మార్పు మీతోనే మొదలవ్వాలి...
close
Published : 19/03/2021 00:35 IST

మార్పు మీతోనే మొదలవ్వాలి...

పెళ్లైన తర్వాత కొంతమంది భాగస్వామిని మార్చ డానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తారు. అది ఎంతకీ సాధ్యంకాక అసహనానికీ గురవుతుంటారు. అందుకే ఒకసారి ఈ విధంగానూ ఆలోచించి చూడండి.

ఒకేలా ఆలోచించాలనుకోవడం... భిన్న కుటుంబాల నుంచి వచ్చిన భాగస్వాముల ఆలోచనలు, అలవాట్లు వేర్వేరుగా ఉండటం సహజమే. ఈ విషయాన్ని మర్చిపోయి ఎదుటివాళ్లు అచ్చం మనలాగే ఆలోచించాలనీ, మనలాగే స్పందించాలనీ కోరుకోవడం ఎంత మాత్రం సమంజసం కాదు. ఒకే తల్లి కడుపున పుట్టిన అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల ఆలోచనలే ఒకలా ఉండవు. అలాంటప్పుడు పెళ్లి పేరుతో ఒక్కటైనవాళ్ల ఆలోచనలు కలవాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది.
మార్చేయాలనుకోవడం... కొంతమంది పెళ్లి కావడంతోనే ఎదుటివారిని మార్చే ప్రయత్నాలు మొదలు పెట్టేస్తుంటారు. అది ఎదుటివారిని ఎంతో అసహనానికి గురిచేస్తుందనే విషయాన్ని ఏమాత్రం పట్టించుకోరు. ఇంట్లోనే ఉండాలనీ, స్నేహితులు, బంధువులతో బయటకు వెళ్లకూడదని రకరకాల షరతులు విధిస్తుంటారు. ఎదుటివారు పూర్తిగా తాము చెప్పినట్టుగానే వినాలనుకుంటారు. దీంతో ఇద్దరి మధ్యా మనస్పర్థలు మొదలవుతాయి.
పట్టుపట్టడం మంచిది కాదు... ‘నువ్వు పూర్తిగా మారిపోవాలి. నేను చెప్పినట్టుగానే నడుచుకోవాలి’ అని పట్టుపట్టడం వల్ల మీ మొండితనమే బయటపడుతుంది తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీ మీద  ఉన్న సదాభిప్రాయం కాస్తా పోతుంది.
మారి చూడండి... ఎదుటివాళ్లలో మార్పు కోసం ఎదురుచూసే బదులు వాళ్లకు అనుగుణంగా మీరే మారండి. వాళ్లను అర్థం చేసుకోవడానికి మీ వంతుగా ప్రయత్నించండి. అప్పుడు మీ మీది అభిమానంతో వాళ్లే ఇష్టంగా మారొచ్చేమో.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి