ఆత్మగౌరవం కోసం... ఊలుతో పాలిండ్లు!
close
Updated : 20/03/2021 06:11 IST

ఆత్మగౌరవం కోసం... ఊలుతో పాలిండ్లు!

అమెరికాలో ఉంటున్న నీతా... తమిళనాడు నుంచి వసుధ హైదరాబాద్‌కు చెందిన శృతి... వీళ్లే కాదు వందలాదిమంది మహిళలు రొమ్ముక్యాన్సర్‌తో బాధపడుతున్న స్త్రీలకు అండగా ఉండటం కోసం ఒక్కటయ్యారు. చేత్తో తయారుచేసిన ఊలు ప్రోస్థసిస్‌ల(నాకర్స్‌)ను తయారుచేస్తూ 80 వేలమంది స్త్రీల ఆత్మగౌరవాన్ని కాపాడారు. సాయీషా ఇండియా ఫౌండేషన్‌ వేదికగా వీరందరినీ ఏకతాటిపై నడిపిస్తున్నారు జయశ్రీ...
అమెరికా నుంచి ముంబయి వచ్చిన జయశ్రీ ఓ రోజు బంధువులింట్లో... రొమ్ముక్యాన్సర్‌ని జయించిన ఒక స్నేహితురాలిని కలిశారు.  అయినప్పటికీ ఏదో దిగులుగా ఉండటాన్ని ఆమె గమనించారు. అందుకు కారణాన్ని కూడా కనిపెట్టారు. ఇంటికి రాగానే ఆమె కోసం రొమ్ముల ఆకృతిని పోలిన ఊలు ‘నాకర్స్‌’ని అల్లి ఆమె చేతికిచ్చారు. అప్పుడు ఆమె కళ్లు సంతోషంతో మెరిసిపోయాయి. ఆ ఆనందాన్ని రొమ్ముక్యాన్సర్‌ బాధితులందరికీ అందివ్వాలనుకున్నారు జయశ్రీ. అందుకోసమే 2018 లో ‘సాయిషా ఇండియా ఫౌండేషన్‌’ని ఏర్పాటు చేశారు.

రొమ్ముక్యాన్సర్‌ నుంచి బయటపడే క్రమంలో కొన్నిసార్లు రొమ్ములని తొలగించాల్సిరావొచ్చు. క్యాన్సర్‌ని జయించినా... ఈ పరిస్థితి మాత్రం స్త్రీల ఆత్మవిశ్వాసానికి సవాలుగా మారుతుంది. ఇలాంటి సమయంలో చేత్తో అల్లిన ఊలు ప్రోస్థసిస్‌లు (నాకర్స్‌)ని ఉచితంగా అందించి వారిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు ఈ సంస్థ సభ్యులు. సాధారణంగా రొమ్ములని తొలగించిన తర్వాత ఆ లోటు తెలియకుండా ఉండేందుకు సిలికాన్‌ రొమ్ములని ప్రత్యామ్నాయంగా వాడతారు. కాకపోతే అవి కాస్త బరువుగా, అసౌకర్యంగా ఉండి..జిగటగా కూడా ఉండే అవకాశం ఉంది. కానీ ఈ ఊలు ప్రోస్థసిస్‌తో ఆ ఇబ్బందులేవీ ఉండవు. మామూలు బ్రాలో ఉంచి వీటిని ధరిస్తే చాలు. పూర్వపు ఆకృతిని సంతరించుకోవచ్చు. మృదువుగా, తేలికగా ఉంటాయి.  అమెరికాలో ఉంటున్నప్పుడు జయశ్రీ నిట్టెడ్‌ నాకర్స్‌ అనే సంస్థలో వలంటీర్‌గా ఉన్నారు. 52 ఏళ్ల షెరాన్‌ ఈ సంస్థని స్థాపించారు. కొన్నేళ్ల క్రితం ఆమె క్యాన్సర్‌కి చికిత్స తీసుకుంటున్న సమయంలో ఉపశమనం కోసం అల్లికలు మొదలుపెట్టి ఆ తర్వాత వలంటీర్ల సాయంతో వేలాదిమంది స్త్రీలకు ఈ ఊలు ప్రోస్థసిస్‌లను తయారుచేసి ఉచితంగా ఇవ్వడం మొదలుపెట్టారు. అమెరికాలో వాలంటీర్‌గా పనిచేసిన అనుభవంతోనే... జయశ్రీ ముంబయిలో ఈ సాయీషా ఇండియా ఫౌండేషన్‌ని ప్రారంభించారు.

ఊలుతో ‘నాకర్స్‌’ని ఎలా అల్లాలో మొదట తన స్నేహితురాళ్లకు నేర్పారామె. ఒకరి తర్వాత ఒకరు వాటిని నేర్చుకోవడానికి ఆసక్తి చూపించడంతో వాలంటీర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ‘మేమంతా కలిసి అల్లిన నాకర్స్‌ని బాధితులకు ఎలా చేర్చాలో ముందు మాకు అర్థంకాలేదు. దాంతో ముంబయిలోని క్యాన్సర్‌ ఆసుపత్రులూ, వైద్యులను సంప్రదించా. గతంలో ఇటువంటి వాటిని ఎవరూ తయారుచేయకపోవడంతో వీటి గురించి వివరించాల్సి వచ్చింది. ఎక్కువమందికి వీటిని చేర్చాలనే ఉద్దేశంతో ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించి కావాల్సినవాళ్లు సంప్రదించేలా చేశాం. ఓసారి చెన్నై బ్రెస్ట్‌ సెంటర్‌కు చెందిన డాక్టర్‌ సెల్వి రాధాకృష్ణన్‌ మమ్మల్ని సంప్రదించారు. తన దగ్గరకు వచ్చే రొమ్ము క్యాన్సర్‌ బాధితులకు నాకర్స్‌ను అందించమని ఆమె అడిగారు. అప్పుడు ఆవిడ దగ్గర నుంచి రోగుల చిరునామాలు అడిగి తీసుకుని రిజిస్టరు పోస్ట్‌లో వీటిని పంపేదాన్ని. మొదట్లో, నేనూ నా స్నేహితురాళ్లు మాత్రమే వీటిని అల్లేవాళ్లం. మమ్మల్ని చూసిన చాలామంది మహిళలు మేమూ సాయం చేస్తామని ముందుకొచ్చారు. ఇప్పుడు మొత్తం ఐదువందల మంది ఈ పని చేస్తున్నారు. ముంబయిలో మొదలైన మా నాకర్స్‌ తయారీ ఇప్పుడు ప్రపంచమంతా విస్తరించింది. అమెరికా, సౌదీ వంటి దేశాల నుంచి వందలాదిమంది వాలంటీర్లు ఈ నాకర్స్‌ తయారీ పని చేస్తున్నారు. ఇప్పటివరకు మా వెబ్‌సైట్‌ ద్వారా మమ్మల్ని 80వేలమంది ఈ నాకర్స్‌ ఉచితంగా అందించాం. అదే నాకు సంతోషం’ అంటారు జయశ్రీ.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి