సేవే ఆమెకు సాంత్వన...
close
Published : 10/07/2021 00:48 IST

సేవే ఆమెకు సాంత్వన...

ఓ ప్రమాదంలో అన్నని కోల్పోయింది. అతను పోయినా తన ఆశయాన్ని మాత్రం బతికించాలనుకుంది. అందుకోసం స్వచ్ఛంద సంస్థని నెలకొల్పింది. నాన్నకి పక్షవాతం, ఆపై అమ్మ మరణం... వరుసగా ఆమె మనోధైర్యాన్ని దెబ్బతీశాయి. అయినా తట్టుకుని నిలబడి ముందుకు సాగుతోంది. ఆమే శ్వేతా మషివల్‌. ఆమె సేవా ప్రయాణమిది.

శ్వేత చరిత్రలో డిగ్రీతోపాటు మీడియా మేనేజ్‌మెంట్‌నూ పూర్తిచేసింది. ముంబయిలో కమర్షియల్‌ ఫిల్మ్‌ మేకింగ్‌, అడ్వర్టైజ్‌మెంట్లు తీసేది. మంచి జీతం, నచ్చిన కొలువు.. ఆమె ఆనందానికి అవధుల్లేవు. 2011 ఫిబ్రవరిలో ఒకరోజు అకస్మాత్తుగా తన అన్న సుదీప్‌ ప్రమాదంలో చనిపోయాడు. దాంతో అమ్మా నాన్నలు కుంగిపోయారు. అది చూసి శ్వేత తట్టుకోలేక పోయింది. వాళ్లిద్దరినీ చూసుకుంటూ కొద్దిరోజులు గడిపింది. సోదరుడి కోసం ఏదైనా చేయాలనుకుంది.  
శ్వేతది ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌ దగ్గర రామ్‌నగర్‌. అక్కడ చాలా గ్రామాలు కొండ ప్రాంతాల్లో ఉంటాయి. ‘మన వాళ్లకు విద్య, వైద్య అవసరాలు అందించాలి’ అని సుదీప్‌ ఎప్పుడూ అనే మాటలు గుర్తొచ్చాయి. ఆ ఆశయ సాధన కోసం జులై 2011లో ‘వత్సల్‌ ఫౌండేషన్‌’ను ఏర్పాటు చేసింది. గ్రామాల్లో హెల్త్‌ క్యాంప్‌లను నిర్వహించాలనుకుంది. కానీ అక్కడ వరదలొచ్చాయి. దాన్ని పక్కనపెట్టి ఏనుగుల సాయంతో అక్కడి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వారికి ఆరోగ్య పరీక్షలను నిర్వహించి, అవసరార్థులకు వైద్య సాయం అందించింది. అలా ఏడాదిలో 12 క్యాంప్‌లను నిర్వహించింది. స్థానికంగా కొందరు ఆమె చేసేవాటిని అడ్డుకోవడం మొదలుపెట్టారు. కానీ అవేమీ పట్టించుకోలేదు. అక్కడే వసతులు సరిగాలేని  స్కూళ్లను దత్తత తీసుకునేది. ఫర్నిచర్‌, టాయ్‌లెట్లు, పుస్తకాలు, యూనిఫాంలు, వాటర్‌ ఫిల్టర్‌, స్పోర్ట్స్‌ కిట్‌లు వంటివి సమకూర్చేది. అలా ఇప్పటి వరకూ పదుల కొద్దీ పాఠశాలలను అభివృద్ధి చేసింది. కొన్నింటిలో లైబ్రరీలనూ నెలకొల్పింది. పేద విద్యార్థులకు ఉపకారవేతనాలనూ అందిస్తోంది.

తరువాత శ్వేత తండ్రికి పక్షవాతం వచ్చింది. చాలా క్లిష్టమైన సర్జరీ తర్వాత ప్రాణం నిలిచింది. ఇంతలో తల్లికి క్యాన్సర్‌ అని తేలింది. ఆమెను బతికించడం వైద్యులకు సాధ్యం కాలేదు. వరసగా తగులుతున్న ఈ దెబ్బలకు శ్వేత డిప్రెషన్‌కు గురైంది. కానీ తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ దాన్నుంచి బయటపడింది. అప్పట్నుంచి రోగులకు వైద్య సాయమే కాకుండా, వారిని ఆనందంగా ఉంచడంపైనా దృష్టిపెట్టింది. కరోనా సమయంలో ఆహార పదార్థాలు, సరకులు, మందులు, ఆక్సీమీటర్లు, ఆక్సిజన్‌ సిలిండర్ల సరఫరా, ఆసుపత్రుల్లో పడకల ఏర్పాటు వంటివి చేసింది. ఎయిమ్స్‌, రిషికేష్‌ వైద్యులతో ఒప్పందం చేసుకుని టెలిమెడిసిన్‌ అందించింది. వేరే ప్రాంతాల్లో ఇరుక్కుపోయిన 12,000 మంది వలస కూలీలు ఉత్తరాఖండ్‌కు తిరిగి వచ్చేలా సాయమందించింది. శ్వేత.. పిల్లలు, మహిళలపై హింసకు వ్యతిరేకంగానూ పనిచేస్తోంది. ముంబయిలో ఉద్యోగం చేస్తూనే సేవా కార్యక్రమాలూ చూసుకుంటున్న శ్వేత జీవితం స్ఫూర్తిదాయకం కదూ!

మరిన్ని

నారీ... వ్యాయామ దారి!

ఇంట్లో పనే ఎక్సర్‌సైజు... ఒక గృహిణి అభిప్రాయం. ఆఫీసుకెళ్లొచ్చే సరికే టైం అయిపోతుంది. మళ్లీ జిమ్‌కు వెళ్లే తీరిక ఎక్కడిది? ఒక ఉద్యోగిని ఆవేదన. జిమ్‌ కెళ్లినా అక్కడ మగవాళ్లతో పాటు చేయలేం... ఇదో యువతి సమస్య... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే మార్గాలు బోలెడు ఉన్నాయంటున్నారు...జీరోసైజ్‌ లేదా సన్నగా, నాజూగ్గా ఉండాల్సిన అవసరం సినీతారలు, మోడల్స్‌కు మాత్రమే. మేమెందుకు నోరు కట్టేసుకోవాలి, కసరత్తులంటూ చెమటోడ్చాలి అనే భావన చాలా మంది మహిళల్లో ఉండేది. గృహిణులకు ఇంటిపనే సరిపోతుందిలే’ అనే అపోహ ఉండేది. ఇప్పుడు మహిళలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో జీవనశైలిలో మార్పులు వచ్చాయి.

తరువాయి

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

తరువాయి

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

తరువాయి

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని