కన్నీటి కథను తిరగరాసి... ఒలింపిక్స్‌కు!
close
Published : 08/07/2021 00:36 IST

కన్నీటి కథను తిరగరాసి... ఒలింపిక్స్‌కు!

కష్టాలు, కన్నీళ్లు వాళ్లని వెనక్కిలాగాలనుకుంటే...  పట్టుదల ముందుకు నడిపించింది. మేకలు కాసే తల్లి కలని నిజం చేసేందుకు ఒకరు.. అమ్మానాన్న లేకున్నా అవ్వ దగ్గర పెరిగి మరొకరు..  సాధించగలవని వెన్ను తట్టిన తాత కలలు నెరవేర్చేందుకు ఇంకొకరు... ఆటల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు... టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించిన పేదబిడ్డల స్ఫూర్తి కథనాలివీ...

ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంబరమైన ఒలింపిక్‌ పోటీల్లో 4 X 400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలే పరుగు పందెంలో పాల్గొనేందుకు తమిళనాడు నుంచి ముగ్గురమ్మాయిలు అర్హత సాధించారు.

వారిలో ఒకరు తిరుచ్చికి చెందిన ధనలక్ష్మి. కాళ్లలో చక్రాలున్నట్టుగా పరుగులు పెట్టే ఆమెని తండ్రి పరుగులో ప్రోత్సహించాడు. ఏడేళ్ల క్రితం ఆయన మరణించడంతో ఆ కుటుంబాన్ని కష్టాలు చుట్టుముట్టాయి. అప్పట్నుంచీ తల్లే ఆమెకు అండా దండా. ఆవులు, మేకలు పెంచగా వచ్చిన డబ్బుతో అవసరమైన షూస్‌ వంటివి కొనిచ్చింది. ఉన్న కొద్దిపాటి బంగారు నగలనీ కుదువపెట్టింది. ధనలక్ష్మితో పాటు ఆమె ఇద్దరు చెల్లెళ్లనీ చదివిస్తోంది. ఆ తల్లి కష్టం వృథా పోలేదు. పరుగుల రాణి పీˆటీ ఉష రికార్డునే బద్దలుకొట్టింది ధన. ఉష 200 మీటర్ల దూరాన్ని 23.30 సెకన్లలో పూర్తి చేస్తే ఈమె ఆ దూరాన్ని 23.26 సెకన్లలోనే దాటేసింది. ద్యుతిచంద్‌, హిమదాస్‌ వంటి హేమాహేమీలను వెనక్కు నెట్టింది. తాజాగా జరిగిన జాతీయ స్థాయి పరుగు పందెంలో 100 మీటర్లను 11.38 సెకన్లలో పూర్తిచేసి బంగారు పతకాన్ని సాధించింది. అమ్మాయిలు టీషర్ట్‌ వేసుకుంటే నోళ్లు నొక్కుకొనే ఊర్లో... ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా అమ్మ ఇచ్చిన ధైర్యంతో ఎదిగి ఇప్పుడు రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచింది.

మధురై నుంచి టోక్యో వరకు

కాళ్లు బొబ్బలెక్కుతున్నా... ఒట్టి కాళ్లతోనే సాధన చేసింది మధురైకి చెందిన 22ఏళ్ల రేవతి వీరమణి. చిన్నతనంలోనే అమ్మానాన్నలను కోల్పోతే.. అవ్వ చేరదీసి పెంచింది. రెండో తరగతి నుంచి ప్లస్‌టూ వరకు హాస్టల్‌లో ఉండి చదువుకొన్న రేవతికి పరుగంటే అమితాసక్తి. ప్లస్‌టూలో 100 మీటర్ల పోటీలో కాళ్లకు షూ కూడా లేకుండా పరుగెత్తి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అది చూసిన కన్నన్‌ అనే శిక్షకుడు మెరుగైన శిక్షణ అందించాడు. పొయ్యి వూదుకొనే ఆడాళ్లకు చదువే ఎక్కువ. మళ్లీ ఆటలు కూడానా? అన్న హేళనలు రేవతిలో పట్టుదలను పెంచాయి... అద్భుతాలు చేయించాయి. అవ్వ, శిక్షకులు అందించిన ప్రోత్సాహం జాతీయ, ప్రపంచ స్థాయి పోటీల్లో పరుగెత్తి చరిత్ర సృష్టించేలా చేశాయి. ఈ క్రమంలో వెన్నెముకకు గాయం తగిలినా... ఆ బాధ నుంచి కోలుకుని కొద్ది రోజుల్లోనే ఒలింపిక్స్‌ అర్హత పోటీల్లో పాల్గొంది రేవతి. ఈమె ప్రస్తుతం దక్షిణ మధ్యరైల్వే మధురై డివిజన్‌లో కమర్షియల్‌ క్లర్క్‌ కమ్‌ టీసీ. టోక్యో ఒలింపిక్స్‌కు భారత్‌ తరపున క్రీడాకారులను ఎంపిక చేసేందుకు పాటియాలాలో అర్హత పోటీలు నిర్వహించారు. ఇందులో మిశ్రమ రిలే పరుగులో 400 మీటర్ల లక్ష్యాన్ని 53.55సెకన్లలో చేరుకుని రేవతి వీరమణి రికార్డు సృష్టించింది.


తాతయ్య ప్రోత్సాహంతో....

తిరుచ్చి జిల్లా తిరువెరుంబూర్‌ అనే కుగ్రామం శుభా వెంకటేశన్‌ది. తండ్రి భవన నిర్మాణ కూలీ. చిన్నతనంలోనే ఆమె ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాడు వాళ్ల తాతయ్య సంగిలిముత్తు. పాఠశాలలో పీˆఈటీ ఉపాధ్యాయుడు సెల్వరాజ్‌ కఠోర శిక్షణ ఇచ్చాడు. కానీ తన విజయాలను చూడకుండానే తాతయ్య చనిపోయాడు. అప్పటి నుంచి శుభకు వాళ్ల అమ్మ పూంగొడి అండగా నిలిచింది. 2012లో చెన్నైలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో స్థానం సాధించిన శుభ ఆ తరువాత వెనుదిరిగి చూడలేదు. 21 ఏళ్ల శుభ జాతీయ స్థాయిలో 20, అంతర్జాతీయ స్థాయిలో మూడు పతకాలను సాధించింది. ఆటల కోసం ఆడపిల్లను హాస్టల్లో ఉంచాలా అన్న బంధువులు, చుట్టు పక్కల వారి విమర్శలను పట్టించుకోకుండా నా కుటుంబం అండగా నిలవడం వల్లే ఇదంతా సాధించగలుగుతున్నా అని సంతోషంగా చెబుతోంది శుభ.

సరస్వతుల శివకుమార్‌, చెన్నై


మంచిమాట

భయమే అసలైన జైలు. స్వేచ్ఛ పొందడం అంటే భయం నుంచి బయటపడటం.

- ఆంగ్‌సాన్‌ సూకీ


మరిన్ని

నారీ... వ్యాయామ దారి!

ఇంట్లో పనే ఎక్సర్‌సైజు... ఒక గృహిణి అభిప్రాయం. ఆఫీసుకెళ్లొచ్చే సరికే టైం అయిపోతుంది. మళ్లీ జిమ్‌కు వెళ్లే తీరిక ఎక్కడిది? ఒక ఉద్యోగిని ఆవేదన. జిమ్‌ కెళ్లినా అక్కడ మగవాళ్లతో పాటు చేయలేం... ఇదో యువతి సమస్య... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే మార్గాలు బోలెడు ఉన్నాయంటున్నారు...జీరోసైజ్‌ లేదా సన్నగా, నాజూగ్గా ఉండాల్సిన అవసరం సినీతారలు, మోడల్స్‌కు మాత్రమే. మేమెందుకు నోరు కట్టేసుకోవాలి, కసరత్తులంటూ చెమటోడ్చాలి అనే భావన చాలా మంది మహిళల్లో ఉండేది. గృహిణులకు ఇంటిపనే సరిపోతుందిలే’ అనే అపోహ ఉండేది. ఇప్పుడు మహిళలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో జీవనశైలిలో మార్పులు వచ్చాయి.

తరువాయి

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

తరువాయి

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

తరువాయి

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని