డ్రైఫ్రూట్స్‌తో... కోట్లు సంపాదిస్తోంది!
close
Published : 12/07/2021 01:45 IST

డ్రైఫ్రూట్స్‌తో... కోట్లు సంపాదిస్తోంది!

‘జీవితం ఎప్పుడూ సవాళ్లను విసురుతూనే ఉంటుంది. వాటిని ఎదుర్కొని నిలిస్తేనే విజేతలుగా నిలబడతాం’ అంటోంది చిత్ర. ఉన్నతోద్యోగాన్ని వదిలేసి వ్యాపారంలో అడుగుపెట్టింది. మొదటి అడుగే తడబడినా... బెదిరిపోలేదు. ఆలోచించి అవకాశాల్ని సృష్టించుకుంది. ఆపైనా తన లక్ష్యానికి అవాంతరాలు ఎదురైనా...కుంగిపోలేదు. ప్రతి వైఫల్యాన్నీ... విజయానికి సోపానాలుగా మార్చుకుంది. అనుకున్నది సాధించింది.   డ్రైఫ్రూట్స్‌ వ్యాపారంతో కోట్ల రూపాయల టర్నోవర్‌ని అందుకుంటూ, వందమందికి ఉపాధిని కూడా కల్పిస్తోంది ఈ హైదరాబాదీ.

ధ్యతరగతి కుటుంబంలో పుట్టిపెరిగింది చిత్ర. ఎంటెక్‌ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్నప్పుడే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ వ్యోమ్‌వ్యాస్‌తో పెళ్లయ్యిందామెకు. ఆ వెంటనే ఓ ప్రముఖ సంస్థలో లక్షల రూపాయాల ప్యాకేజీతో ఉద్యోగాన్ని సంపాదించుకుంది. చిత్ర అత్తింటివారంతా వ్యాపారంలో ఉండటంతో తానూ అందులో భాగం అవ్వాలనుకుని ఆ జాబ్‌కి రాజీనామా చేసింది. కొన్నాళ్లకే అందులో మెలకువలు ఒంటపట్టించుకుంది. మార్కెటింగ్‌పై పట్టు తెచ్చుకుంది. ఆపై అంటే...2011లో ఎలక్ట్రానిక్‌ వస్తువులను విక్రయించేందుకు సొంతంగా ‘షాపింగ్‌ వాపింగ్‌.ఇన్‌’ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.

కొత్త ఆలోచనతో...
మొదట్లో ఈ వ్యాపారం అనుకున్నంత లాభసాటి కాలేదు. అలాగని తానేమీ నిరాశపడలేదు. వినియోగదారుల్ని ఆకట్టుకోవడానికి ఇంకేం దారులున్నాయో ఆలోచించింది. అందులోనే ఫ్యాన్సీ జ్యూయలరీ, హ్యాండీక్రాఫ్ట్స్‌లనూ  కలిపి అమ్మడం మొదలుపెట్టింది. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ల్లోనూ ఈ సైట్‌ద్వారా అమ్మకాలు సాగించింది. మొదట్లో 10 నుంచి 15 ఆర్డర్లు వచ్చేవి. ఏడాదికే ఈ సంఖ్య 100కు పెరిగింది. ఆపై ప్రముఖ బ్రాండ్లైన రిలాక్సో, ఖాదిమ్‌, లోటో, బాటా, స్పార్క్స్‌, లిబర్టీ వంటి మరికొన్ని బ్రాండెడ్‌ షూలను జత చేసింది చిత్ర. ఊహించినట్లుగానే ఆర్డర్లు వెల్లువెత్తాయి. ఒక సమయంలో రోజుకి 1500కు పైగానే ఆర్డర్లు అందుకునేది. క్రమంగా సంస్థ లాభాల బాట పట్టింది.

అవసరాన్ని గుర్తించి...
వ్యాపారం లాభదాయకంగా ఉన్న సమయంలో కొవిడ్‌ దేశాన్ని తాకింది. లాక్‌డౌన్‌తో అన్నీ స్తంభించిపోయాయి. అలాంటి సమయంలో ఫ్యాషన్‌ సంబంధిత వస్తువులు కొనేవారి సంఖ్య తగ్గడాన్ని గమనించా. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించా అంటోంది చిత్ర ‘మార్కెట్‌లో నిలబడాలంటే వాస్తవ పరిస్థితులని అర్థం చేసుకోవాలి. నా వ్యాపారం దెబ్బతింది. అయినా వెనకడుగు వేయాలనుకోలేదు. మరోదారికోసం వెతికా. అప్పుడు నాకొచ్చిన ఆలోచనే డ్రైఫ్రూట్స్‌ అమ్మకం. కరోనా కట్టడికి అవసరమైన వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడానికి వీటి అవసరం ఎంతో అని అర్థమైంది. ఇవన్నీ గమనించాక డ్రైఫ్రూట్స్‌ విక్రయాలు ప్రారంభించాలనే ఆలోచనను ఇంట్లో చెప్పా. వారు నాపై పూర్తి నమ్మకం ఉంచారు. అయితే ఈసారి వెంటనే ఆ పని మొదలుపెట్టేయలేదు. ముందు ఇవి ఏయే ప్రాంతాల్లో పండుతాయి,  నాణ్యమైన రకాలు ఎక్కడ దొరుకుతాయనే విషయంపై ఓ చిన్నపాటి అధ్యయనమే చేశా. ఆయా ప్రాంతాలవారితో మాట్లాడా, కొందరిని వెళ్లి కలిశా. ఇందుకు రెండుమూడు నెలలు పట్టింది. తర్వాత ‘సాఫ్ట్‌ ఆర్ట్‌’ పేరుతో డ్రైఫ్రూట్స్‌ అమ్మకానికో వెబ్‌సైట్‌ను ప్రారంభించా. నాణ్యత, సమయపాలన పాటిస్తే...చాలు ఖాతాదారులకు నమ్మకం కలిగించినట్లే. ఇందుకోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటా. మహారాష్ట్ర నుంచి కిస్‌మిస్‌, పలాస నుంచి జీడిపప్పు ఇలా...కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ వివిధ ప్రాంతాల రైతులు, వ్యాపారుల దగ్గర నుంచి, విదేశాల నుంచి దిగుమతి అయ్యేవాటిని ముంబయి వ్యాపారుల నుంచి తెప్పిస్తాం. వాటి నాణ్యతను పరిశీలించి ప్యాక్‌ చేయిస్తా.  ఈ ప్యాకింగ్‌ అంతా మాన్యువల్‌గానే చేసేవాళ్లం. ఆ తర్వాత ఆర్డర్లు పెరిగేకొద్దీ మిషన్లను కొనుగోలు చేశా. ఇప్పుడు దాదాపు వందమందికి ఉపాధినిస్తున్నాం. పాతికమంది రైతులు, పదుల సంఖ్యలో వ్యాపారులతో కలిసి పనిచేస్తున్నాం. ప్రస్తుతం మా దగ్గర 32 రకాల డ్రైఫ్రూట్స్‌, నట్స్‌, సీడ్స్‌, 15 రకాల స్నాక్స్‌ అందుబాటులో ఉన్నాయి’ అంటోందామె.


వ్యాపారమన్నాక లాభనష్టాలు సహజమే కానీ...కరోనాతో భిన్నమైన ఇబ్బందులెన్నో ఎదుర్కొన్నా లాక్‌డౌన్‌తో రవాణా ఇక్కట్లు, సిబ్బంది కొరత వేధించేది. ఓసారైతే నేనొక్కదాన్నే వరుసగా మూడు రోజులపాటు నిద్రాహారాలు లేకుండా ప్యాకింగ్‌ చేశా.  మొదట్లో రోజుకి 180 ఆర్డర్లు వచ్చేవి. ఇప్పుడు దేశవ్యాప్తంగా రోజుకి 500 ఆర్డర్లు అందించగలుగుతున్నాం. నెలకు 15వేల ఆర్డర్లు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే విదేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. తక్కువ సమయంలోనే కోట్ల రూపాయల టర్నోవర్‌ని అందుకోగలుగుతున్నా.


ఓ మహిళగా మీ కలలు, సామర్థ్యాలను మీరు విశ్వసించగలిగితే...అది మీలో శక్తిని నింపుతుంది.  
సాక్షి మాలిక్‌, రెజ్లింగ్‌ క్రీడాకారిణి

మరిన్ని

నారీ... వ్యాయామ దారి!

ఇంట్లో పనే ఎక్సర్‌సైజు... ఒక గృహిణి అభిప్రాయం. ఆఫీసుకెళ్లొచ్చే సరికే టైం అయిపోతుంది. మళ్లీ జిమ్‌కు వెళ్లే తీరిక ఎక్కడిది? ఒక ఉద్యోగిని ఆవేదన. జిమ్‌ కెళ్లినా అక్కడ మగవాళ్లతో పాటు చేయలేం... ఇదో యువతి సమస్య... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే మార్గాలు బోలెడు ఉన్నాయంటున్నారు...జీరోసైజ్‌ లేదా సన్నగా, నాజూగ్గా ఉండాల్సిన అవసరం సినీతారలు, మోడల్స్‌కు మాత్రమే. మేమెందుకు నోరు కట్టేసుకోవాలి, కసరత్తులంటూ చెమటోడ్చాలి అనే భావన చాలా మంది మహిళల్లో ఉండేది. గృహిణులకు ఇంటిపనే సరిపోతుందిలే’ అనే అపోహ ఉండేది. ఇప్పుడు మహిళలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో జీవనశైలిలో మార్పులు వచ్చాయి.

తరువాయి

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

తరువాయి

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

తరువాయి

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని