జన్మభూమి రుణం తీర్చుకోవాలని... 37 కోట్లు ఇచ్చాం...
close
Published : 18/07/2021 00:42 IST

జన్మభూమి రుణం తీర్చుకోవాలని... 37 కోట్లు ఇచ్చాం...

జాతివివక్షని ఎదిరించేందుకు అగ్రరాజ్యంలో ఏర్పాటైన ప్రతిష్ఠాత్మక వైద్యసంఘం ‘ఆపీ’. ఇటు భారత్‌లోనూ ఎన్నో కార్యక్రమాలని నిర్వహిస్తోన్న ఈ సంఘంలో అంచెలంచెలుగా ఎదుగుతూ తొలిసారిగా ఓ తెలుగు మహిళ అధ్యక్షురాలయ్యారు. ఆమే డాక్టర్‌ అనుపమ గొట్టిమూకల... ఆమెతో వసుంధర ముచ్చటించింది...

ఆపీ అంటే అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌. భారత్‌లో ఎన్నో సేవాకార్యక్రమాలు చేపడుతున్న ఈ సంస్థ ఏర్పడటానికి కారణం జాతి వివక్షపై పోరాడేందుకు అంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. అవును... అమెరికాలో పనిచేసే మన వైద్యులు ఏ చిన్న తప్పు చేసినా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది. పదోన్నతులు త్వరగా రావు. జాతి వివక్షలో భాగంగానే ఇన్ని కఠిన నిబంధనలు. దీనిపై పోరాడేందుకే 1982లో ‘ఆపీ’ని ఏర్పాటు చేశారు. మన తెలుగు వైద్యుడు జగన్‌ కాకరాల ఈ సంఘం ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం ఇందులో 14వేల మంది జీవితకాల సభ్యులున్నారు. అమెరికాలో సుమారుగా పది లక్షల మంది వైద్యులుంటే అందులో 80,000 మంది భారతీయులే.

2013 నుంచి ఆపీలో నా ప్రయాణం మొదలయ్యింది. తోటి భారతీయుల కోసం ఏదైనా చేయాలన్న ఆశయంతో ఇందులో చేరా. మొదట లోకల్‌ చాప్టర్‌లో అధ్యక్షురాలిని. తర్వాత ప్రాంతీయ సంచాలకురాలు, ట్రెజరర్‌, కార్యదర్శి, ఉపాధ్యక్షురాలిగా... ఇలా ఒక్కో పదవిలో చేస్తూ ఇప్పుడు అధ్యక్షురాలిగా ఎన్నికయ్యా. వివక్షపై పోరాడేందుకు ఏర్పడిన మా సంస్థ ప్రస్తుతం సేవా కార్యక్రమాలపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. భారతదేశ వ్యాప్తంగా 17 క్లినిక్‌లను ఏర్పాటు చేశాం. ఒక్కోదానికీ 5  నుంచి 10 వేల డాలర్ల సాయం అందిస్తున్నాం. తెలంగాణలోని జగిత్యాలలోనూ ఒక క్లినిక్‌ ఏర్పాటు చేశాం. వీటి ద్వారా ఏటా 10 లక్షల మందికి ఉచిత వైద్యం అందిస్తున్నాం.

కోట్ల రూపాయలిచ్చాం...

ఆపీ వేదికగా తరచూ విరాళాల సేకరిస్తుంటాం. కొవిడ్‌ సంక్షోభంలో... పుట్టిన గడ్డకు అండగా నిలవాలని రూ. 37 కోట్లను ఇక్కడ ఆసుపత్రులకు విరాళంగా అందించాం. 2,270 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, వంద వరకు వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ ఫ్లో మీటర్ల వంటివి అందజేశాం. వీటిలో తెలుగు రాష్ట్రాల్లోని ఆరు ఆసుపత్రులు ఉన్నాయి. ఇంతేకాకుండా 400 మంది ఆపీ వైద్యులతో భారత్‌లోని రోగులకు టెలీ హెల్త్‌ సేవల్ని కూడా అందించాం. మాకు కొవిడ్‌ నేర్పిన పాఠాల్ని భారతీయ వైద్య మండలి (ఐఎంఏ) సహకారంతో జూమ్‌ వెబినార్లు నిర్వహించి.... ఇండియాలోని వైద్యులతో పంచుకున్నాం. అమెరికాలో సీపీఆర్‌ (గుండె పోటుతో అకస్మాత్తుగా కుప్పకూలితే చేతులతో ఛాతిపై మర్దన చేసే వైద్య ప్రక్రియ)కు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అక్కడ సామాన్య ప్రజలు కూడా సీపీఆర్‌ నేర్చుకుంటారు. ఈ విధానం భారత్‌లో రావాలనే లక్ష్యంతో అన్ని వైద్య కళాశాలల్లో విద్యార్థులకు, నర్సులకు సీపీఆర్‌ నేర్పించి సర్టిఫికెట్ ఇచ్చేలా చొరవ తీసుకున్నాం. ఉత్తరప్రదేశ్‌లో అయిదు గ్రామాల్లో ‘వాటర్‌ ప్యూరిఫికేషన్‌ ప్రాజెక్టు’ కింద తాగునీటి ప్లాంట్లను అందించాము. హైదరాబాద్‌లోని ‘నిత్యసేవా’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా కార్యక్రమాలు చేస్తున్నాం. ఏటా హైదరాబాద్‌లో ‘గ్లోబల్‌ హెల్త్‌ సమ్మిట్’ నిర్వహిస్తున్నాం.

వైద్యురాలిగా చికిత్సలు చేస్తూనే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం కొంత కష్టమే. మధ్యాహ్నం వరకు వైద్య విధులు, తర్వాత ఆపీ కార్యకలాపాలు చూసుకుంటాను. మా ప్రధాన కార్యాలయం షికాగోలో ఉంది. ఆపీ అధ్యక్షురాలిగా నా ముందు అనేక లక్ష్యాలు ఉన్నాయి. ముఖ్యంగా భారత్‌లో వంద గ్రామాలను ఎంపిక చేసి ఒక్కో ఊళ్లో కనీసం వెయ్యి మందికి ఉచిత వైద్య పరీక్షలు చేయాలనుకుంటున్నాం. దీన్ని విజయవంతం చేయాలి. ఇలా నా మాతృదేశపు రుణాన్ని కొంతైనా తీర్చుకోవాలనుకుంటున్నా.


నేను పుట్టి పెరిగింది వరంగల్‌లోని హన్మకొండలో. నాన్న మోహన్‌రెడ్డి ఆర్‌ఈసీలో ప్రొఫెసర్‌గా చేసేవారు. అమ్మ ప్రమీల. మేం ఇద్దరం అక్కాచెల్లెళ్లం. 1983లో కాకతీయ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటొచ్చింది. ఉస్మానియా వైద్య కళాశాలలో అనస్థీషియాలో పీజీ చేశాను. అప్పుడు నీలోఫర్‌ ఆసుపత్రిలో విధులకు వెళ్లేదాన్ని. తరచూ ఎంతో మంది పసి పిల్లలు మృత్యువాత పడడం చూసి చాలా బాధ కలిగేది. అప్పుడే పీడియాట్రిక్‌ అనస్థీషియా చేయాలనుకున్నా. అప్పటికి ఇక్కడ ఆ వైద్యం లేదు. తర్వాత అపోలోలో పనిచేశా. 2002లో యూనివర్సిటీ ఆఫ్‌ మియామీలో అనస్థీషియా రెసిడెన్సీ, యూనివర్సిటీ ఆఫ్‌ మిషిగన్‌లో పీడియాట్రిక్‌ అనస్థీషియాలో సబ్‌ స్పెషాలిటీ చేశాను. భారత్‌లో సూపర్‌ స్పెషాలిటీనే అమెరికాలో సబ్‌స్పెషాలిటీ అంటారు. ఇప్పుడు చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ ఆఫ్‌ శాన్‌ అంటారియోలో మత్తు వైద్యురాలిగా చేస్తున్నా. మా వారు వెంకటసుబ్బారెడ్డి ఇంజినీరు. మాకు ఇద్దరమ్మాయిలు. అపూర్వ ఇక్కడే మెడిసిన్‌ చేసింది. అబ్బాయి అఖిల్‌ ఎంబీఏ చదువుతున్నాడు.


గుండు పాండురంగశర్మ, వరంగల్‌

మరిన్ని

నారీ... వ్యాయామ దారి!

ఇంట్లో పనే ఎక్సర్‌సైజు... ఒక గృహిణి అభిప్రాయం. ఆఫీసుకెళ్లొచ్చే సరికే టైం అయిపోతుంది. మళ్లీ జిమ్‌కు వెళ్లే తీరిక ఎక్కడిది? ఒక ఉద్యోగిని ఆవేదన. జిమ్‌ కెళ్లినా అక్కడ మగవాళ్లతో పాటు చేయలేం... ఇదో యువతి సమస్య... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే మార్గాలు బోలెడు ఉన్నాయంటున్నారు...జీరోసైజ్‌ లేదా సన్నగా, నాజూగ్గా ఉండాల్సిన అవసరం సినీతారలు, మోడల్స్‌కు మాత్రమే. మేమెందుకు నోరు కట్టేసుకోవాలి, కసరత్తులంటూ చెమటోడ్చాలి అనే భావన చాలా మంది మహిళల్లో ఉండేది. గృహిణులకు ఇంటిపనే సరిపోతుందిలే’ అనే అపోహ ఉండేది. ఇప్పుడు మహిళలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో జీవనశైలిలో మార్పులు వచ్చాయి.

తరువాయి

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

తరువాయి

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

తరువాయి

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని