ఆ వార్త చెప్పడం బాధనిపించేది!
close
Published : 01/07/2021 01:43 IST

ఆ వార్త చెప్పడం బాధనిపించేది!

నేడు జాతీయ వైద్యుల దినోత్సవం'

నిద్ర కరవైన రాత్రులు...క్షణం కూడా ఆదమరవలేని రోజులవి! పునర్జన్మ పొందిన రోగులు ఇళ్లకెళ్తుంటే సంతోషించారు! పోరాడి ఓడిన వారిని తమ చేతులతో మార్చురీలకు పంపాల్సి వచ్చినప్పుడు కుమిలి పోయారు. గాంధీ ఆసుపత్రిలో ఆర్‌ఎమ్‌ఓ (రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్లు)లుగా వ్యవహరించిన వారి అనుభవాలు ఇవీ... కొవిడ్‌ గడ్డు రోజులని మనోనిబ్బరంతో జయించి రోగుల్లో, తోటి సిబ్బందిలో స్థైర్యాన్ని నింపారీ డాక్టరమ్మలు. వారిలో ఒకరైన డాక్టర్‌ మాధురి ఆ పరిస్థితుల గురించి వివరించారు...

సాధారణ వైద్యులతో పోలిస్తే మా ఆర్‌ఎమ్‌ఓల(రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్లు)పని చాలా కష్టమైంది. అదీ... మామూలు రోజులతో పోలిస్తే ఈ సెకండ్‌వేవ్‌ సమయంలో ప్రజలకు... ఆసుపత్రికి మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరించడం సవాల్‌గా మారింది. నాతోపాటు డాక్టర్‌ సత్యరత్న, అన్నపూర్ణ, యశోద, విజయలలిత, శోభ, స్ఫూర్తి, సునీత, వసుధ వంటివారు ఈ బాధ్యతల్ని తీసుకున్నారు. ‘24 గంటలూ రోగుల మధ్యే ఉంటున్నావ్‌. అవసరమా ఈ ఉద్యోగం. ఇంట్లో పిల్లలున్నారు. లాంగ్‌ లీవ్‌ పెట్టేయొచ్చుగా?’ ఆత్మీయుల నుంచీ, అయినవాళ్ల నుంచి ఇలాంటి హెచ్చరికలు వింటూ కూడా మేమంతా విధులకు హాజరయ్యాం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం? అని నచ్చచెప్పుకొన్నాం. రోజురోజుకీ వైరస్‌ తీవ్రత పెరగడం తెలుస్తూనే ఉంది. చూస్తుండగానే మామూలు బెడ్ల స్థానంలో ఆక్సిజన్‌, వెంటిలేటర్లున్న బెడ్లు ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ఇందుకోసం గోడలకి మేకులు కొట్టాలి. అవి కొట్టలేక ప్లంబర్లు చేతులు నొప్పెట్టి అసహన పడుతుంటే మా పరిస్థితి మరోలా ఉండేది. రోజుకి వందల కాల్స్‌. బెడ్స్‌ కావాలని. ఎక్కడెక్కడ నుంచో సిఫారసులు. మరోపక్క ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వారి వివరాల గురించిన సమాచారాన్ని వాళ్ల ఆత్మీయులకు చేరవేయాలి. ఒక్కోసారి మా నోటితోనే చావువార్తలనీ చెప్పాల్సి వచ్చేది. చిన్న వయసులో ప్రాణాలు కోల్పోయిన వారిని చూసి చాలా బాధనిపించేది. తల్లిని కోల్పోయిన పసిపాపలని చూసి కన్నీళ్లు ఆగేవి కావు.

‘రాత్రేకదా మాట్లాడాం. ఇంతలోనే ఎలా చనిపోతారని ఆత్మీయులు బోరున విలపిస్తుంటే ఓదార్చడం కష్టమయ్యేది. ఆ శవాలు మార్చురీలకు చేరేవరకూ మాదే బాధ్యత. ఆసుపత్రి బయట ఆంబులెన్సులు వరుసలు కట్టేవి. అందులోని రోగులు ఖాళీ అయ్యే బెడ్స్‌ కోసం ఎదురుచూస్తుంటే.. ఆ పరిస్థితుల మధ్య విపరీతమైన ఒత్తిడి ఉండేది. ఇవాళ పొద్దున తొమ్మిదింటికి వస్తే... రేపు తొమ్మిదింటి వరకూ విధుల్లో ఉండేవాళ్లం. మండువేసవి. పీపీఈ కిట్లలో ఉడికిపోతూ, డబుల్‌ మాస్కులు పెట్టుకుని పనిచేసేవాళ్లం. వారాంతపు సెలవులు కూడా వదులుకోవాల్సి వచ్చేది. ఆసుపత్రిలో వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న రోజుల్లో ఇంట్లోనే వండుకుని తెచ్చుకునేవాళ్లం. కొన్నిరోజులు పెరుగన్నంతోనే సర్దుకోవాల్సి వచ్చేది. ఇంటికెళ్లాక రోజూ తలస్నానమ్‌. అదీ ఇబ్బందే కదా! ఏమాత్రం లక్షణాలు కనిపించినా టెస్టులు చేయించుకోవడం.. ఆ ఫలితాలు వచ్చేంతవరకూ ఇంట్లో వాళ్లకి దూరంగా ఉండటం మాకు అలవాటైపోయింది. తీవ్రమైన పని ఒత్తిడి వల్ల నర్సులు, పారిశుద్ధ్యసిబ్బంది అసహనానికి లోనయ్యేవారు. మొదట్లో పేషెంట్‌ కేర్‌ బాధ్యతలు కూడా తీసుకొనేవాళ్లం. అంటే రోగులకు దగ్గరుండి తినిపించడం, డైపర్లు మార్చడం వంటి పనులు కూడా మా సిబ్బంది చేసేవారు. అంత ఒత్తిడిలో వాళ్లు ఏదైనా అంటే.. పరిస్థితులు చక్కదిద్దుకుంటాయి అని నచ్చచెప్పేవాళ్లం. మా అందరి పరిస్థితీ అదే కదా మరి. మా అత్తమామలు, మేమూ ఒకే ఫ్లోర్‌లో ఉంటాం. అయినా వారికే అనారోగ్యమూ నావల్ల రాకూడదని దూరంగా ఉండేదాన్ని. పెద్దవాళ్లకు దూరంగా ఉండటం కష్టమే అయినా తప్పలేదు మరి. డాక్టర్‌ అన్నపూర్ణకి నాలుగేళ్లపాప. తను కొవిడ్‌ బారినపడి.. కోలుకుంటన్నారు. మా శ్రమ ఫలించింది. నెమ్మదిగా మరణాలు తగ్గుముఖం పట్టడం మాలో స్థైర్యాన్ని రెట్టింపు చేసింది. చాలామంది రోగులు ‘మాకిది పునర్జన్మ’. అంటూ కాళ్లమీద పడిపోయేవారు. మీరు అందించిన సేవలకు ప్రతిఫలంగా ఎంతో కొంత వెనక్కి ఇవ్వాలనుకుంటున్నాం అంటూ తోచిన సాయం అందించేవారు. కొందరు మాస్కులు, గ్లౌవుజులు ఇస్తే ఇంకొందరు ఆక్సిజన్‌ కాన్‌సెన్‌ట్రేటర్లు వంటివి ఇచ్చేవారు. వీటన్నింటికన్నా రోగులు కోలుకుని ఇంటికెళ్తుంటే కలిగే సంతోషం చెప్పనలవికాదు.



ప్రతి నిత్యం ప్రతి పనిలో నువ్వేంటో నిరూపించుకో! మానసికంగా, శారీరకంగా నానాటికీ దృఢంగా తయారవ్వు!

- రాధికా అగర్వాల్‌, కో ఫౌండర్‌, షాప్‌క్లూస్‌

మరిన్ని

నారీ... వ్యాయామ దారి!

ఇంట్లో పనే ఎక్సర్‌సైజు... ఒక గృహిణి అభిప్రాయం. ఆఫీసుకెళ్లొచ్చే సరికే టైం అయిపోతుంది. మళ్లీ జిమ్‌కు వెళ్లే తీరిక ఎక్కడిది? ఒక ఉద్యోగిని ఆవేదన. జిమ్‌ కెళ్లినా అక్కడ మగవాళ్లతో పాటు చేయలేం... ఇదో యువతి సమస్య... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే మార్గాలు బోలెడు ఉన్నాయంటున్నారు...జీరోసైజ్‌ లేదా సన్నగా, నాజూగ్గా ఉండాల్సిన అవసరం సినీతారలు, మోడల్స్‌కు మాత్రమే. మేమెందుకు నోరు కట్టేసుకోవాలి, కసరత్తులంటూ చెమటోడ్చాలి అనే భావన చాలా మంది మహిళల్లో ఉండేది. గృహిణులకు ఇంటిపనే సరిపోతుందిలే’ అనే అపోహ ఉండేది. ఇప్పుడు మహిళలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో జీవనశైలిలో మార్పులు వచ్చాయి.

తరువాయి

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

తరువాయి

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

తరువాయి

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని