నష్టాల సంస్థను వేలకోట్లకు చేర్చింది!
close
Published : 16/07/2021 02:00 IST

నష్టాల సంస్థను వేలకోట్లకు చేర్చింది!

వీడియో అనగానే గుర్తొచ్చేది యూట్యూబ్‌. అంతలా ప్రజల మనసుల్లో తిష్ఠ వేసిందిది. దానికి పోటీగా ప్రారంభమైంది విమియో. కానీ మొదలై పన్నెండేళ్లయినా ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. పైగా నష్టాల దిశగా వెళ్లి సంస్థ మనుగడకే ముప్పొచ్చే పరిస్థితి ఏర్పడింది. ఆ స్థితిలో ఉన్న సంస్థను 4480 కోట్ల రూపాయల వార్షికాదాయం తెచ్చే స్థాయికి చేర్చిందో అమ్మాయి. ఆమే అంజలీ సూద్‌. నాలుగేళ్లలో ఆమెకిదెలా సాధ్యమైందో తెలుసుకుందామా!

అంజలి సూద్‌ అమ్మానాన్నలది పంజాబ్‌. ఈమె పుట్టకముందే వాళ్ల కుటుంబం మిషిగన్‌లో స్థిరపడింది. బీఎస్సీ ఫైనాన్స్‌, మేనేజ్‌మెంట్‌లో చదివింది. అమెజాన్‌, టైమ్‌ వార్నర్‌ వంటి సంస్థల్లో పనిచేసింది. పోటీ ప్రపంచంలో నైపుణ్యాలను పెంచుకునేందుకు 2011లో హార్వర్డ్‌ నుంచి ఎంబీఏ చేసింది. 2014లో ‘విమియో’లో మార్కెటింగ్‌ డైరెక్టర్‌గా చేరింది. ఇదో వీడియో ఆధారిత సంస్థ. ఐఏసీ అనే బహుళ జాతి సంస్థ నిర్వహించే అనేక సంస్థల్లో ఒకటి. అప్పటికి విమియో ప్రారంభించి పన్నెండేళ్లు. పోటీయేమో యూట్యూబ్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటి దిగ్గజాలతో. ‘వెబ్‌సైట్‌ కోసం పెద్దమొత్తంలో వీడియోల సేకరణ, రూపకల్పన జరుగుతోంది. దీనికి వందల కోట్లు ఖర్చుపెట్టినా పోటీ ఇవ్వలేక పోతున్నాం. కాస్త వినోదం కావాలనుకునే వారి తొలి ఎంపిక యూట్యూబే అవుతోంది. ఒక అలవాటును మార్చడం సులువు కాదు’ అని అంజలి అభిప్రాయం. దాన్నే ఓ సమావేశంలో ప్రస్తావించింది. కొత్త దారిలో వెళ్దామని సలహా ఇచ్చింది. ఆ మాటలు సీఈఓ జోయ్‌ లెవెన్‌ను ఆలోచింపజేశాయి. ఏం చేస్తే బాగుంటుందో నువ్వే చెప్పు అన్నారామెను.

దశను మార్చింది...
అంజలి కొంత పరిశోధన చేసి ‘భవిష్యత్‌ టెక్నాలజీదే. కాబట్టి ఎంటర్‌టైన్‌మెంట్‌ కాకుండా ఆంత్రప్రెన్యూర్స్‌పై దృష్టి పెడదా’మంది. చిన్న సంస్థలను తక్కువ సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్‌ ప్రపంచంలోకి ఆహ్వానించాలన్నది తన ఆలోచన. అది నచ్చి ఓ చిన్న బృందాన్నిచ్చి ప్రయత్నించమన్నారు. కొద్ది రోజుల్లోనే తను విమియోను ఎంటర్‌టైన్‌మెంట్‌ నుంచి సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఎ సర్వీస్‌ సంస్థగా మలిచింది. వీడియో రూపకల్పన, పోస్టింగ్‌తో పాటు సులువుగా సోషల్‌ మీడియా, ఈమెయిల్‌ మార్కెటింగ్‌ల్లో షేర్‌ చేసుకునే వీలుండేలా చూసింది. పైగా యాడ్‌ ఫ్రీ. లైవ్‌ స్ట్రీమింగ్‌నూ జోడించడంతో వ్యాపార వర్గాల్లో ఆదరణ అనూహ్యంగా పెరిగింది. ఇంకేముంది... నాలుగు నెలల్లోనే లాభాలు మొదలయ్యాయి. దీంతో 2017లో ఆమెనే సీఈఓగా నియమించారు. 2020లో సంస్థ లాభాలు రూ.627 కోట్లకు చేరాయి. ఇప్పుడు విమియోకు 200 మిలియన్లకుపైగా సబ్‌స్క్రైబర్లున్నారు. వాళ్లలో 1.6 మిలియన్‌ పెయిడ్‌ యూజర్లు. నష్టాలతో ఉన్నదాన్ని ఈ మేలో లిస్టెడ్‌ సంస్థ హోదాకు తెచ్చింది. వార్షిక ఆదాయాన్ని రూ.4480 కోట్లకు చేర్చింది.

నిజానికి అంజలికి సాంకేతిక పరిజ్ఞానమేమీ లేదు. బృందాన్ని నడిపించడానికి వాటన్నింటి గురించీ తెలుసుకునేదట. భారత్‌లోనూ సేవలు విస్తరిస్తామంటోంది. ఓటీటీ ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్నారు. వర్చువల్‌ ఈవెంట్స్‌, వీడియో ఎడిటింగ్‌లో కృత్రిమ మేధ (ఏఐ) పైనా తను పని చేస్తోంది. తన ప్రతిభా సామర్థ్యాలను గమనించి పలు అంతర్జాతీయ సంస్థలు అత్యంత ప్రతిభాశీలురైన పిన్న వయస్కుల జాబితాలో చేర్చాయి. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం యంగ్‌ గ్లోబల్‌ లీడర్‌ పురస్కారాన్నిచ్చింది. ఫోర్బ్స్‌ ఆసియాలో ప్రభావవంతమైన మహిళగా ప్రశంసించింది. ఈమెకి రెండేళ్ల కొడుకు. భర్త పేరు మాట్‌.

అంజలి కెరియర్‌లో మొదట అన్నీ వైఫల్యాలే. బ్యాంకర్‌ కావాలన్నది ఈమె కల. కానీ ఎన్నో బ్యాంకులు తన దరఖాస్తును తిరస్కరించాయి. కానీ... అవే తన విజయానికి కారణం అయ్యాయంటుంది 37 ఏళ్ల అంజలి. కెరియర్‌లోనే కాదు.. మంచి అమ్మగానూ నిలిచినప్పుడే అసలైన విజయంగా భావిస్తానంటోంది.


‘అపజయాలను చూసి చాలామంది ఆగిపోతుంటారు. కానీ నాకు మాత్రం అవి పాఠాలుగా కనిపించేవి. ఇంకాస్త గట్టిగా ప్రయత్నించాలనిపించేది’
- అంజలి

మరిన్ని

నారీ... వ్యాయామ దారి!

ఇంట్లో పనే ఎక్సర్‌సైజు... ఒక గృహిణి అభిప్రాయం. ఆఫీసుకెళ్లొచ్చే సరికే టైం అయిపోతుంది. మళ్లీ జిమ్‌కు వెళ్లే తీరిక ఎక్కడిది? ఒక ఉద్యోగిని ఆవేదన. జిమ్‌ కెళ్లినా అక్కడ మగవాళ్లతో పాటు చేయలేం... ఇదో యువతి సమస్య... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే మార్గాలు బోలెడు ఉన్నాయంటున్నారు...జీరోసైజ్‌ లేదా సన్నగా, నాజూగ్గా ఉండాల్సిన అవసరం సినీతారలు, మోడల్స్‌కు మాత్రమే. మేమెందుకు నోరు కట్టేసుకోవాలి, కసరత్తులంటూ చెమటోడ్చాలి అనే భావన చాలా మంది మహిళల్లో ఉండేది. గృహిణులకు ఇంటిపనే సరిపోతుందిలే’ అనే అపోహ ఉండేది. ఇప్పుడు మహిళలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో జీవనశైలిలో మార్పులు వచ్చాయి.

తరువాయి

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

తరువాయి

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

తరువాయి

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని