చేయీ చేయీ కలిపారు చేయూతనిస్తున్నారు
close
Updated : 25/11/2021 05:28 IST

చేయీ చేయీ కలిపారు చేయూతనిస్తున్నారు

మంచి ఉద్యోగాలు, వృత్తుల్లో ఉన్నారు... అయినా ఆ అమ్మల మనసుల్లో వెలితి. మనం బాగుండటమే కాదు... చుట్టూ ఉన్న నిస్సహాయుల కన్నీళ్లు తుడిచి, సంతోషంగా ఉంచాలనుకున్నారు. చేయీ చేయీ కలిపారు... వైద్యశిబిరాలు, విద్యాదానం... ఒకటనేంటి... ఆపద, అవసరం ఏదైనా ఆపన్న హస్తం అందిస్తున్నారు. సొంత నిధులతోనే సాయమందిస్తున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు ఆంధ్ర మహిళా మండలి స్ఫూర్తి ప్రస్థానమిది!

పేద మహిళలకు ఆర్థిక, ఆరోగ్య చేయూతనివ్వడం, పేదపిల్లలకు విద్య, దృష్టికి వచ్చిన పౌరసమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారీ మహిళామణులు. మహిళా మండలి అంటే వందల మంది అనుకుంటారేమో... అంతా కలిపి 50 లోపే. ఈ మండలి 1946లో గాలి ఆదెమ్మ అధ్యక్షతన 11 మందితో ప్రారంభమైంది. 1955 నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నా గౌరవాధ్యక్షురాలు డాక్టర్‌ చెరుకూరి రోహిణి ఆధ్వర్యంలో పదేళ్లుగా బాగా ఊపందుకున్నాయి. అధ్యక్షురాలు ఇంద్రసేనమ్మ, కార్యదర్శి మాగుంట విష్ణువందన నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. చెరుకూరి రోహిణి, మైథిలి, తనుజా, జయలక్ష్మి, సుగుణ వైద్యులు... పరంజ్యోతి, శశికళలు విశ్రాంత ఉపాధ్యాయులు. సభ్యుల్లో కొందరు బ్యాంకు ఉద్యోగులు, చిన్నతరహా పారిశ్రామికవేత్తలు, మిగిలిన వారు గృహిణులు. వీరు ఎవరి విరాళాలూ తీసుకోరు.

తొలి ప్రాధాన్యం విద్యకే... గూడూరు పట్టణంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలకూ ఆర్థిక సాయం అందించి మౌలిక వసతులు కల్పించారు. గ్రంథాలయాల నిర్మాణం నుంచి పుస్తకాలు వరకు అన్ని అవసరాలూ వీరే చూసుకున్నారు. దీనిపై రూ.50 లక్షలకు పైగా వెచ్చించారు. ఇంకా బాలసదనంలోని వసతుల కల్పన, వసతిగృహాల విద్యార్థులకు అవసరమైన సామగ్రినీ ఇస్తున్నారు. సరస్వతి శిశు మందిరం, ఇతర ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకీ విద్యాసామగ్రిని అందించారు. పేద, అనాథ పిల్లల్ని అక్కున చేర్చుకొని చదివిస్తున్నారు. వారి ఉన్నత చదువులకు ఫీజులు చెల్లిస్తున్నారు. అలా గత ఏడేళ్లలో 30 మందిని చదివించారు. వీరి ఫీజుల కోసమే రూ.10 లక్షలకు పైగా ఖర్చు చేశారు.

ప్రతి నెలా 3 ఆదివారాలు గూడూరు, చుట్టుపక్కల గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఉచితంగా మందులతోపాటు శస్త్రచికిత్సలూ చేయిస్తున్నారు. పేద మహిళలకు డాక్టర్‌ సీఆర్‌రెడ్డి ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు చేయిస్తున్నారు. తమ పరిధిలో లేని చికిత్సలకు ఆర్థికసాయం చేస్తున్నారు. ప్రతి నెలా 25 నుంచి 30 మంది పేద గర్భిణులకు శ్రీమంతాలు చేసి పోషకాహారం ఇస్తుంటారు. అయిదేళ్లుగా ఎయిడ్స్‌ దినోత్సవం రోజున రూ.50 వేలతో బాధితులకు పౌష్టికాహారం, దుస్తులు, దుప్పట్లు అందజేస్తున్నారు.


వీలైనంత చేయూత నివ్వాలని...

వీలైనంత మంది పేదలను, ముఖ్యంగా మహిళలను ఆదుకోవాలనేదే మా తాపత్రయం. కష్టాలు తీరిన వారు చూపే ప్రేమానురాగాలు సంతృప్తినిస్తాయి. సభ్యులందరం చర్చించుకొని ప్రణాళికను రూపొందించుకుంటాం. బాధ్యతలూ పంచుకుంటాం. నిధులను సభ్యులే సమకూర్చుకుంటాం. మహిళలం కలసి కృషి చేస్తే సమాజానికి ఎంతో చేయవచ్చన్నది మా విశ్వాసం. దాన్నే ఆచరణలో చూపుతున్నాం.

- డాక్టర్‌ చెరుకూరి రోహిణి


మహిళల ఆర్థికాభివృద్ధికీ... మహిళ ఆర్థికాభివృద్ధితో ఆ కుటుంబమూ పురోగతి సాధిస్తుందని నమ్ముతారు వీరు. అందుకే టైలరింగ్‌లో ఉచిత శిక్షణతోపాటు ఏటా 50 మందికి కుట్టుమిషిన్లూ అందిస్తున్నారు. కరోనా సమయంలో వలస కార్మికులకు ఆహారం, మందులు, సొంతూళ్లకు పంపేందుకు వాహనాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.లక్ష విరాళమిచ్చారు. ఉపాధి కోల్పోయిన వందల మంది ఆకలీ కొన్ని నెలల పాటు తీర్చారు. దివ్యాంగుల ఆధ్వర్యంలోని ‘రెడ్‌’ సంస్థ స్థిరనిధికి రూ.లక్ష ఆర్థిక సాయంతోపాటు అయిదేళ్లుగా ప్రతి నెలా సరకులూ ఇస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో బెంచీలు, మొక్కలు నాటడం, పార్కుల సుందరీకరణ చేపట్టారు. వేసవిలో చలి వేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ, తాగునీరు అందిస్తుంటారు.

- దొంతు వెంకటేశ్వర్లు, గూడూరు 

 మరిన్ని

నారీ... వ్యాయామ దారి!

ఇంట్లో పనే ఎక్సర్‌సైజు... ఒక గృహిణి అభిప్రాయం. ఆఫీసుకెళ్లొచ్చే సరికే టైం అయిపోతుంది. మళ్లీ జిమ్‌కు వెళ్లే తీరిక ఎక్కడిది? ఒక ఉద్యోగిని ఆవేదన. జిమ్‌ కెళ్లినా అక్కడ మగవాళ్లతో పాటు చేయలేం... ఇదో యువతి సమస్య... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే మార్గాలు బోలెడు ఉన్నాయంటున్నారు...జీరోసైజ్‌ లేదా సన్నగా, నాజూగ్గా ఉండాల్సిన అవసరం సినీతారలు, మోడల్స్‌కు మాత్రమే. మేమెందుకు నోరు కట్టేసుకోవాలి, కసరత్తులంటూ చెమటోడ్చాలి అనే భావన చాలా మంది మహిళల్లో ఉండేది. గృహిణులకు ఇంటిపనే సరిపోతుందిలే’ అనే అపోహ ఉండేది. ఇప్పుడు మహిళలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో జీవనశైలిలో మార్పులు వచ్చాయి.

తరువాయి

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

తరువాయి

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

తరువాయి

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని