భార్యాభర్తలు ఉద్యోగులైతే!
close
Updated : 20/03/2021 06:22 IST

భార్యాభర్తలు ఉద్యోగులైతే!

ఆలుమగలు ఇద్దరూ ఉద్యోగులైతే...సమయాన్ని సర్దుబాటు చేసుకోవాలి. మాట్లాడుకునేందుకు సందర్భాలను సృష్టించుకోవాలి. అలాకాకుండా రోజులు గడిచిపోతుంటే... ఇద్దరిలోనూ అభద్రతాభావం పెరిగిపోతుంది. చిన్న చిన్న గొడవలు సైతం అగాథాన్ని సృష్టిస్తాయి.
ఇద్దరూ వేరు వేరు షిప్ట్‌ల్లో వెళ్తున్నాం....ఒకరి ముఖం ఒకరు చూసుకునే తీరిక కూడా ఉండట్లేదా? అయితే కచ్చితంగా మీ వారాంతాన్ని ఒకే రోజు ఉండేలా కేటాయించుకోండి. అయితే చాలామందిలా మీరూ దాన్ని విశ్రాంతి దినంగా భావించేయొద్దు. రోజులో ఓ గంట సమయాన్ని పడుకోవడానికి కేటాయించినా మిగిలిన రోజులో సగం మీ ఇద్దరికోసం కేటాయించుకోండి.
* రోజంతా ఎంత తీరిక లేకుండా గడిపేసినా సరే... కనీసం ఓ పూట భోజనమైనా ఇద్దరూ కలిసి తినండి. ఆ సమయంలో బయట విషయాల కంటే ఇద్దరికీ సంబంధించిన అంశాలను మాత్రమే చర్చించుకుంటే సరి. నిజానికి ఎంత చెప్పుకున్నా...ఒక అరగంట సమయం కంటే ఎక్కువ అవసరం లేదు కదా!
* మీటింగ్‌లు, పని ఒత్తిడితో ఫోన్‌ చేసి మాట్లాడే సమయం లేనప్పుడు ఓ చిన్న మెసేజ్‌ పెట్టినా చాలు...అర్థం చేసుకుంటారు. అలానే జీవితం యాంత్రికంగా సాగిపోతున్నప్పుడు దగ్గర్లోని గుడికో లేదంటే...కనీసం రెండు రోజుల పాటూ విహారయాత్రకైనా వెళ్లిరండి. దాన్నుంచి బయటపడతారు. అంతేకాదు...భాగస్వామికి మీరిచ్చే చిన్న సర్‌ప్రైజ్‌లు మీ ప్రేమను పదిలపరుస్తాయి.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి