మందికి సేవలందించొచ్చని భావించారు. ‘చాలామందిలో ఒత్తిడి, ఆందోళన, బాధ ఎక్కువ అయ్యాయి. ఆర్థిక ఇబ్బందులు, భవిష్యత్‌పై భయం, మెడికల్‌ ట్రామా మానసికంగా కుంగదీస్తున్నాయి. ఆప్తులను కోల్పోయిన వాళ్లు ఆ బాధ నుంచి బయటపడ లేకపోతున్నారు. ఇలాంటి వారికి ఇప్పుడే చికిత్సనందించాలి. లేదంటే సమస్య మరింత జఠిలమవుతుంది. అందుకే ఇలా ముందుకొచ్చాం. మొదట మేం వాళ్ల సమస్యని వింటాం. ఆ తర్వాతే వ్యక్తిగత చికిత్సను ప్లాన్‌ చేస్తాం. అవసరమైతే ప్రత్యేకంగా కొన్ని సెషన్లనూ నిర్వహిస్తాం’ అంటారు సరస్‌. ఆగస్టు 10 వరకూ ఉదయం 7 గం. నుంచి రాత్రి 7 గం. వీరి సేవలు అందుబాటులో ఉంటాయి. తరువాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామంటున్నారు.


మరిన్ని

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని