పిచ్చిపిల్ల అని చేర్చుకోమన్నారు
close
Updated : 28/07/2021 06:31 IST

పిచ్చిపిల్ల అని చేర్చుకోమన్నారు

బిడ్డ మనసుని అమ్మకాక మరెవరు అర్థం చేసుకుంటారు! మానసిక వైకల్యంతో బాధపడుతున్న తన బిడ్డలాంటి మరెందరో బిడ్డలకోసం ఆమె ఒక ప్రత్యేకమైన పాఠశాలని ఏర్పాటుచేశారు. ఆమెతోపాటు కుటుంబం మొత్తం ఈ యజ్ఞంలో పాల్గొనడం విశేషం...

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైవీఎస్‌ఎస్‌ జయలక్ష్మికి ఇద్దరు పిల్లలు. రెండో సంతానం సింధూరి. తను పుట్టుకతో మైక్రోసెఫలిస్‌ వ్యాధికి గురైంది. నాలుగేళ్ల వయసొచ్చే వరకూ ఒక్క మాటా మాట్లాడలేదు. పాఠశాలలో చేర్పిస్తే మార్పు వస్తుందేమో అనుకున్నారు. కానీ పిచ్చి పిల్లని చేర్చుకోమంటూ వాళ్లు ఇచ్చిన కఠినమైన సమాధానం ఆ తల్లి మనసుని తీవ్రంగా గాయపరిచింది. కొన్నాళ్లు ఆ బాధనుంచి తేరుకోలేకపోయారు. తర్వాత ఎంతో వెతగ్గా రాజమండ్రిలో ప్రత్యేక పాఠశాల ఉందని తెలుసుకుని అందులో చేర్చారు. అక్కడి టీచర్ల బృందం ప్రయోగాలు ఫలించి సింధూ తొలిసారి ‘అమ్మా’ అని పిలిచింది. ఏళ్ల నుంచి ఆ పిలుపు కోసమే ఎదురుచూస్తున్న జయలక్ష్మికి పట్టలేని సంతోషం కలిగింది. ఆ ఉత్సాహంతో తనూ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా చేసి అదే పాఠశాలలో టీచరుగా చేరారు. అప్పటికీ సింధూరికి సాధారణ స్కూల్‌లో సీటు దొరకలేదు. ఇదంతా చూసి ఇలాంటి పిల్లల కోసం ఏదైనా చేయాలనుకున్నారు జయలక్ష్మి.

ఇంట్లోనే శిక్షణ....

తన కుమార్తెతో పాటు మానసిక దివ్యాంగుడైన పొరుగింటి అబ్బాయికి కూడా ఇంట్లోనే శిక్షణ ప్రారంభించారు. ఈ విషయం చుట్టుపక్కల ఊళ్లకూ పాకింది. దీంతో ప్రత్యేక అవసరాల పిల్లలను ఇక్కడ చేర్పించడం మొదలుపెట్టారు. కొద్దికాలంలోనే వారి సంఖ్య 40కి చేరుకుంది. దీన్ని వ్యవస్థీకృతం చేయాలని 2012లో గుంటూరు నవభారత్‌ నగర్‌లో ‘ప్రభాత సింధూరి పాఠశాల’ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇప్పుడు 65 మంది శిక్షణ పొందుతున్నారు. ఉదయం 9 గంటలకు యోగాతో పాఠశాల ప్రారంభమవుతుంది. ఏడాది నుంచి 18 ఏళ్ల వయసున్న మానసిక దివ్యాంగులకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. ప్రత్యేక బీఈడీ చేసిన టీచర్లు విద్యాబుద్ధులు నేర్పిస్తారు. ఫిజియోథెరపిస్టులతో కసరత్తులు చేయిస్తారు. తమ పనులు తాము సొంతగా చేసుకునేలా ప్రోత్సహిస్తారు. అక్షరాలు, అంకెలు, బొమ్మలు వంటివి గుర్తుపట్టడంలోనూ శిక్షణ ఇస్తారు. సృజనాత్మకత పెంపొందించే స్వయంఉపాధి మార్గాలనూ నేర్పిస్తారు. పిల్లలతో కొవ్వొత్తులు, ప్రమిదలు, క్లాత్‌బ్యాగులు, రాఖీల వంటివి తయారు చేయిస్తారు. శారీరకంగా ఎదుగుదల లేనివాళ్లకు, ఆటిజం పిల్లలకు ఫిజియోథెరపిస్టులతో తర్ఫీదు ఇస్తున్నారు. శిక్షణ అనంతరం ఓపెన్‌స్కూల్‌ ద్వారా పదోతరగతి పరీక్షలు రాయిస్తున్నారు.   ఇక్కడ శిక్షణ పొందిన ఎందరో పిల్లలు స్వయం ఉపాధితో తమ కాళ్లపై తామునిలబడ్డారు.

కుటుంబమంతా సేవలోనే...

జయలక్ష్మి భర్త శ్రీనివాస్‌ రూ.లక్ష వేతనాన్ని వదులుకొని పాఠశాల పనుల్లో నిమగ్నమయ్యారు. వీళ్ల అబ్బాయి ఆక్యుపేషనల్‌ థెరపీలో డిగ్రీ చేసి వీరికి సాయంగా నిలుస్తున్నాడు. ఆ ఇంటి కోడలు కూడా వీరి బాటలోనే నడుస్తూ ఇక్కడే టీచర్‌గా సేవలు అందిస్తోంది. జయలక్ష్మి అత్తమామలు పిల్లలకు మ్యూజిక్‌, పాటలు పాడించడంలో పాలు పంచుకుంటారు. ఈ క్రమంలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇల్లు, బంగారం అమ్మేశారు. వీరి అంకితభావం వృథా కాలేదు. 2016 నుంచి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్‌ ట్రస్టు అండగా నిలిచింది. ఎన్‌ఆర్‌ఐలు కొందరు ఒక మినీ బస్సును ఇచ్చారు. భారతీయ స్టేట్‌బ్యాంకు ఒక వ్యాను సమకూర్చింది. దాతల విరాళాలతో ప్రస్తుతం పాఠశాల నిర్వహణ సజావుగా సాగుతోంది. అద్దె స్థలంలో ఉన్న ఈ పాఠశాలకు గుంటూరులోని స్తంభాలగరువులో శాశ్వత భవనం నిర్మిస్తున్నారు. అది పూర్తయితే ఎలాంటి ఆసరాలేని మానసిక దివ్యాంగులను కూడా చేరదీసి సేవలు అందిస్తామని జయలక్ష్మి వివరించారు.

పెనికలపాటి రమేష్‌, గుంటూరు


వయసు అనేది సంఖ్య మాత్రమే. ధైర్యం, సంకల్పం, మానసికస్థైర్యం ఉంటే చాలు. అనుకున్నదేదైనా మహిళలు సాధించగలరు. - కుంజరాణీదేవి,  వెయిట్‌లిఫ్టర్‌

 

మరిన్ని

నారీ... వ్యాయామ దారి!

ఇంట్లో పనే ఎక్సర్‌సైజు... ఒక గృహిణి అభిప్రాయం. ఆఫీసుకెళ్లొచ్చే సరికే టైం అయిపోతుంది. మళ్లీ జిమ్‌కు వెళ్లే తీరిక ఎక్కడిది? ఒక ఉద్యోగిని ఆవేదన. జిమ్‌ కెళ్లినా అక్కడ మగవాళ్లతో పాటు చేయలేం... ఇదో యువతి సమస్య... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే మార్గాలు బోలెడు ఉన్నాయంటున్నారు...జీరోసైజ్‌ లేదా సన్నగా, నాజూగ్గా ఉండాల్సిన అవసరం సినీతారలు, మోడల్స్‌కు మాత్రమే. మేమెందుకు నోరు కట్టేసుకోవాలి, కసరత్తులంటూ చెమటోడ్చాలి అనే భావన చాలా మంది మహిళల్లో ఉండేది. గృహిణులకు ఇంటిపనే సరిపోతుందిలే’ అనే అపోహ ఉండేది. ఇప్పుడు మహిళలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో జీవనశైలిలో మార్పులు వచ్చాయి.

తరువాయి

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

తరువాయి

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

తరువాయి

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని