ఆరోగ్యానికి ఈ ఐదూ...
close
Updated : 12/03/2021 14:33 IST

ఆరోగ్యానికి ఈ ఐదూ...

మనం తీసుకునే ఆహారంలో నిత్యం రెండు రకాల పండ్లు, మూడు రకాల కూరగాయలు ఉండేలా చూసుకుంటే అనారోగ్యాలు దరి చేరవని తేల్చి చెప్పింది ఓ అధ్యయనం. అధిక బరువు నియంత్రణ, జీవక్రియలు సక్రమంగా జరగడంతోపాటు వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుందని లక్షమందిపై చేసిన ఈ సర్వే పేర్కొంది. అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్స్‌ ఫ్లాగ్‌షిప్‌ జర్నల్‌లో ఈ విషయాలు ప్రచురితమయ్యాయి. ఇందులోని మరిన్ని అంశాలేంటంటే...

ర్వేలో భాగంగా గుండె జబ్బులు, క్యాన్సర్‌ వంటి సమస్యలకు దూరంగా ఉన్నవారి ఆహార పద్ధతులు పరిశీలిస్తే.. వారంతా కనీసం మూడు రకాల తాజా కూరగాయలు, ఆకుకూరలు, రెండు రకాల తాజా పండ్లు తీసుకోవడాన్ని గుర్తించారు. రోజులో ఒకేసారి కాకుండా తక్కువ మోతాదులో ఆహారాన్ని ఐదుసార్లుగా తీసుకునేవారు మరింత ఆరోగ్యంగా ఉన్నట్లు తేల్చారు. రోజుకి ఆరు నుంచి ఏడు గంటలపాటు నిద్ర, నాలుగు నుంచి ఆరు లీటర్ల నీటిని తాగడం, నిర్ణీత సమయం వ్యాయామం చేసేవారి జీవితకాలం ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

ఆకుపచ్చగా...
ఆకుకూరలు, ఆకుపచ్చని కూరగాయలు క్యాబేజీ, చిక్కుడు, లెట్యూస్‌ వంటివన్నీ పోషకాలమయమే. ఆకుకూరల్లోని విటమిన్‌ కె, ఎ, సిలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, బీటా కెరొటిన్‌ వంటివన్నీ వ్యాధికారకాలను దగ్గరకు రాకుండా చేస్తాయి. వీటిలోని ఫోలేట్‌ ఎర్రరక్తకణాల తయారీలో ప్రముఖపాత్ర వహిస్తుంది. మహిళల్లో గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలను దూరం చేస్తుంది. అలాగే క్యాబేజీ, చిక్కుడు వంటివి జీర్ణశక్తిని మెరుగుపరిచి, వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. అధిక బరువునూ తగ్గిస్తాయి. విటమిన్‌-సి సమృద్ధిగా ఉండే సిట్రస్‌ జాతి పండ్లు పీచుతో ఉండి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. చర్మం, ఎముకలు, రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. హృద్రోగాలను దరిచేరకుండా చేస్తాయి. అందుకే రోజూ ఆహారంలో నారింజ, నిమ్మ, పైనాపిల్‌ లాంటి ఏదైనా రెండు రకాల పండ్లను తినడం అలవరుచుకోవాలి.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి