వేల గృహిణులకు ఆర్థిక స్వావలంబన...
close
Published : 03/08/2021 01:04 IST

వేల గృహిణులకు ఆర్థిక స్వావలంబన...

కుటుంబ బాధ్యతల్లో మునిగిపోయి విద్యార్హతను సైతం మరచిపోయే మహిళలకు, విరామం తర్వాత తిరిగి ఉద్యోగం లేదా వాణిజ్యంలో అడుగుపెట్టాలనే ఆసక్తి ఉన్నవారికి చంద్రవదన చేయూతగా నిలుస్తోంది. అలాగని ఈమె పెద్ద వాణిజ్యవేత్త కూడా కాదు. అయినా వేలమంది గృహిణులకు ఆర్థికస్వావలంబన కల్పిస్తున్న చంద్రవదన స్ఫూర్తికథనమిది.

కొచ్చిన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విశ్వ విద్యాలయంలో ఎంబీఏ, పీహెచ్‌డీ స్కాలర్‌ అయిన చంద్రవదన ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగాన్ని సంపాదించుకుంది. ఓ ప్రాజెక్టులో పని చేస్తున్నప్పుడు పెళ్లి అయ్యింది. ఆ తర్వాత ప్రసవం కోసం తీసుకున్న సెలవులను అయిదేళ్లు  పొడిగించుకుంది. ఆ సమయంలో సైకాలజీలో మాస్టర్స్‌ పూర్తి చేసింది. కొన్నాళ్లు డబ్బింగ్‌ ఆర్టిస్టుగా, రేడియో జాకీగా మనసుకు నచ్చిన అన్ని రంగాల్లోనూ అడుగుపెట్టింది. తర్వాత ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో ఫ్యాకల్టీగా చేరింది.

ఉద్యోగంతో పాటు సొంతంగా ఏదైనా చేయాలనుకునేది. దాంతో బయటకు వచ్చేసి, ‘4ట్యూన్‌ ఫ్యాక్టరీ’ పేరుతో కన్సల్టెన్సీని ప్రారంభించింది. కుటుంబం మద్దతు ఇవ్వకపోయినా ధైర్యంగా ఒంటరిగానే తన కలను నెరవేర్చుకోవాలని సాహసం చేసింది.

మహిళల కోసం... తన కన్సల్టెన్సీ ద్వారా చాలామంది మహిళల గురించి తెలుసుకోవడానికి చంద్రవదనకు అవకాశం దక్కింది. కొందరు చదువుకున్నా ఉద్యోగాలు చేయలేకపోవడం, సృజనాత్మకత, ఆలోచనాశక్తి ఉండీ తమ కాళ్లపై తాము నిలబడలేకపోవడం గుర్తించింది. వారికి ప్రోత్సాహాన్ని అందించాలనుకుంది. వారి అర్హతబట్టి ఉద్యోగం, ఆసక్తి ఉంటే వాణిజ్యంలోకి అడుగు పెట్టేలా చేయూతనివ్వడం, నూతన ఆలోచనలకు ప్రోత్సాహాన్ని అందించే దిశగా 2017లో ‘ప్రయాణా ల్యాబ్స్‌’ను స్థాపించింది. అర్హత, ఆలోచనాశక్తి ఉండి కూడా మహిళలు వాటిని వినియోగించకపోతే అది వారి కుటుంబానికే కాదు, దేశార్థికపరిస్థితిపైనా ప్రభావం చూపిస్తుందని చెబుతుంది చంద్రవదన. ‘చదువుకునేటప్పుడు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక కల తప్పనిసరిగా ఉంటుంది. వాటిని నెరవేర్చుకో మంటూ వారిలో అవగాహన తేవడానికి ప్రయత్నించడం మొదలుపెట్టా. అందుకే ముందుగా పాఠశాల స్థాయి నుంచి ప్రారంభించా. ‘కమ్‌బ్యాక్‌ 2 కెరీర్‌ మిషన్‌’ పేరుతో పాఠశాలల్లో క్యాంపులు ఏర్పాటు చేసి వారికి కెరీర్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, గృహిణులను వారికిష్టమైన కెరీర్‌లో అడుగుపెట్టేలా కూడా చేయడానికి కృషి చేశా. ‘ప్రయాణాహబ్‌’ పేరుతో ఎర్నాకుళం, కొచ్చిన్‌ కేంద్రాలుగా సంస్థను ప్రారంభించా. వీటి ద్వారా గృహిణులకు ఉచితంగానే ఆన్‌లైన్‌లో కెరీర్‌ ఓరియంటేషన్‌ ప్రోగ్రామ్స్‌ నిర్వహించే దాన్ని. ఈ నాలుగేళ్లలో దాదాపు 40వేలమందికిపైగా గృహిణులు, వాణిజ్యవేత్తలు, విద్యావంతులు ఈ వేదిక వల్ల లబ్ది పొందారు. వీరందరికీ వారి ఆసక్తికి తగ్గట్లుగా కార్పొరేట్‌, ప్రభుత్వసంస్థలతో అనుసంధానం చేసి, వాటి ద్వారా తాము తయారుచేసిన ఉత్పత్తుల విక్రయానికి వేదికగా మార్చగలిగా. అంతేకాదు, ‘షీ మార్కెట్స్‌’ పేరుతో స్థానికంగా ఎగ్జిబిషన్లు నిర్వహించి,  గృహిణులు పచ్చళ్లు, బ్యాగులు, తదితర వస్తువులను విక్రయించడానికి ప్రోత్సాహాన్ని అందించా. దీంతో వారంతా ఆర్థిక స్వావలంబన పొందుతున్నారు’ అని వివరించింది చంద్రవదన.

పది లక్షలమంది... వచ్చే రెండేళ్లలో పది లక్షల మందిని ఆర్థికంగా నిలబెట్టడానికి కృషి చేస్తోంది చంద్రవదన. ఇందులో సభ్యత్వానికి రూ.199 రుసుము చెల్లించాలి. ఈమె చేస్తున్న కృషికి అమెరికా, కేరళ రాష్ట్రప్రభుత్వం నిధులు అందిస్తున్నాయి. గతంలో యునైటెడ్‌ నేషన్స్‌ నేతృత్వంలో ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎంప్రెటెక్‌ సదస్సులో ‘వుమెన్‌ ఇన్‌ బిజినెస్’ అవార్డును తనకు అందించి గౌరవించారు.

మరిన్ని

నారీ... వ్యాయామ దారి!

ఇంట్లో పనే ఎక్సర్‌సైజు... ఒక గృహిణి అభిప్రాయం. ఆఫీసుకెళ్లొచ్చే సరికే టైం అయిపోతుంది. మళ్లీ జిమ్‌కు వెళ్లే తీరిక ఎక్కడిది? ఒక ఉద్యోగిని ఆవేదన. జిమ్‌ కెళ్లినా అక్కడ మగవాళ్లతో పాటు చేయలేం... ఇదో యువతి సమస్య... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే మార్గాలు బోలెడు ఉన్నాయంటున్నారు...జీరోసైజ్‌ లేదా సన్నగా, నాజూగ్గా ఉండాల్సిన అవసరం సినీతారలు, మోడల్స్‌కు మాత్రమే. మేమెందుకు నోరు కట్టేసుకోవాలి, కసరత్తులంటూ చెమటోడ్చాలి అనే భావన చాలా మంది మహిళల్లో ఉండేది. గృహిణులకు ఇంటిపనే సరిపోతుందిలే’ అనే అపోహ ఉండేది. ఇప్పుడు మహిళలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో జీవనశైలిలో మార్పులు వచ్చాయి.

తరువాయి

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

తరువాయి

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

తరువాయి

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని