చిన్నచేపల గొప్పతనం చెప్పి.. ప్రపంచ అవార్డు గెల్చుకుంది
close
Updated : 04/07/2021 04:44 IST

చిన్నచేపల గొప్పతనం చెప్పి.. ప్రపంచ అవార్డు గెల్చుకుంది

భారత సంతతికి చెందిన డాక్టర్‌ శకుంతల హార్క్‌ సింగ్‌ తిల్‌స్తాద్‌ను ప్రతిష్ఠాత్మక ‘వరల్డ్‌ ఫుడ్‌ అవార్డు’ వరించింది. నోబెల్‌ ప్రైజ్‌ ఫర్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ అని పిలిచే ఈ పురస్కారంతోపాటు కోటీ 85 లక్షల రూపాయల నగదు బహుమతిని కూడా అందుకున్నారీమె. ఈవిడ విశిష్టతలు ఏంటో చూడండి...

డెన్మార్క్‌కు చెందిన డాక్టర్‌ శకుంతల పుట్టింది ట్రినిడాడ్‌లో. భారతీయులైన ఈమె పూర్వీకులు కొన్నేళ్ల క్రితం అక్కడ స్థిర పడ్డారు. వాళ్లు వ్యవసాయ కూలీలుగా మన దేశం నుంచి అక్కడకు వెళ్లారు. ఆవిడ టొబాగో దీవిలో చదువుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారిగా కెరీర్‌ను ప్రారంభించారు. జల వ్యవసాయ పద్ధతులను రూపొందించి పేద జాలర్లకు ఉపాధిని అందించారు. ఈమె పరిశోధనలు ఆసియా, ఆఫ్రికాకు చెందిన చాలా మంది పేదలకు జీవనోపాధి, మంచి ఆరోగ్యం అందేలా సాయపడుతున్నాయి. ప్రస్తుతం ఈమె మలేషియాలోని సీజీఐఏఆర్‌ పరిశోధనా కేంద్రంలో సేవలు అందిస్తున్నారు. 71 ఏళ్ల డాక్టర్‌ శకుంతల ఈ అవార్డు అందుకున్న తొలి భారత సంతతి మహిళ.

గర్వపడుతున్నా... ‘నోబెల్‌ గ్రహీత నార్మన్‌ బోర్లాగ్‌ అయిదు దశాబ్దాల క్రితం స్థాపించిన ‘ది వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌’ సంస్థ నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేయడం  గర్వంగా ఉంది. నా పరిశోధనలన్నీ మహిళలు, చిన్నారులకు సంబంధించిన పోషకాహారం, ఆరోగ్యం వంటి అంశాలపై ఉండేవి. మొట్టమొదట నా అధ్యయనమంతా పోషకాహార లోపం ఉన్న చిన్నారులపైనే. వీరికి తరచూ వచ్చే అతిసార వ్యాధిపై పనిచేసే ఓ పరిశోధనా కేంద్రంలో ప్రయోగాలు చేసేదాన్ని. ఆ సమయంలో అక్కడ పునరావాస కేంద్రంలో ఉండే చిన్నారుల కోసం కిచెన్‌ గార్డెన్‌ ఏర్పాటు చేశా. అందులో పండించే కూరగాయలతోనే ఆ పిల్లలకు ఆహారాన్ని అందించే వాళ్లం. ఆ కేంద్రంలో ఏటా అయిదు నుంచి ఆరు వేల మంది చిన్నారులు పోషకాహార లోపంతో చేరే వారు. మేం పౌష్టికాహారం అందించడం మొదలుపెట్టిన తర్వాత ఆ సంఖ్య తగ్గింది. ఆ తర్వాత చేపలపై పరిశోధనలు చేశా. చెరువుల్లో ఉండే చేపలను కుండల్లో ఉంచి పరిశోధన చేసేదాన్ని. అలాగే పొలాల మధ్య ఉండే చెరువుల్లోనూ వాటిని వేసేదాన్ని. ఈ ప్రయోగం మంచి ఫలితాలనిచ్చింది. చేపలు ఆరోగ్యంగా ఉండటమే కాదు, వాటి సంఖ్య రెట్టింపు అవడం గుర్తించా. వ్యవసాయం, జలచరాల పెంపకం కలిపి జల వ్యవసాయం చేస్తే చాలామందికి ఉపాధిని, ఆదాయాన్ని పెంచవచ్చనే ఆలోచన వచ్చింది. ఇండియా, బంగ్లాదేశ్‌, కంబోడియా, నేపాల్‌, బర్మా, జాంబియా, మలావి వంటి దేశాల్లో అతి తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు ఎక్కువగా ఆహారంలో తీసుకునేది ఈ చిన్న చేపలనే అని తెలుసుకున్నా. నా పరిశోధనను ఈ దిశగా మళ్లించా. దీంతో వ్యవసాయంలో భాగంగా వరి, బంగాళాదుంపలు, కూరగాయలు, పండ్లు వంటి పంటల పక్కన చెరువుల్లో ఈ చేపల పెంపకం చేపడితే అటు ఆదాయంతోపాటు ఆరోగ్యమూ పెంపొందించు కోవచ్చనే అంశాన్ని నిరూపించా’ అని వివరించారు శకుంతల.

అమెరికా ప్రభుత్వ ప్రశంసలు

‘డాక్టర్‌ శకుంతల పరిశోధనలు లక్షల కుటుంబాలకు మెరుగైన ఆదాయాన్ని అందించాయి. ఎందరో జీవితాల దిశను మార్చిన ఆమెకు ధన్యవాదాలు’ అంటూ అమెరికా ప్రభుత్వం ప్రశంసించింది.

మరిన్ని

నారీ... వ్యాయామ దారి!

ఇంట్లో పనే ఎక్సర్‌సైజు... ఒక గృహిణి అభిప్రాయం. ఆఫీసుకెళ్లొచ్చే సరికే టైం అయిపోతుంది. మళ్లీ జిమ్‌కు వెళ్లే తీరిక ఎక్కడిది? ఒక ఉద్యోగిని ఆవేదన. జిమ్‌ కెళ్లినా అక్కడ మగవాళ్లతో పాటు చేయలేం... ఇదో యువతి సమస్య... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే మార్గాలు బోలెడు ఉన్నాయంటున్నారు...జీరోసైజ్‌ లేదా సన్నగా, నాజూగ్గా ఉండాల్సిన అవసరం సినీతారలు, మోడల్స్‌కు మాత్రమే. మేమెందుకు నోరు కట్టేసుకోవాలి, కసరత్తులంటూ చెమటోడ్చాలి అనే భావన చాలా మంది మహిళల్లో ఉండేది. గృహిణులకు ఇంటిపనే సరిపోతుందిలే’ అనే అపోహ ఉండేది. ఇప్పుడు మహిళలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో జీవనశైలిలో మార్పులు వచ్చాయి.

తరువాయి

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

తరువాయి

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

తరువాయి

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని