ఈ అత్తాకోడళ్లు... ఆదర్శ సేవకులు
close
Published : 28/06/2021 01:10 IST

ఈ అత్తాకోడళ్లు... ఆదర్శ సేవకులు

మేమున్నాం

సాధారణంగా అత్తాకోడళ్లకు ఒకరంటే మరొకరికి పడదు అనే భావన ఉంటుంది. సినిమాలు, సీరియళ్లలోనూ అధిక శాతం అలాగే చూపిస్తుంటారు. కానీ, వీరు మాత్రం అందరిలా కాదు.. మానవత్వానికి, మహిళా శక్తికి ఉదాహరణగా నిలుస్తున్నారు.

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన నిర్మల, ఖుష్బూ అత్తాకోడళ్లు. నిర్మల గత 35 ఏళ్లుగా కుట్టు పని చేస్తోంది. కోడలు కూడా అత్త బాటలోనే నడుస్తోంది. కరోనా సమయంలో ఎందరో ఉపాధిని కోల్పోయారు. తిండి లేక పస్తులుంటున్నారు. కొవిడ్‌ వచ్చినవారి పరిస్థితి మరీ దారుణం. ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ లభించక వారు పడుతున్న కష్టాలను చూస్తుంటే కంట నీరు రావాల్సిందే. ఇవన్నీ చూసి ఆ అత్తాకోడళ్ల మనసు చలించింది. బాధితులకు చేతనైనంత అండగా నిలవాలని అనుకున్నారు. తాము దాచుకున్న సొమ్ముతో ఆక్సిజన్‌ సిలిండర్లను కొని అవసరమైన వారికి అందిస్తున్నారు.

అడిగిన వారికి లేదనక... కొవిడ్‌ రోగుల కోసం నిర్మల 74 వేల రూపాయల విరాళాన్ని కలెక్టర్‌కు పంపితే ఆయన వాళ్ల గురించి తెలుసుకుని ఆశ్చర్య పోయారు. ఫోన్‌ చేసి అంతే ఎందుకు పంపారు అని అడిగారు. స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లు అయ్యింది కదా అందుకు గుర్తుగా అని చెప్పారట నిర్మల. ‘ఈ కష్ట సమయంలో ఎంతో మంది సేవ చేస్తున్నారు. మేం కూడా ఎంతో కొంత ఆర్థికంగా అండగా నిలవాలని అనుకున్నాం’ అని చెబుతోంది ఖుష్బూ. కొవిడ్‌ నుంచి కోలుకున్న వారు, కొందరు దాతలు కూడా ఈ అత్తాకోడళ్లకు అండగా నిలుస్తున్నారు. సాయం కోసం ఎవరొచ్చినా.. లేదనకుండా నిత్యావసర సరకులు అందిస్తున్నారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్లైన వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్లతో కూడిన కిట్లను పంపిణీ చేస్తున్నారు.

సంకల్పం ఉంటే చాలని..  ‘వాలంటీర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేస్తున్నారు. ఎంతోమంది మాకు అండగా నిలుస్తూ.. మా ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. సంకల్పం ఉన్న మహిళ ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోగలదు’ అని అంటున్నారీ ఈ అత్తాకోడళ్లు. 

- తేరాల రంజిత్‌ కుమార్‌, హైదరాబాద్‌

మరిన్ని

నారీ... వ్యాయామ దారి!

ఇంట్లో పనే ఎక్సర్‌సైజు... ఒక గృహిణి అభిప్రాయం. ఆఫీసుకెళ్లొచ్చే సరికే టైం అయిపోతుంది. మళ్లీ జిమ్‌కు వెళ్లే తీరిక ఎక్కడిది? ఒక ఉద్యోగిని ఆవేదన. జిమ్‌ కెళ్లినా అక్కడ మగవాళ్లతో పాటు చేయలేం... ఇదో యువతి సమస్య... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే మార్గాలు బోలెడు ఉన్నాయంటున్నారు...జీరోసైజ్‌ లేదా సన్నగా, నాజూగ్గా ఉండాల్సిన అవసరం సినీతారలు, మోడల్స్‌కు మాత్రమే. మేమెందుకు నోరు కట్టేసుకోవాలి, కసరత్తులంటూ చెమటోడ్చాలి అనే భావన చాలా మంది మహిళల్లో ఉండేది. గృహిణులకు ఇంటిపనే సరిపోతుందిలే’ అనే అపోహ ఉండేది. ఇప్పుడు మహిళలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో జీవనశైలిలో మార్పులు వచ్చాయి.

తరువాయి

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

తరువాయి

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

తరువాయి

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని