మార్పు తనతోనే మొదలుపెట్టింది!
close
Updated : 18/03/2021 01:39 IST

మార్పు తనతోనే మొదలుపెట్టింది!

అమ్మానాన్నలు చిన్నతనంలోనే కన్నుమూశారు. అక్కున చేర్చుకున్న అమ్మమ్మ 13 ఏటనే పెళ్లి చేసి తన బరువు దించుకుంది. ఐనా ఆమె ఆధైర్యపడలేదు. భర్త సహకారంతో చదువు కొనసాగించడమే కాకుండా తన గ్రామంలోనూ విద్యా కుసుమాలు పూయించింది. ఇరవై ఏళ్లుగా అక్కడి వారికి విద్యాబుద్ధులు నేర్పుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఆమే రాజస్థాన్‌కు చెందిన 43 ఏళ్ల బసంతి దేవి.

‘సమాజంలో మార్పు రావాలంటే మొదటి అడుగు మన నుంచే మొదలుకావాలి.. అదే నెమ్మదిగా మొత్తం సమాజాన్ని మారుస్తుంది.’ అంటోన్న బసంతి జీవితం వడ్డించిన విస్తరి కాదు. తన చిన్నప్పుడే తల్లిదండ్రులు కన్నుమూశారు. దాంతో అమ్మమ్మే పెంచింది. అయితే ఐదో తరగతి పూర్తి కాగానే పెళ్లి చేసేసింది. పదమూడేళ్లకే అత్తారింట్లో అడుగు పెట్టిందామె. అలాగని ఆమె అధైర్యపడలేదు. చదువుకోవాలనే తన కోరికను భాగస్వామితో పంచుకుంది. పదోతరగతి చదివిన భర్త ఆమె చదువుకుంటానంటే సరేనన్నాడు. దాంతో ఆమె సంతోషానికి అవధులు లేవు. ఆ సమయంలోనే ప్రభుత్వం ‘ఎడ్యుకేషన్‌ వర్కర్‌ స్కీమ్‌’ను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా గిరిజనుల్లో అక్షరాస్యతను పెంచేందుకు ఐదో తరగతి పూర్తి చేసినవారిని తాత్కలిక టీచర్లుగా నియమించింది. అలా ఆమెకు టీచర్‌గా తొలి అవకాశం వచ్చింది. తాను అందుకున్న తొలి సంపాదన 600 రూపాయలను అత్త చేతిలో పెట్టింది. గ్రామంలోని గిరిజనులకు చదువు చెబుతూ ఆగిపోయిన చదువును కొనసాగించిందామె.  అలా దూరవిద్య ద్వారా డిగ్రీ చేసింది. ఆ తర్వాత బీఈడీకి సమానమైన ఎస్టీసీనీ పూర్తి చేసి పూర్తిస్థాయి టీచర్‌గా మారింది.

ఐదుగురు అమ్మాయిలకు పాఠాలు చెప్పడం మొదలుపెట్టిన ఆమె క్రమంగా 300 మందిని అక్షరాస్యులుగా మార్చింది. ప్రస్తుతం ఆ గ్రామంలోని పాఠశాలలో 108 మంది విద్యార్థులు చదువుతుండగా అందులో 53 మంది అమ్మాయిలున్నారు.. అలా గ్రామ స్వరూపాన్ని మార్చేసింది. గతంలో అక్కడ మూఢ నమ్మకాలు, సంప్రదాయాలూ ఎక్కువగా ఉండేవి. అయితే ఇప్పుక్కడ పరిస్థితి మారింది. తమ అమ్మాయిలకు చదువు నేర్పమని అడగడమే కాకుండా మహిళలూ ఆమె దగ్గర చదువు నేర్చుకుంటున్నారు. ఈమెను స్ఫూర్తిగా తీసుకుని బసంతి భర్త కూడా దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తిచేసి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉద్యోగం సంపాదించాడు. ఆమె దగ్గర చదువుకున్న చాలామంది మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి