‘ అద్దెగర్భాలపై గళమెత్తింది!
close
Updated : 01/08/2021 05:21 IST

‘ అద్దెగర్భాలపై గళమెత్తింది!

చట్టవిరుద్ధంగా సరోగసీ పద్ధతిని వినియోగిస్తున్నారంటూ మనదేశ పార్లమెంటు కమిటీ ఎదుట గళమెత్తారు డాక్టర్‌ షీలా సూర్యనారాయణన్‌ శరవణన్‌. అద్దెగర్భాన్నిస్తున్న తల్లుల ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులపై దేశవ్యాప్తంగా పర్యటించి అధ్యయనాలు జరిపి పలు రచనలు చేశారు. సరోగసీ పద్ధతిని నిషేధించిన స్వీడన్‌ దేశ పార్లమెంటులోనూ ప్రసంగించిన డాక్టర్‌ షీలాను వసుంధర పలకరించింది..

కేరళ నుంచి ఉద్యోగరీత్యా ముంబయి చేరుకున్న కుటుంబంలో పుట్టారు షీలా. తొమ్మిదేళ్లప్పుడే అమ్మానాన్నలను కోల్పోయారీమె. తోబుట్టువు వద్ద ఉంటూ చదువుకున్నారు. ముంబయి విశ్వవిద్యాలయంలో జాగ్రఫీలో ఎంఏ, పుణెలో డెవలప్‌మెంట్‌ స్టడీస్‌లో మాస్టర్స్‌ చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మహిళారోగ్యంపై అధ్యయనం చేపట్టారు. ఆ తర్వాత ఎమ్మెస్‌ స్వామినాథన్‌ రీసెర్చి ఫౌండేషన్‌లో చేరి అనంతపురం జిల్లా గుత్తి అనే మారుమూల ప్రాంతానికి రీసెర్చి నిమిత్తం వెళ్లారు. అటవీప్రాంతాల వనరులను గిరిజనులు ఎలా వినియోగించుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారనే అంశంపై అధ్యయనం చేసేటప్పుడు అక్కడి మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించారు. ఇది ఆమెను రీప్రొడక్టివ్‌ హెల్త్‌పై అధ్యయనం చేసేందుకు ప్రేరణ కలిగించింది. అలా ఆస్ట్రేలియాలోని స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌లో పీహెచ్‌డీలో చేరి, ‘ట్రెడిషనల్‌ బర్తింగ్‌ ప్రాక్టీసెస్‌’లో సరోగసీపై మహారాష్ట్రలో ఏడాదిపాటు అధ్యయనం చేశారు.

‘అహ్మదాబాద్‌లోని ఆనంద్‌లో సరోగసీకి పేద మహిళలే సిద్ధంగా ఉండేవారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, లండన్‌, శ్రీలంక, దుబాయి వంటి దేశాల నుంచి సరోగసీ ద్వారా పిల్లల్ని కనేందుకు 2009లో మన దేశానికి చాలా మంది వచ్చేవారు. రీసెర్చి కోసం అక్కడ 6 నెలలు ఉన్నా. సరోగసీ తల్లులను కలిసి వారి అనుభవాలను తెలుసుకుని, ‘అనానిమస్‌ మదర్‌’ అనే 10 నిమిషాల నిడివి డాక్యుమెంటరీ చేశా. ‘ట్రాన్స్‌ నేషనల్‌ ఫెమినిస్ట్‌ వ్యూ ఆఫ్‌ సరోగసీ బయో మార్కెట్‌ ఇన్‌ ఇండియా’ పుస్తకం రాశా. వీటిలో సరోగసీ తల్లుల ఆర్థిక, ఆరోగ్య, సామాజిక పరిస్థితులన్నీ పొందుపరిచా. ఆర్థిక అవసరాల కోసం సరోగసీకి సిద్ధమయ్యే మహిళలు నాలుగైదు ప్రసవాల తర్వాత తీవ్ర అనారోగ్యాల బారిన పడేవారు. ఆ పదినెలలూ కుటుంబానికి దూరంగా ఉండటం, ఆసుపత్రి పర్యవేక్షలోనే గడపడం.. వారిని కుంగదీసేవి. ఆడపిల్ల ఉంటే అబార్షన్‌ చేసేవారు. ఇవన్నీ సరోగసీ తల్లుల ఆరోగ్యాన్ని దెబ్బతీసేవి. కమర్షియల్‌ సరోగసీకి అప్పట్లో మన దేశంలో అనుమతి ఉండేది. అయితే ప్రస్తుతం మన ప్రభుత్వం తెచ్చిన చట్టంతో పరిస్థితి కొంచెం మెరుగుపడింది. ఇంకా చాలా మార్పులు చేయాలి’ అని అంటారు షీలా. షీలా భర్త శరవణన్‌ జర్మనీలో ప్రొఫెసర్‌. వీరికిద్దరు మగ పిల్లలు. ప్రస్తుతం ఈమె హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌.

షీలా రాసిన పుస్తకాలపై చర్చించేందుకు గతేడాది జనవరిలో పార్లమెంటు కమిటీ ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానించింది. సరోగసీ బిల్లు ఆమోదం కోసం షీలా నుంచి  సూచనలను తీసుకొంది. ఇటలీ, ప్యారిస్‌, వియన్నా పార్లమెంటుల్లో సరోగసీపై ప్రసంగించారీమె. తాజాగా స్వీడన్‌ ప్రభుత్వానికి సరోగసీ చట్టంలో చేయాల్సిన మార్పుల గురించీ సూచనలు అందించారు.

మరిన్ని

నారీ... వ్యాయామ దారి!

ఇంట్లో పనే ఎక్సర్‌సైజు... ఒక గృహిణి అభిప్రాయం. ఆఫీసుకెళ్లొచ్చే సరికే టైం అయిపోతుంది. మళ్లీ జిమ్‌కు వెళ్లే తీరిక ఎక్కడిది? ఒక ఉద్యోగిని ఆవేదన. జిమ్‌ కెళ్లినా అక్కడ మగవాళ్లతో పాటు చేయలేం... ఇదో యువతి సమస్య... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే మార్గాలు బోలెడు ఉన్నాయంటున్నారు...జీరోసైజ్‌ లేదా సన్నగా, నాజూగ్గా ఉండాల్సిన అవసరం సినీతారలు, మోడల్స్‌కు మాత్రమే. మేమెందుకు నోరు కట్టేసుకోవాలి, కసరత్తులంటూ చెమటోడ్చాలి అనే భావన చాలా మంది మహిళల్లో ఉండేది. గృహిణులకు ఇంటిపనే సరిపోతుందిలే’ అనే అపోహ ఉండేది. ఇప్పుడు మహిళలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో జీవనశైలిలో మార్పులు వచ్చాయి.

తరువాయి

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

తరువాయి

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

తరువాయి

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని