నేతన్నల బిడ్డలు కొత్తతోవ చూపుతున్నారు!
close
Updated : 07/07/2021 13:06 IST

నేతన్నల బిడ్డలు కొత్తతోవ చూపుతున్నారు!

రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న చేనేత కళాకారుడి బిడ్డ ఆమె... పదిహేనేళ్ల వయసులో తండ్రికి దూరమైనా ఆయన కళని అందిపుచ్చుకుని శెభాష్‌ అనిపించుకుంది చందన!

పడుగు-పేకల ప్రపంచంలోనే పుట్టి ఎదిగిన హారిక నేత పని చేసే తండ్రి కలనీ సాకారం చేయాలనుకుంది.. ఈ ఇద్దరివీ వేర్వేరు కుటుంబాలే అయినా లక్ష్యం ఒక్కటే! తమ పరిధిలో నేతన్నకు సుస్థిర ఉపాధి కల్పించాలని. ఆ దారిలో వాళ్లు సాధిస్తోన్న విజయాలేంటో చూద్దాం...

న చేతుల్లో తయారవుతున్న వస్త్రం అందంగా ఉంటే చాలనుకుంటాడు కానీ.. చిక్కిశల్యమవుతున్న తన శరీరాన్ని పట్టించుకోని త్యాగం నేతన్నది. అలాంటి చేనేత కళాకారులని కొవిడ్‌ చావుదెబ్బతీసింది. దుస్తులకు గిరాకీ లేదు. అందుకే చేనేత సహకార సంఘాల్లో కోట్ల రూపాయల నిల్వలు పేరుకుపోయాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 45 సహకార సంఘాలకుగాను 36 క్రియాశీలకంగా ఉండేవి. అవీ రెండేళ్లుగా చురుగ్గా లేవు. వీటన్నింట్లో అగ్రగామి కొయ్యలగూడెం చేనేత సహకార సంఘం సైతం తీవ్రమైన ఒడుదొడుకులకు లోనైంది. ఆ ప్రాంతం నుంచి వచ్చిన అమ్మాయిలే చందన, హారికలు. హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారికి ఆనుకుని ఉండే కొయ్యలగూడెం చేనేత కళాకారులకు నిలయం. ‘కోయ్స్‌ ఇక్కత్‌’ అని పిలుచుకొనే ఇక్కడి నూలు వస్త్రాలది ప్రపంచఖ్యాతి. అమెరికా అధ్యక్ష భవనం అలంకరణలో భాగమవుతున్నాయంటేనే వాటి ప్రత్యేకత అర్థమవుతుంది. ప్రస్తుత గడ్డు పరిస్థితుల నుంచి నేతన్నలను గట్టెక్కించాలనుకున్నారు 18 ఏళ్ల వయసున్న చందన, హారికలు. తాము ఉపాధి పొందుతూ మరికొందరికీ దారి చూపాలన్న తపనతో ఆన్‌లైన్‌ అమ్మకాలకు శ్రీకారం చుట్టారు. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికలుగా దేశవిదేశాలకు వస్త్రాలను సరఫరా చేస్తున్నారు. కరోనా కష్టకాలంలోనూ 50 మగ్గాలకు పని కల్పిస్తున్నారు.

విషాదం నుంచి విజయం దాకా... కొయ్యలగూడెం సహకార సంఘంలో 580 మంది సభ్యులున్నారు. వీళ్లు కాక మరెన్నో కుటుంబాలు నేత వస్త్రాలపై ఆధారపడ్డాయి. డబుల్‌ ఇక్కత్‌ నమూనా రూపొందించి 2014లో జాతీయ హస్తకళల పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న కళాకారుడు ఇడెం శ్రీనాథ్‌. ఆయన కుమార్తే చందన. పనిలో చిన్నప్పట్నుంచీ అమ్మానాన్నలకు చేదోడు వాదోడుగా నిలిచిన ఆమె తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంది. శ్రీనాథ్‌ కళానైపుణ్యాన్ని చూసి మురిసిపోవడానికి ఆయన ఇంటికి ఎంతో మంది విదేశీయులు వస్తుండేవారు. దురదృష్టం. ఆయన 2018లో కేన్సర్‌తో మరణించారు. అప్పటికి చందనకు 15 ఏళ్లు. తమ్ముడు తనకన్నా ఏడేళ్ల చిన్నవాడు. కుటుంబానికి తనే అండగా నిలబడాలని చదువుకుంటూనే నేత పనిచేసేది. తండ్రి స్ఫూర్తితో శ్రీనాథ్‌ ఫ్యాబ్రిక్స్‌ పేరిట వస్త్రవ్యాపారాన్ని నడుపుతోంది. హైదరాబాద్‌, బెంగళూరు, దిల్లీలలో జాతీయ స్థాయి మేళాల్లో పాల్గొని కొయ్యలగూడెం నేతన్నల పనితీరును కళ్లకు కట్టింది. ఫర్వాలేదు అనుకొనే సమయానికి కరోనాతో అమ్మకాలు లేక పరిస్థితి మొదటికొచ్చింది. అయినా కుంగిపోకుండా ఆన్‌లైన్‌ వ్యాపారాన్ని ప్రారంభించి నెలకి లక్షన్నర రూపాయలకు పైగా ఆర్జిస్తోంది. మరెన్నో కుటుంబాలకూ అండగా నిలబడుతోంది.

తండ్రి, తాతల వారసత్వాన్ని సొంతం చేసుకున్న వడ్డేపల్లి హారిక సైతం ఆన్‌లైన్‌ వ్యాపారంతో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపింది. వినూత్న డిజైన్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. సివిల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా కోసం రెండేళ్ల క్రితం కళాశాలలో చేరినా చదువు ఆగిపోయింది. కుటుంబ ఇబ్బందుల్ని గమనించి ఇంట్లో ఖాళీగా ఉండకుండా... సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని అమ్మకాలకు శ్రీకారం చుట్టింది. ‘ఇక్కతైమ్‌’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా ప్రారంభించి ప్రత్యేక డిజైన్లు నేయించడం మొదలుపెట్టింది. వాటికి మిర్రర్‌ వర్క్‌, ఎంబ్రాయిడరీ చేయిస్తోంది. చీరతోపాటు బ్లవుజులూ అందిస్తూ వాటికి ప్రముఖ మోడల్స్‌తో ప్రచారం చేయిస్తోంది. ఆన్‌లైన్‌ వేదికగా చేసిన వినూత్న ప్రయోగానికి వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. కంబోడియా, ఉజ్బెకిస్థాన్‌ దేశాల సంప్రదాయ వస్త్రాలకు మన ఇక్కత్‌ సొగసులు జోడించి నూతన రీతిలో మగ్గాలపై నేయిస్తోంది. అలా ఆన్‌లైన్‌ ద్వారా నెలకు లక్షల రూపాయల వ్యాపారం నిర్వహిస్తోంది హారిక. సొంతంగా 10 మగ్గాలు నడిపించడంతోపాటు ఇతర చేనేత కార్మికులు నేసిన చీరల్నీ అమ్మిపెడుతోంది. ఒకప్పుడు హారిక తన తండ్రి మహేశ్వరం, తల్లి మాధవి వెంట దిల్లీహాట్‌, సూరజ్‌ కుండ్‌, పుణె, బెంగళూరు, కోల్‌కతాల్లో జాతీయ, అంతర్జాతీయ మేళాల్లో పాల్గొంది. 2019 దిల్లీ మేళాలో సోనియాగాంధీ వీరి స్టాల్‌ను సందర్శించి హారికతో మాట్లాడి ప్రత్యేకంగా అభినందించారు.

ఇద్దరూ ఇద్దరే.. చీరలు, డ్రెస్‌ మెటీరియల్స్‌, దుపట్టాలు, బెడ్‌ షీట్లను వినూత్న డిజైన్లతో నేయించి, ఫొటోలు తీసి వాటి ప్రత్యేకతలు, ధరల వివరాలను అప్‌లోడ్‌ చేస్తున్నారీ ఇద్దరు అమ్మాయిలు. చేనేత కళను మరింతగా అభివృద్ధి చేసేలా, మగ్గాలు ఆగకుండా కార్మికులందరికీ పని దొరికేలా చేయడమే తమ లక్ష్యమంటున్నారు.

- ఇల్లెందుల జయప్రకాశ్‌, ఈటీవీ, నల్గొండ

- సూరెపల్లి రఘుపతి, చౌటుప్పల్‌

మంచిమాట

స్వేచ్ఛా సమానత్వాల కోసం ఊహాగానాలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. పురుషులతో పోటీపడుతూ మనమే ముందుకు దూసుకెళ్లాలి.

- బార్బరా ఎరెన్‌రైక్‌, రచయిత్రి, సామాజికవేత్త

మరిన్ని

నారీ... వ్యాయామ దారి!

ఇంట్లో పనే ఎక్సర్‌సైజు... ఒక గృహిణి అభిప్రాయం. ఆఫీసుకెళ్లొచ్చే సరికే టైం అయిపోతుంది. మళ్లీ జిమ్‌కు వెళ్లే తీరిక ఎక్కడిది? ఒక ఉద్యోగిని ఆవేదన. జిమ్‌ కెళ్లినా అక్కడ మగవాళ్లతో పాటు చేయలేం... ఇదో యువతి సమస్య... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే మార్గాలు బోలెడు ఉన్నాయంటున్నారు...జీరోసైజ్‌ లేదా సన్నగా, నాజూగ్గా ఉండాల్సిన అవసరం సినీతారలు, మోడల్స్‌కు మాత్రమే. మేమెందుకు నోరు కట్టేసుకోవాలి, కసరత్తులంటూ చెమటోడ్చాలి అనే భావన చాలా మంది మహిళల్లో ఉండేది. గృహిణులకు ఇంటిపనే సరిపోతుందిలే’ అనే అపోహ ఉండేది. ఇప్పుడు మహిళలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో జీవనశైలిలో మార్పులు వచ్చాయి.

తరువాయి

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

తరువాయి

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

తరువాయి

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని