వయసు తగ్గి కనిపించాలంటే!
close
Updated : 19/03/2021 04:45 IST

వయసు తగ్గి కనిపించాలంటే!

నా ముఖంపై గీతలతో చర్మం నిర్జీవంగా కనిపిస్తోంది.నా వయసు కంటే పెద్దవారు కూడా నా కంటే చిన్నగా కనిపిస్తున్నారు. అలా నేనూ అందంగా కనిపించాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

- లక్ష్మి, హైదరాబాద్‌

న్యుపరంగా పుట్టుకతోనే కొంతమంది చర్మం నిగారింపుగా ఉంటుంది. అలానే కండ, కొవ్వుపొరలు తక్కువగా ఉండటం వల్ల కొందరి ముఖంపై ముడతలు సహజంగానే వస్తాయి. ఈ కారణంతో పాటు వాతావరణం, పనిచేసే చోటు,  రసాయనాలు, తీవ్రఒత్తిడి, పోషకాహార లేమి... వంటివీ చర్మం కళను తగ్గిస్తాయి. వృద్ధాప్య ఛాయలు త్వరగా వచ్చేస్తాయి.
ముడతలు పడకుండా... సున్నిత చర్మతత్వం ఉన్నవారు మేలైన కొవ్వులు, ప్రొటీన్లను ఆహారంలో చేర్చుకోవాలి. ఇనుము వంటి పోషకాలు శరీరానికి అందేలా చూసుకోవాలి. విటమిన్‌-ఇ, సి, డిలు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. ఇవి యాంటీఆక్సిడెంట్లలా పనిచేసి చర్మంలో పేరుకుపోయే మలినాలను బయటికి పంపిస్తాయి. నూనెపదార్థాలు, చక్కెర వాడకాన్ని తగ్గించాలి. ఎక్కువగా పొట్టుతీయని ముడిధాన్యాలు, తాజా ఆకుకూరలు, కాయగూరలు, గుడ్డు, పప్పుదినుసులు, పాలు, చేపలు... వీటిని ఆహారంలో చేర్చుకోవాలి. వీటన్నింటితోపాటు నీళ్లూ ఎక్కువగా తాగాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కంటినిండా నిద్ర పోవడం, వేళకు తినడం పాటించడం వల్ల చర్మం ఆరోగ్యంగా, అందంగా మారుతుంది.
అయితే....  వేగంగా బరువు పెరగడం/తగ్గడం లాంటివి చేస్తే చర్మానికి కావాల్సిన పోషకాలు సరిగా సరఫరా కావు. దాంతో అది స్థితిస్థాపకతను కోల్పోతుంది. రంగు, ఆకృతిలోనూ మార్పులొస్తాయి. కాబట్టి ఈ త్వరిత విధానాలను పాటించొద్దు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని