అంతరిక్షంలో అడుగుపెడుతున్నారు...
close
Updated : 15/09/2021 05:21 IST

అంతరిక్షంలో అడుగుపెడుతున్నారు...

అమ్మాయిలు అంతరిక్షంలో అడుగుపెట్టడం మొదటిసారేం కాదు... కానీ ఈసారి వెళ్తున్న హేలీకి మాత్రం ఓ ప్రత్యేకత ఉంది.  అదేంటో తెలుసా? ‘నమ్మకాని’కి ప్రతిరూపంగా ఆ అమ్మాయిని గగన వీధుల్లోకి పంపిస్తున్నారు. ‘స్పేస్‌ఎక్స్‌- ఇన్‌స్పిరేషన్‌ 4’ పేరుతో అంతరిక్షంలోకి వెళ్తున్న బృందంలో 29 ఏళ్ల హేలీ ఆర్సెనాక్స్‌తోపాటు ఉన్న సియాన్‌ ప్రాక్టర్‌ జీవితమూ స్ఫూర్తిదాయకమే...

చిన్నవయసులోనే క్యాన్సర్‌ బారిన పడింది హేలీ ఆర్సెనాక్స్‌. అమెరికాలోని లూసియానా వాళ్లది. హౌవార్డ్‌, కొలీన్‌ తన అమ్మానాన్న. హేలీ పదేళ్లప్పుడు తీవ్రమైన మోకాలి నొప్పితో ఆసుపత్రిలో చేరితే, ఎముక క్యాన్సర్‌గా తేల్చారు వైద్యులు. ఆమెను సెయింట్‌ జూడే చిల్డ్రన్స్‌ రీసెర్చ్‌ హాస్పిటల్‌లో చేర్చారు. మూడేళ్లు వైద్యం చేసినా నయం కాకపోతే మోకాలి మార్పిడి చికిత్స చేశారు. అలా అయిదేళ్ల తర్వాత క్యాన్సర్‌ నుంచి హేలీ బయటపడింది. అప్పటి దాకా ఆసుపత్రిలో ఉంటూనే చదువును కొనసాగించింది. ఆపై తనలాంటివారికి సేవ చేయాలని... ఫిజిషియన్‌ అసిస్టెంట్‌ (పీఏ) కోర్సును పూర్తి చేసింది. తాను చికిత్స పొందిన ఆసుపత్రిలోనే క్యాన్సర్‌ బాధితులకు సేవలందిస్తోంది. సోదరుడు హేడెన్‌, వదిన లిజ్‌ ఏరోస్పేస్‌ ఇంజినీర్లు కావడంతో ఆ రంగంలో ఆసక్తిని పెంచుకుంది. అదే హేలీతో స్పేస్‌-ఎక్స్‌ వ్యోమగాముల ఎంపికకు దరఖాస్తు చేయించింది. తర్వాత ఇంటర్వ్యూలో ఎంపికై, శిక్షణ తీసుకుంది. ‘క్యాన్సర్‌ వచ్చాక జీవితమంతా నిస్సారంగా అనిపించింది. దాంట్లోంచి బయటపడిన తర్వాత నాలాంటి వారిలో ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచాలనిపించేది. ఈ అంతరిక్ష యాత్రలో ‘నమ్మకం’ అనే అంశానికి ప్రాధాన్యమివ్వడంతో ఆ అవకాశాన్ని నేను పొందగలిగా. ఈ బృందంలో చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా బాధ్యత వహించడంతోపాటు.. అవయవ మార్పిడి జరిగి అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి మహిళగా చరిత్రలోకెక్కుతున్నా. నాలాంటి కోట్లమంది క్యాన్సర్‌ బాధితులకు నేనో నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇవ్వబోతున్నా’ అని చెబుతోంది హేలీ. ఈ యాత్ర ద్వారా సేకరించే 200 మిలియన్ల డాలర్లను క్యాన్సర్‌ రోగులకు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.


తొలి ఆఫ్రికన్‌ మహిళ!

అంతరిక్షంలో అడుగుపెట్టాలని కలలు కంది. నాసా తరఫున అవకాశం వచ్చినా చేజారిపోయింది. అయినా నిరాశపడలేదు. తన కృషిని ఆపలేదు. లక్ష్య సాధనకు వయసు అడ్డు కాదంటోంది 51 ఏళ్ల భూగర్భ శాస్త్రవేత్త డాక్టర్‌ సియాన్‌ ప్రాక్టర్‌. 

మెరికాలోని గ్వాంలో పుట్టింది డాక్టర్‌ సియాన్‌ ప్రాక్టర్‌. ఎడిన్‌బరో విశ్వవిద్యాలయంలో ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌లో బీఎస్‌, అరిజోనా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్‌, పీహెచ్‌డీ చేసింది. అక్కడి సౌత్‌ మౌంటెయిన్‌ కమ్యూనిటీ కాలేజీలో భూగర్భ శాస్త్రవేత్తగా, సైన్స్‌ కమ్యూనికేటర్‌గానూ వ్యవహరిస్తోంది. నాసాలో పని చేసే తండ్రిని స్ఫూర్తిగా తీసుకున్న సియాన్‌ కమర్షియల్‌ ఆస్ట్రోనాట్‌ కోర్సు చదివి పైలట్‌ లైసెన్స్‌ అందుకుంది. ప్రొఫెసర్‌గా పనిచేస్తూనే, అభిరుచికి తగ్గట్లుగా అరిజోనా వింగ్‌కు ఏరోస్పేస్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌గా, సివిల్‌ ఎయిర్‌ పెట్రోల్‌ విభాగంలో మేజర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. అలా ఓసారి నాసా తరఫున వ్యోమగామిగా వెళ్లే అవకాశం దక్కినా తృటిలో చేజారింది. ఛాన్స్‌ కోసం ఎదురు చూస్తున్న తనకు స్పేస్‌ఎక్స్‌ ప్రకటన ఆ అదృష్టాన్ని అందించింది. ‘ఇన్‌స్పిరేషన్‌ 4 స్పేస్‌ ఫ్లైట్‌లో పైలట్‌గా ఎంపికయ్యా. నా జీవితకల ఇది. ఈ మూడు రోజుల యాత్రానుభవాన్ని పాఠాలుగా మార్చి అందరికీ చెప్పాలని ఉంది’ అంటోన్న డాక్టర్‌ సియాన్‌ ఈ యాత్రతో తొలి ఆఫ్రికన్‌ అమెరికా మహిళా వ్యోమగామిగా నిలవనున్నారు.

మరిన్ని

నారీ... వ్యాయామ దారి!

ఇంట్లో పనే ఎక్సర్‌సైజు... ఒక గృహిణి అభిప్రాయం. ఆఫీసుకెళ్లొచ్చే సరికే టైం అయిపోతుంది. మళ్లీ జిమ్‌కు వెళ్లే తీరిక ఎక్కడిది? ఒక ఉద్యోగిని ఆవేదన. జిమ్‌ కెళ్లినా అక్కడ మగవాళ్లతో పాటు చేయలేం... ఇదో యువతి సమస్య... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే మార్గాలు బోలెడు ఉన్నాయంటున్నారు...జీరోసైజ్‌ లేదా సన్నగా, నాజూగ్గా ఉండాల్సిన అవసరం సినీతారలు, మోడల్స్‌కు మాత్రమే. మేమెందుకు నోరు కట్టేసుకోవాలి, కసరత్తులంటూ చెమటోడ్చాలి అనే భావన చాలా మంది మహిళల్లో ఉండేది. గృహిణులకు ఇంటిపనే సరిపోతుందిలే’ అనే అపోహ ఉండేది. ఇప్పుడు మహిళలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో జీవనశైలిలో మార్పులు వచ్చాయి.

తరువాయి

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

తరువాయి

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

తరువాయి

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని